ఇంతలోనే ఎంత వారయ్యారు??
బుడి బుడి అడుగులతో ఇల్లంతా తిరుగుతూ
ఏడుపులు, అల్లరితో కేరింతలు కొడుతూ
అన్నం తిందురా అంటే నాకొద్దు పో అని విసిగిస్తూ
స్కూలు కెళ్లాలి లేమ్మా అంటే నేను పోను అని మారాం చేసే పిల్లలు
అమ్మ మాటలతో, నాన్న లాలనతో ఎదుగుతూ
ఆటపాటలతోపాటు జీవిత పాఠాలు కూడా నేర్చుకుంటూ
ఇంతలా ఉన్నవారు అప్పుడే ఎంతలా ఎదిగిపోయారు
గువ్వలా పొదుముకుని కాపాడుకున్న చిన్నారులు
పెద్దలనే పిల్లలను చేసి మేమున్నాం కదా అంటున్నారు.
ఎంత అల్లరి చేసినా అమ్మ కంట కన్నీరు చూడలేని ఆ చిన్ని మనసులు
చెప్పకనే అమ్మ మనసు తెలుసుకుని చేతులతో ఆమెను బంధించి అదిలిస్తారీనాడు..
ఈ బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే ఉండేనా??
ఈ అనుభూతిని పదిలపరుచుకున్న ఈ క్షణం ఇలా స్తంభించిపోదా....
17 వ్యాఖ్యలు:
తల్లి ప్రేమలోని లాలిత్యాన్ని, మధురిమలని చాలా బాగా చెప్పారండీ..
ఈ అనుబంధాలని
అందించిన ఆ పరంధామునికి
బంధాలని అనుసంధించ వె జిలేబి
బంధం కాలమెల్ల అనురాగబంధమై వెలగ !
చీర్స్
జిలేబి.
So Sweet! So Sweet !
అనుబంధాలలో వున్న ఆనందం అక్షరాల్లో బంధించలేనిది.
మదినిండా నిండిన మల్లెల పరిమళాన్ని అస్వాదించగలమే తప్ప అనువదించలేము.
అయినా మీ భావాలను అందంగా చెప్పారు.
ఆ భగవంతుడు మిమ్మల్ని ఎప్పటికీ ఇలాగే ఆశీర్వదించాలని ప్రార్ధిస్తున్నాను.
Repeat Sujatha' s comment..
వెరీ నైస్. చాలా బాగుంది.
Very Nice..
అందరికి పేరు పేరునా ధన్యవాదాలు.. ఎందుకో పిల్లల చిన్నప్పటి ఫోటోలు చూస్తుంటే ఇలా అనిపించింది. అప్పుడే ఎంతవారయ్యారు అని??
chakkagaa cheppaaru.meeru andaru ilaage santoshamgaa undaali
పిల్లల చిన్నప్పటి ఫోటోలు చూస్తుంటే వారి ముద్దు మాటలు,బుడిబుడి నడకలు మరోసారి గుర్తుకొస్తాయి.మీ భావన బాగుంది.
బాగుంది .
పుత్రోత్సాహము తండ్రికి .. ఎట్సెట్రా ..
చాలా సంతోషం.
chaala baga rasaru andi.. bagundi
baagundi..
mee kadha chadivaka naaku atmavisvasam ante nijamina ardham telisindi.....very thankful to you.
fortunate are those parents whose chidren return the affections and care, that have been showered upon them in their growing up years....once in a while these memories will
re-energize and enrich our minds and souls..very nice Jyothi garu....
No words....
Post a Comment