Tuesday, July 23, 2013

అంతర్జాలంలో తెలుగు నిఘంటువులు
మీకు ఎప్పుడైనా తెలుగు పదానికో, ఇంగ్లీషు పదానికో అర్థం తెలుసుకోవాలి అనిపించిందా? ఫలానా ఇంగ్లీషు పదానికి తెలుగు అర్థమేంటో? ఫలానా తెలుగు పదాన్ని ఇంగ్లీషులో ఏమంటారో? దాని పర్యాయ పదాలు ఎన్ని ఉన్నాయో? ఏదైనా పుస్తకం లేదా పురాణ గ్రంథం చదువుతుంటే మధ్యలో ఒక పదం అర్థం కాలేదు అన్నప్పుడు ఏం చేస్తారు. పండితులైన వారిని అడుగుతారు. కాని వాళ్లు మనకు అన్ని వేళలా అందుబాటులో ఉండరు. ఒక్కోసారి వాళ్లకు తెలియకపోవచ్చు. మరి అలాంటప్పుడు అందరికీ గుర్తుకొచ్చేది నిఘంటువు లేదా పదకోశం. నిఘంటువు చూడడంవల్ల ఒక పదానికి ఎన్ని అర్థాలున్నాయో తెలుస్తుంది. అర్థచాయలు అవగతమవుతాయి. స్పెల్లింగ్ తెలుస్తుంది. పదప్రయోగాలు బోధపడతాయి. దీనివల్ల ఏ పదాన్ని ఎలా ఉపయోగించాలో, ఏ సందర్భంలో ఎలా వాడాలో అర్థమవుతుంది. నిఘంటువు వయసు తేడా లేకుండా ఎప్పుడో ఒకప్పుడు పిల్లలకు పెద్దలకు అందరికీ అవసరం వస్తుంది. ఒకప్పుడు ప్రతీ ఇంట్లో ఈ నిఘంటువు ఉండేది కాని, నేడు సాంకేతికత అభివృద్ధి చెందడంతో అంతర్జాల సాయంతో ఏదైనా తెలియని విషయమైనా, పదమైనా అర్థం తెలుసుకునే వీలు ఉంది. కాని అచ్చంగా నిఘంటువులు అందునా తెలుగు నిఘంటువులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార రీత్యా ప్రపంచంలోని అన్నిదేశాలలో నివసిస్తున్న తెలుగువారికి ఇలా అంతర్జాలంలో నిఘంటువులు ఎంతో ఉపకరిస్తాయి. అంతేకాదు ఈ నిఘంటువులు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి. ఈ నిఘంటువులను డిజిటలైజ్ చేసి అందరికీ అందుబాటులో ఉంచింది ప్రభుత్వమో, విశ్వవిద్యాలయమో, అధికార భాషా సంఘమో కాదు. ఔత్సాహికులు, తెలుగు భాషాభిమానులైన వ్యక్తులు తమ స్వంత ఖర్చుతో ఈ నిఘంటువులను సేకరించి, వాటి హక్కుదారులనుండి అనుమతి తీసుకుని టైప్ చేయించి జాలంలో పెడుతున్నారు. దీనివలన వారికి ఎటువంటి ఆదాయం లేకున్నా ఈ తరానికి భావి తరానికి తెలుగు భాషను అందజేయాలనే నిస్వార్థమైన అభిలాషతో ఇవన్నీ చేస్తున్నారు.

ఎన్నో ఏళ్లుగా అందరికీ ముఖ్యంగా స్కూలు పిల్లలున్న ప్రతీ ఇంట తప్పనిసరిగా ఉండే నిఘంటువు శంకర నారాయణ డిక్షనరీ.. ఈ డిక్షనరీ, తెలుగు పదాలకు ఇంగ్లీషు అర్థాలు, ఇంగ్లీషు పదాలకు తెలుగులో అర్థాలు, తెలుగు పదాలకు తెలుగులో అర్థాలు తెలిపే శబ్ద రత్నాకరం, పత్రిక భాషా నిఘంటువులను ఈ లంకెలో చూడవచ్చు.
http://21stcenturytelugu.blogspot.in/2011/10/blog-post_5743.html   ఇక్కఢ నిఘంటువులను టైప్ చేసి కాకుండా స్కాన్ చేసి పెట్టారు. పుస్తకంలోలాగే పేజీలు తిప్పుకుంటూ చదువుకోవచ్చు.

అందరికీ తెలిసిన బ్రౌణ్య నిఘంటువు కూడా లభిస్తుంది.
http://dsal.uchicago.edu/dictionaries/brown/

అంతేకాక సూర్యరాయాంధ్ర నిఘంటువు, మరి కొన్ని తెలుగు నిఘంటువులను ఇక్కడ చూడవచ్చు.

http://www.teluguthesis.com/search/label/Dictionary

తెలుగు మాత్రమే కాధు తెలుగు పదాలకు సంస్కృతలో అర్ధాలు, సంస్కృత పదాలకు తెలుగులో అర్ధాలు ఇక్కడ లభిస్తాయి. 

http://www.teluguthesis.com/%202013/03/%20sanskrit%20-%20telugu%20-%20telugu-sanskrit.html#

ఈ నిఘంటువులన్నీ అంతర్జాలంలో అంధుబాటులో ఉంచింది ఎటువంటి స్వప్రయోజనం ఆశించి కాదు. దీనివల్ల మాకేంటి లాభం అని ఆలోచించకుండా సమాజానికి, భావి తరాలవారికి ఉపయోగపడాలనే సదుద్దేశ్యంతో ఈ నిఘటువులను ఏర్పాటుచేస్తున్నారు. ఒకోసారి ఒక నిఘంటువులో దొరకని సమాధానం కోసం మరికొన్ని నిఘంటువులను వెతకక తప్పదు. అందుకు చాలా సమయం పడుతుంది. అందుకే శేషతల్పశాయి, నాగభూషణరావులుకలసి ప్రారంభించిన ఆంధ్ర భారతి అనే సైటులో నేడు 31 వివిధ నిఘంటువులను చేర్చారు. మీకు కావలసిన పదం ఇంగ్లీషు, తెలుగు, సంస్కృతం ఏ భాషలో ఉన్నా వాటి అర్థాలు, పర్యాయపదాలు, మాండలికాలు మొదలైన వివరాలు క్షణంలో లభిస్తాయి. ఈ ఆంధ్రభారతిలో ఎంతో శ్రమకోర్చి, నిఘంటువులను సేకరించి, టైప్ చేయించి నిక్షిప్త పరుస్తున్నారు. ఇక్కడ ఇంగ్లీషులో లేదా తెలుగులో టైప్ చేసే సౌకర్యం, నిఘంటువుల ఎంపిక మొదలైన సదుపాయం కూడా ఉంది. ప్రపంచంలో ఏ మారుమూల ఉన్నా ఆంధ్రభారతి ద్వారా 31 నిఘంటువులు మన చెంత ఉన్నట్టే..

http://andhrabharati.com/dictionary/index.php

5 వ్యాఖ్యలు:

శ్యామలీయం

సత్ప్రయత్నం!

Katta Srinivas

ఉపయోగకరమైన సమాచారం.. బావుందండీ..

Sharma

ఎంత ఖర్చు చేసినా చిక్కని వాటిని చక్కగా అంతర్జాలంలో పొందు పరచటం చాలా చక్కటి సత్కార్యమే .

Lasya Ramakrishna

ఉపయోగపడే సమాచారం. ధన్యవాదములు

మాలతి

జ్యోతి గారూ, కొన్ని లింకులకి be careful, this link might be maicious అని మెసేజీ వస్తోంది. మరొకసారి చూస్తారా. థాంక్స్.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008