మాలిక పత్రికలో సంభవం (సూర్యదేవర రామ్మోహన్ రావు)
మాలిక పత్రిక మెల్లిమెల్లిగా తన ప్రమాణాలను మెరుగు పరుచుకుంటూ కొత్త ప్రయోగాలు చేస్తుంది.. అందులో భాగమే అంతర్జాల అవధానాలు.. మరో విశేషం .. మే నెలనుండి మాలిక పత్రికలో ప్రముఖ అనేకంటే సంచలన రచయిత సూర్యదేవర రామ్మోహన్ రావుగారు రచించిన సంచలనాత్మక నవల " సంభవం" సీరియల్ గా రాబోతుంది.. ఈ సందర్భంగా రచయిత సూర్యదేవర రామ్మోహన్ గారితో చిన్న మాటామంతి ఏర్పాటు చేయడమైంది. మీరు కూడా ఆయనను ఏమైనా అడగాలనుకుంటున్నారా. వ్యాఖ్యల ద్వారా మీ ప్రశ్నలను పంపించగలరు. మీ తరఫున నేను అడుగుతాను. ..
మనిషి
చనిపోగానే క్రయోనికల్గా
అతని శవాన్ని సస్పెండ్
చేసి, అత్యంత జాగ్రత్తగా
భద్రపరిచి, తిరిగి అతడ్ని
బ్రతికించేందుకు చేస్తున్న
అధ్బుత శాస్త్ర పరిశోధనలపై
వెలుపడిన మొట్టమొధటి నవల-
సంభవం
మృత్యువుని
జయించటానికి ప్రపంచవ్యాప్తంగా, అతి
రహస్యంగా జరుగుతున్న శాస్త్ర
పరిశోధనలపై వెలుపడిన తొలి
నవల-
సంభవం
చనిపోయిన
మనిషి శరీరాన్ని భద్రపరిచి
ప్రాణం పోయగలిగే అవకాశం
సైన్స్కి లభించినప్పుడు
ఆ ప్రాణిలోకి పూర్వపు
ఆత్మే ప్రవేశిస్తుందా? లేక
కొత్త ఆత్మ ప్రవేశిస్తుందా?
ట్రిలియన్
డాలర్ల ప్రశ్న...
జాతస్యహి
ధృవో మరణం...
పుట్టినవాడు
గిట్టక మానడు
ధృవో
జననం మృతస్యచ...
గిట్టినవాడు
తిరిగి పుట్టక మానడు
అని
చెప్పిన శ్రీ కృష్ణభగవానుడి
గీతోపదేశానికి సైన్స్ విసురుతున్న
సవాల్ ఎలాంటిది...? అది
సవాలా? లేక సైన్స్
చేసే ప్రేలాపనా?
అద్యంతం
ఉత్కంఠతో చదివించే అద్భుతమైన
నవల-
సంభవం
మీ
అభిమాన రచయిత
సూర్యదేవర రామ్మొహనరావు మరో సంచలనాత్మక నవల- సంభవం
THERE IS NO DEATH: THE STARS GO DOWN
TO RISE UPON SOME OTHER SHORE.
AND BRIGHT IN HEAVEN’S JEWELED CROWN,
THEY SHINE FOR EVER MORE.
-JOHN L.Mc Creery.
1 వ్యాఖ్యలు:
అసలు టాపిక్ భలే థ్రిల్లింగ్ గా ఉంది.నిజంగా ఇలాంటి పరిశిధనలు ఎ దేశం లో చేస్తారు?
Post a Comment