IndiBlogger Awards
బ్లాగు మిత్రులందరికీ ఒక విన్నపం:
నా బ్లాగు మిత్రులకు నా గురించి , నా బ్లాగు గురించి తెలుసు. ఐనా మరోసారి నా
బ్లాగు గురించి కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా.. అసలు నా బ్లాగు
"జ్యోతి" నన్ను నాకు పరిచయం చేసింది అని చెప్పవచ్చు. నాకు తెలీని నాలోని
మరో జ్యోతిని వెలికితీసి నా హృదయభానుగా మారిపోయింది నా బ్లాగు. ఇందులో ఒక
ప్రత్యేకమైన అంశమంటూ రాయలేదు. నాకు తోచిన, నచ్చిన అంశాలు, ఆలోచనలు.
స్పందనలు, భావాలు అన్నీ దాచుకున్నాను. మిత్రులతో పంచుకున్నాను. తెలుగు
రాయడం చాలా సులువని తెలిసిన మరుక్షణాన బ్లాగు ప్రారంభించి నాకు నచ్చిన
వ్యాపకాలను విడివిడిగా బ్లాగుల రూపంలో మార్చుకున్నాను. కాని అన్నింటికి
మూలస్ధానం. నన్ను నేను మళ్లీ మళ్లీ తరచి చూసుకునే ఒకే ప్రాంగణం నా బ్లాగు..
అందుకే నా జీవితంలో నా పుట్టినరోజుతో పాటు నా బ్లాగు పుట్టినరోజును కూడా
సగర్వంగా, సంతోషంగా, ఏదో సాధించానన్న ఆత్మసంతృప్తితో జరుపుకుంటున్నాను. ఈ
నా బ్లాగ్రయాణంలో నాకు మొదటినుండి తోడుగా ఉండి, ప్రోత్సహించి, సందేహాలు
తీర్చిన మిత్రులకు సదా కృతజ్ఞురాలనై ఉంటాను.
అందుకే భారతీయ
భాషలలోని బ్లాగులను నిక్షిప్తపరిచిన ఇండీబ్లాగర్ వాళ్లు నిర్వహిస్తున్న
బ్లాగు పోటీలలో నా బ్లాగు " జ్యోతి " ని తెలుగు విభాగంలో నిలబెట్టాను.
నన్ను, నా బ్లాగును ఆదరిస్తున్న మిత్రులకు ఒక విన్నపం. ఈ పోటీలో నన్ను, నా
బ్లాగును గెలిపించాలని కోరుకుంటున్నాను. ఇతర భాషలల్లో లాగే తెలుగు బ్లాగులు
కూడా చాలా ప్రముఖంగా ఉన్నాయని తెలియజేయాలని చిన్ని కోరిక...
మీ వ్యాఖ్యలను ఇక్కడ రాయగలరు..
http://www.indiblogger.in/iba/entry.php?edition=1&entry=11097
రాసింది జ్యోతి at 21:06 4 వ్యాఖ్యలు
వర్గములు కబుర్లు