సంప్రదాయ ముగ్గులు - కినిగె ebook
సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ
రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి.
అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. అయినా పుష్యమాసంలో,
హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి
మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది జనవరి మాసంలో
వస్తుంది. మకర సంక్రాంతి రోజున, అంటే జనవరి 15 తేదీన సూర్యుడు ఉత్తరాయణ
పథంలో అడుగుపెడతాడు. ఈరోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు
పేర్కొన్నాయి.
ఇక సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ, నెలరోజులు గజగజ వణికించే చలిని కూడా లెక్క చేయక స్త్రీలు తమ ఇంటిముందు కల్లాపి చల్లి రోజకో రకమైన ముగ్గు వేసి, రంగులు, గొబ్బెమ్మలు, పూలతో అలంకరిస్తారు. మరి అందరికి ముగ్గులు రావు కదా అంటారా?? కినిగె వారి సహకారంతో ఐతే నాకు వచ్చిన, తెలిసిన, తెలుసుకున్న ముగ్గులతో ఓ ముగ్గుల పుస్తకం తయారు చేసాను. ఇది eబుక్. ఈ పుస్తకం కొనుక్కుని కాని, అద్దెకు తీసుకుని కాని ప్రపంచంలో ఎక్కడున్నా మీ కంప్యూటర్ లోకి దింపుకుని ముగ్గులు నేర్చుకోండి.. మీకు ముగ్గులు వేసే ఆసక్తి లేదు అనుకుంటే మీవాళ్లకు, మీ ఇంట్లోవాళ్లకు, స్నేహితులకు బహుమతిగా కూడా ఇవ్వొచ్చు.. ఎలాగంటే ఈ లింకులో చూడండి..
సంప్రదాయ ముగ్గులు
సంప్రదాయ ముగ్గులు On Kinige ఇక సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ, నెలరోజులు గజగజ వణికించే చలిని కూడా లెక్క చేయక స్త్రీలు తమ ఇంటిముందు కల్లాపి చల్లి రోజకో రకమైన ముగ్గు వేసి, రంగులు, గొబ్బెమ్మలు, పూలతో అలంకరిస్తారు. మరి అందరికి ముగ్గులు రావు కదా అంటారా?? కినిగె వారి సహకారంతో ఐతే నాకు వచ్చిన, తెలిసిన, తెలుసుకున్న ముగ్గులతో ఓ ముగ్గుల పుస్తకం తయారు చేసాను. ఇది eబుక్. ఈ పుస్తకం కొనుక్కుని కాని, అద్దెకు తీసుకుని కాని ప్రపంచంలో ఎక్కడున్నా మీ కంప్యూటర్ లోకి దింపుకుని ముగ్గులు నేర్చుకోండి.. మీకు ముగ్గులు వేసే ఆసక్తి లేదు అనుకుంటే మీవాళ్లకు, మీ ఇంట్లోవాళ్లకు, స్నేహితులకు బహుమతిగా కూడా ఇవ్వొచ్చు.. ఎలాగంటే ఈ లింకులో చూడండి..
సంప్రదాయ ముగ్గులు
0 వ్యాఖ్యలు:
Post a Comment