Happy Birthday Jo
ఒక చోట అందరూ గుమిగూడి ఉన్నారు. కిందకు నీళ్ళలోకి తొంగి చూస్తున్నారు. ఇంతలో ఒకబ్బాయి నీళ్ళలో దూకాడు. ముందు మునిగిపోయినా మెల్లిగా ఈదుకుంటూ పైకి వచ్చాడు. అందరూ అతన్ని అభినందించారు.. కాని అతను మాత్రం కోపంగా అరిచాడు.. ఎవర్రా ? నన్ను నీళ్ళలో తోసింది? నాకు అసలే ఈత రాదు. ఏదో ప్రాణభయంతో కాళ్ళు చేతులు ఆడిస్తూ పైకి వచ్చా."""
ఈ కథ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా?? ఏం లేదండి కొద్ది రోజులుగా ఊరికే ఇదే ఆలోచన వస్తుంది. అసలు హాయిగా టీవీ సీరియళ్లు చూసుకుంటూ టైం పాస్ చేసేదాన్ని . ఊరికే టీవీ ముందు సెటిల్ అవుతున్నానని నెట్ లోకి తోసేసారు మావారు , కొడుకు. ఇక్కడ కూడా రాయమంటూ ప్రోత్సహించి ముందుకు తోసారు తోటి బ్లాగర్లు. సరే అని ఏదో తోచింది రాసుకుంటుంటే పత్రికల్లో రాయమన్నారు .. సరే అని అది ట్రై చేశా.. యిపుడు బ్లాగు రాయడం సంగతి ఏమో కాని ఇంట్లో కూడా తీరడం లేదు. ఎవరితో కలవడానికి కూడా టైం సరిపోవడం లేదు. అందరూ తిడుతున్నారు. అసలు ఉన్నావా లేదా అని. ప్చ్.. ఏం చేయను. అందుకే అప్పుడపుడు అనుకుంటాను ఎవర్రా నన్ను రాయమని తోసింది అని...
కాని .. ఈ జాలం వల్ల నాకు ఎంతో మంది వ్యక్తులు పరిచయమై ఆత్మీయ స్నేహితులుగా మారారు. ఒక్కోసారి ఆ అభిమానం, ఆప్యాయత, గౌరవం చూస్తుంటే ఆశ్చర్యంగా, విస్మయంగా ఉంటుంది. ఏమిటీ సంబంధం?, ఎందుకీ అనుబంధం?.. వారంతా సంతోషంలో, బాధలో నాకు తోడుగా ఉండి నాతో పాటు సంతోషించారు, ఓదార్చారు. తప్పులుంటే ఎత్తి చూపారు. సరిదిద్దారు. వంట, ఇల్లు, పిల్లలు , కుటుంబం తప్ప వేరే తెలీని, పెద్ద చదువులు లేని నన్నుఈ స్థాయికి చేరుకోవడానికి, నాకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవడానికి ప్రోత్సహించిన వారందరికీ నా పుట్టినరోజు సందర్భంగా హృదయ పూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇంతకంటే ఏమివ్వగలను??? సామాన్య గృహిణి నుండి ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ గా మారడానికి సహకరించిన పెద్దలకు నమస్సులు. అంతేకాక ఈ ఏడాది చాలా బాగా గడిచింది. అమ్మాయి పెళ్లి బాగా జరిగింది. తను సంతోషంగా ఉంది. అబ్బాయి కూడా మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాడు. అమ్మాయి దూరంగా ఉన్నా అబ్బాయి ఇక్కడే మాతోనే ఉన్నాడు. సో హ్యాపీస్..
అసలు పుట్టినరోజు అంటే జీవితంలో ఒక ఏడాది తరిగిపోవడమే. అందులో చెప్పుకోవడానికి ఏముందని? .. పదిమందికి ఉపయోగపడితేనే ఆ పుట్టినరోజుకు ఆ జన్మకు సార్ధకత లభిస్తుంది. ఇలా అంటున్నాను కదా అని నా ప్రయాణం ఇంతటితో అయిపోయిందని అనుకోవడం లేదు. ఇంకా ముందుముందు ఏం జరుగుతుందో కూడా ఆలోచించ దలుచుకోలేదు. ఆంతా ఆ జగన్మాత దయ. ఎలా తీసికెళ్తే అలా వెళ్ళిపోవడమే..
36 వ్యాఖ్యలు:
Happy Birth Day Jo!
I was waiting for this your post!
cheers
zilebi.
హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు జ్యోతి గారూ
మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
శతమానంభవతి......జన్మదిన శుభాకాంక్షలు
జ్యోతి గారూ,మీకు నా హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు!
పుట్టిన రోజు శుభాకాంక్షలు! మీరు మరిన్ని(చాలా) పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తున్నాను.
Many many happy returns of the day, Madam.
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు జ్యోతి గారూ.
మీరు నిండు నూరేళ్ళూ ఇలాగే అందరికీ "జ్యోతి వెలుగులు" పంచాలని మనస్ఫూర్తిగ కోరుకుంటూ...
గీతిక
జ్యోతి,
నీ ప్రతి పుట్టిన roju ఇంతే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
కల్పనరెంటాల
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...
హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు జ్యోతి గారూ
జ్యోతి గారూ మీకు జన్మదిన శుభాకాంక్షలు!
జ్యోతిగారు, జన్మదిన శుభాకాంక్షలు.
జ్యోతి గారు. హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఇలాగే ప్రతి సంవత్సరం ఆనందంగా జరుపుకోవాలని ..ఆకాంక్షిస్తూ..
హృదయపూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు జ్యోతి గారూ
హౄదయపూర్వక జన్మదిన "సుభా" కాంక్షలు జ్యోతి గారూ !!
జ్యోతి గారు మీకు హృదయపూర్వక
పుట్టినరోజు శుభాకాంక్షలు..
Many Many Happy Returns Of The Day..
పుట్టినరోజు శుభాకాంక్షలు జ్యోతిగారూ,హావ్ ఎ నైస్ డే
Happy BirthDay
Many many happy returns of the day, Madam.
పుట్టిన రోజు శుభాకాంక్షలు జ్యోతి గారూ..
జ్యోతి గారూ ... జన్మదిన శుభాకాంక్షలు!
Many Many Happy Returns of the Day Jyothi garu..
ఎవరో తోసినా కూడా you emerged as victorious! And an inspiration to many. Keep going and I wish you all the best.. :)
Many Happy Returns of the Day.
జ్యోతి గారు ,
మీకు సంకలిని తరఫున జన్మదిన శుభాకాంక్షలు.
http://www.sankalini.org/
మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
మీకు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
జ్యొతి గారు,హ్రుదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
పుట్టినరోజు శుభాకాంక్షలు .
జ్యోతి గారూ జన్మదిన శుభాకాంక్షలు
జిలేబిగారు నా పుట్టినరోజు నాకంటే ఘనంగా చేసారు, దానికోసం చాలా హోమ్ వర్క్ చేసారు. ధన్యవాదాలు
శంకర్ గారు ధాంక్స్ అండి
రసజ్ఞగారు , విజయమోహన్ గారు ధన్యవాదాలు
శర్మగారు ధన్యవాదాలు,
పద్మవల్లి, మురళీమోహన్ గారు,కడపరుగు, గీతిక
మీ అభినందనలకు ధన్యవాదాలు..
కల్పన ధాంక్ యూ
శ్రీలలితగారు, సుధామగారు, డా.రాఘవేంద్రగారు, నాగమురళి, వనజ, సుభ, వేణు, ధాంక్స్...
రాజి, లత, జ్యోతిర్మయి, సందీప్, శివ, తేజస్వి, అప్పారావు, మేధ.. చాలా చాలా ధాంక్స్
లక్ష్మిగారు, వీరయ్యగారు, శశి, మాలాగారు, సుబ్రహ్మణ్యంగారు ధన్యవాదాలండి..
Happy Birth Day Jyoti garu. మీకు నా హృదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.
ఆలశ్యంగా పుట్టిన రొజు శుభాకాంక్షలు చెబుతున్నందుకు ఏ మనుకోరని నా నమ్మకం. మీలాంటి వారి పరిచయం కలగటం బ్లాగుల వల్లే !శుభాశీస్సులతో....పద్మప్పారావు.
Post a Comment