Saturday, June 29, 2013

ఎవరేమీ అనుకున్నా....

ప్రతీ మనిషికి జీవితంలో పోరాటం తప్పదు. ఎంత ధనవంతులైనా, పేదలైనా, చదువుకున్నా, చదువుకోకున్నా కష్టాలు, సుఃఖాలు, సమస్యలు తప్పవు. కాని అలా సమస్యలు వచ్చినప్పుడు ఎదుటివాడి మీద నింద వేయడం పరిపాటి. వాళ్ల వల్లనే ఇలా జరిగింది. నా జీవితం నాశనం చేసారు. లేకుంటే నేను అందలం ఎక్కి ఉండేవాన్ని. ఈ సమస్యకు పరిష్కారం లేదు. చావు తప్ప వేరే మార్గం లేదు. వెదవ జీవితం ఎప్పుడూ ఒకరిమీద ఆధారపడి ఉండాలి. నాకంటూ స్వేచ్ఛ లేదు. సంతోషం లేదు.. నా జీవితంలో అసలు సంతోషం, విజయమనేది ఉంటుందా? ఎవ్వరూ నన్ను గుర్తించరు, నాకంటూ ప్రత్యేకమైన ప్రతిభ లేదు, ఆస్తిపాస్ధులు లేవు.. పెద్దలిచ్చిన మణులు, మాన్యాలు లేవు. ఉధ్యోగంలో వచ్చే జీతం ఏం సరిపోతుంది. నా జీవితమింతే ఎదుగుబొదుగు లేదు. ఇలాగే అసంతృప్తితో చావాల్సిందే. 

ఇలా ఎంతోమంది అనుకుంటుంటారు. కాని ఒక్కసారి ఈ జరుగుతున్న పరిణామాలలో నావంతు పాత్ర ఏముంది. నన్ను నేను ఎలా మార్చుకోగలను? పోరాడగలను? సమస్యలకు పరిష్కారం ఎలా ఆలోచించాలి? అంటూ ఆలోచన మొదలెడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. పోరాడే శక్తి వస్తుంది. ఎంత పెద్ద సమస్య ఐనా చిన్నగానే ఉంటుంది. ఒకవేళ నష్టం వచ్చినా పర్లేదులే తర్వాత సరిదిద్దుకోవచ్చు. లేదా మనకింతే ప్రాప్తం. దానిగురించి బాధపడుతూ ఇక్కడే ఆగిపోకుండా వేరే పని చేద్దాం అన్న పాజిటివ్ ధింకింగ్ అలవడుతుంది. కాదంటారా? ఈ పాట వినండి. అందులో ప్రతీ లైన్ మళ్లీ మళ్లీ అర్ధం చేసుకోండి. మీ జీవితానికి అన్వయించుకోండి. పని చేస్తుంది.. సందేహమా?? ఇది అక్షరాలా సాధ్యమవుతుంది అనడానికి నేనే నిదర్శనం.. అందుకే ఎప్పుడైనా కాస్త దిగులుగా ఉన్నప్పుడు ఈ పాటను మళ్లీ మళ్లీ వింటాను. తొందరగా తేరుకుని మళ్లీ నా పనిలో పడతాను. మీరూ ట్రై చేయండి.. సమస్యలు తీరడానికి పూజలు, ఉంగరాలు, నోములు, వ్రతాలు చేసే బదులు లేదా చేస్తూనే మిమ్మల్ని మీరు ధృడంగా తయారు చేసుకోండి..ఎవరేమీ అనుకున్నా నువ్వుండే రాజ్యాన
రాజు నువ్వే బంటూ నువ్వే మంత్రీ నువ్వే సైన్యం నువ్వే
ఏమైనా ఏదైనా నువ్వెళ్ళే బడి లోన
పలకా నువ్వే బలపం నువ్వే ప్రశ్నా నువ్వే బదులూ నువ్వే..
అన్నీ నువ్వే కావాలి అనునిత్యం పోరాడాలీ..
అనుకున్నది సాధించాలీ...

అవమానాలే ఆభరణాలు.. అనుమానాలే అనుకూలాలు..
సందేహాలే సందేశాలు.. ఛీత్కారాలే సత్కారాలూ...
అనుకోవాలీ.. అడుగేయాలీ ముళ్ళ మార్గాన్ని అన్వేషించాలీ..
అలుపొస్తున్నా కలలే కన్నాపూల స్వర్గాన్ని అధిరోహించాలీ..
ఎవరికి వారే లోకంలో.. ఎవరికి పట్టని శోకం లో.. నీతో నువ్వే సాగాలీ..

బలమూ నువ్వే.. బలగం నువ్వే.. ఆటా నీదే.. గెలుపూ నీదే..
నారూ నువ్వే .. నీరూ నువ్వే.. కోతా నీకే.. పైరూ నీకే..
నింగీ లోనా తెల్ల మేఘం నల్లబడితేనే జల్లులు కురిసేనూ..
చెట్టు పైనా పూలూ మొత్తం రాలిపోతేనే పిందెలు కాసేనూ..
ఒక ఉదయం ముందర చీకట్లూ.. విజయం ముందర ఇక్కట్లూ..
రావడమన్నది మామూలూ..

3 వ్యాఖ్యలు:

వనజ తాతినేని

Inspiration, inspiration, Inspiration.

ranivani

బావందండీ మీరు చెప్పినది నిజంగా నిజం . పాట ఏదైనా చిత్రంలోదా?లేక ప్రైవేట్ సాంగా?

జ్యోతి

నాగరాణిగారు ఈ పాట బడ్జెట్ పద్మనాభం సినిమాలోనిది. జగపతిబాబు, రమ్యకృష్ణ నటించారు..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008