బ్నిం గారితో రేడియో జోష్ ముచ్చట్లు
రేడియో జోష్...
ఇవాల్టి నుండి వరుసగా నాలుగు రోజుల పాటు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్ లో కలర్ స్కేప్స్ అనే పేరుతో ముఖీ మీడియా వారి సౌజన్యంతో చిత్రకళా ప్రదర్సన ఏర్పాటు చేయబడుతుంది. ఈ కళాప్రదర్శనలో వేర్వేరు ప్రాంతాల నుండి వచ్చిన సుమారు 40 మంది చిత్రకారుల 400 పైగా చిత్రాలను ప్రదర్శనలో ఉంచుతున్నారు. ప్రముఖ చిత్రకారుడు , దర్శకుడు బాపుగారి జన్మదిన సందర్భంగా ఈరోజు సాయంత్రం ఈ కళాప్రదర్శన ప్రారంభించబడుతుంది. ఈ చిత్రాలన్నీ ప్రదర్శనకే కాకుండా అమ్మకాలు కూడా ఉంటాయని నిర్వాహకులు ముఖీ మీడియా వారు తెలియచేసారు. ఈ కళా ప్రదర్శనకు రేడియో జోష్ రేడియో పార్టనర్ గా ఉంది.. ఈ రోజు సాయంత్రం జరిగే ప్రారంభ కార్యక్రమ విశేషాలు రేడియో జోష్ లో ప్రత్యక్షంగా వినొచ్చు.. ఈ సందర్భంగా నాలుగు రోజుల క్రింద అంటే ఆదివారం సాయంత్రం ముఖీ మీడియా CEO పావని ప్రసాద్ గారు, ప్రముఖ రచయిత,కార్టూనిస్ట్ బ్నిం గారు రేడియో జోష్ స్టూడియోకి వచ్చారు. ఆ ఇంటర్వ్యూ మీరు వినండి మరి..
ఒక surprise.... ఈ ఇంటర్వ్యూలో మనందరికీ ఇష్టమైన వ్యక్తి ఒకరు వచ్చి కొన్ని ముచట్లు చెప్తున్నారు మరి..
రేడియో జోష్ లో ప్రతీ ఆదివారం సాయంత్రం 7.30 గంటలకు బ్నిం ఆడియో కథలు ప్రసారం చేయబడతాయి. మర్చిపోకుండా వినండి..
3 వ్యాఖ్యలు:
నిజంగా ...భలే సర్ప్రైజే
Thank you JyOti gaaroo. You have given a very good audio file.
చాలా ఉపయుక్తమీన ఆడియో క్లిప్...బ్నిం గారి గురించి వినడమూ, చదవడమూ తప్ప ఆయనగురించి ఆయనమాటల్లో వినడం ఇదే ప్రధమం....ధన్యవాదాలు జ్యోతిగారు
Post a Comment