Thursday, January 27, 2011

సారీ సృజన..

ముందుగా సృజన కు సారీ చెప్తున్నాను. కంగారు పడకండి. లేని సృజన కు సారీ ఏంటి అంటారా?? లేని ప్రియ చనిపోయింది అని చెప్పలా?? నేను సారీ చెప్పింది ప్రియ అనే పేరుతొ పెట్టిన టపాలోని ఫోటో ఓనర్ సృజన కు. సారీ చెప్పాల్సిన వ్యక్తితో మాట్లాడాను. ఇది సంగతి ఇలా జరిగింది అని చెప్పాను. సరేలెండి మీ తప్పు లేదుగా అని సెమించేసింది ఆ అమ్మాయి. ఈ విషయం నమ్మినా, నమ్మకున్నా మీ ఇష్టం.

ఇక మిగతా వ్యక్తులు సృజన రామానుజన్, ప్రియ అయ్యంగార్, చైతి కల్యాణి, వైష్ణవి హరివల్లభ, ధనరాజ్ మన్మధ.. సూపర్ క్యారెక్టర్లు. ఒక్కొక్కరికి ఒక్కో హిట్ స్టోరీ.. భలే ఉంది. అతను చెప్పే మాటలు ఫేక్ అనుకున్నా, పెట్టిన ఫోటోలు నెట్ వి అని తెలిసినా వాటి వల్ల నష్టం ఏమి లేదు కదా అని ఊరుకున్నారు అందరూ. అందరూ అంటే అతను మాట్లాడినవాళ్ళు. పరిచయం ఉన్నవాళ్ళు. కాని ఒక్కరంటే ఒక్కరికి ఈ వ్యక్తులు ఉన్నారా అని ఆలోచన రాలేదు. నాకు వాళ్ళు ఎవరితో కలవాలి అనే అవసరం పడలేదు. కలవలేదు కూడా. అనవసరంగా ఎదో ఊహించుకోకండి. అసలు వ్యక్తిని వదిలేసి నన్ను ముద్దాయిని చేస్తున్నారు కాని ఎంతమంది విజయవాడ వెళ్ళి గీతాచార్యను లేదా అతని ఫ్యామిలీ లోని వ్యక్తులను కలవాలి అని ప్రయత్నించారు.?? ముందు ఆ పని మీద ఉండండి.


ఇక ఎప్పుడు ఏ గొడవ జరిగిన ప్రమదావనం మీద పడి ఏడుస్తారు. మావల్ల ఎంతమంది ఎంత నష్టపోయారు కాస్త చెప్పండి. యిపుడు మాకంటే ఎక్కువ బయట బ్లాగర్లు కూడా నమ్మారు. ఆ సంగతి తెలుసుకొని మాట్లాడండి. ఒకే.. యిపుడు జరుగుతున్న గొడవ వల్ల నాకేమి నష్టం లేదు. నా పని నేను చేసుకుంటున్నా. అనవసరంగా మీ సమయాన్నివృధా చేసుకుంటున్నారు. ఒకవేళ అతనికి డబ్బులు ఇచ్చి మోసపోతే వెళ్ళి కలవండి. వసూలు చేసుకోండి.


ఆ అబ్బాయి చెప్పిన మాయమాటలు ఎలా నమ్మారు అని నన్ను అడుగుతున్న పెద్ద మనుష్యుల్లారా?? మీకు తెలిస్తే ఎందుకు అడగలేదు. ఎందుకు నిశ్సబ్దంగా ఉన్నారు? ఇప్పుడు తెగ రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. నాకు ఇది తెలియాలి. నాకేనా అందరికీ తెలియాలి. తెలియాలి .. తెలియాలి ..మరో ముఖ్య విషయం..ఇది పవన్ కోసం..

అబ్బాయ్ పవన్.. నీ వెనకాల ఉండి నా మీద అడ్డమైన రాతలు రాయిస్తున్న అక్కాయ్ ఎవరో నాకే కాదు ఎంతో మందికి తెలుసు. నువ్వు అనవసరంగా బకరా అవుతున్నావు అది తెలుసుకో. ఎవరో ఎదో చెప్పారని ప్రమదావనం మీద ఇష్టమొచ్చినట్టు రాయకు. ఏదైనా ఉంటే నాతో మాట్లాడు. మెయిల్ చేయి.. చెప్తాను.


ఇప్పుడు జరిగిన సంఘటనను అందరూ ఒక పాఠంలా గుర్తుంచుకుంటే మంచిది. కాని మోసం, అబద్ధం, అసూయ , ద్వేషం కలకాలం నిలవవు. ఎప్పుడో ఒకప్పుడు అవి బయటపడతాయి. నిజం నిలకడ మీద తప్పకుండా తెలుస్తుంది.

4 వ్యాఖ్యలు:

ranjani

please keep this post alive forever.
this is my personal request. And can
we learn / have we learnt any life long
lesson from the incident - please devote
few minutes on this. Thank You.

భాస్కర రామిరెడ్డి

అవునండీ జ్యోతీ గారూ, ఈ టపా ఒక్కరోజుకోసమే ఎందుకని? ఎక్కువ రోజులుంటే మీ బ్లాగును ఎవరైనా కబ్జా చేస్తారా? లేక మరేదైనా కారణమా?

జ్యోతి

రంజనిగారు, అలాగంటారా?ఐతే వాకే ఒక పాఠంలా గుర్తుండాలి అంటే ఉంచేస్తాను ఈ టపాను.

భాస్కర్, నిజమే కబ్జా చేస్తారని, అసలు విషయం ఆలోచించకుండా ఇష్టమున్నట్టు మాట్లాడతారని తీసేస్తా అన్నాను.

ఒక మోసం జరిగింది. దానివల్ల జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దాన్ని పూడ్చలేము. కాని ముందు ముందు జాగ్రత్తపడితే మంచిది.

కత పవన్

ఎవరో ఎదో చెప్పారని ప్రమదావనం మీద ఇష్టమొచ్చినట్టు రాయకు
-------------
ఎక్కడ రాసానో కాస్త లింక్ ఉంటే ఇస్తారా

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008