Thursday, 26 June 2014

“కథానికా మాలిక”




తరచూ వివిధ సాహిత్య ప్రయోగాలకు ఆలవాలమైన ‘మాలిక’ పత్రిక ఈసారి మరో కొత్త ప్రయోగానికి నాంది పలికింది.. ఒకే అంశం మీద గతంలో కవితలు, పద్యాలు రాయించాం కదా. ఈసారి కొందరు రచయిత్రులను ఒకే కథావస్తువు పై కథానికలు రాయమని కోరడమైంది. ఆ పదిమంది రచయిత్రులు వెనువెంటనే స్పందించారు.

ఆ అంశం ... “ నాన్నంటే... ఓ కూతురి మాట..”

తండ్రీ కూతుళ్ల అనుబంధం తరతరాలుగా అపురూపమయిందే! కానీ అనాదిగా ఆడవాళ్లని అబలలుగా, ఆటబొమ్మలుగా భావించే నేటి సమాజంలో ఒక తండ్రి కంచే చేనుమేసిన చందాన ఆమె జీవితాన్ని ఏదో విధంగా బాధిస్తుంటే.. మరొక తండ్రి అంతులేని ధైర్యాన్నిచ్చి కూతురు జీవితాన్ని కాపాడుతున్నాడు. కొందరు ఉదాత్తులు కణ్వమహర్షులే అవుతున్నారు. “నాన్నంటే .. ఓ కూతురి మాట ” అనే కథాంశంపై కథలల్లమని ఈ రచయిత్రులను కోరింది మాలిక. నిర్ణీత సమయంలో అందిన కథలను చూస్తుంటే నిజంగా ఇంతటి వైవిధ్యం సాధ్యమా అని ఆశ్చర్యం కలిగింది. ఈ కధలలోని వ్యక్తులు మనకు ఎక్కడో ఒక చోట కలిసి , తెలిసి, పరిచయమై ఉంటారు. లేదా ఎక్కడో చదివి ఉంటాము. మన చుట్టూ ఉండే సమాజంలోని వ్యక్తులు, సంఘటనలు, సందర్భాలే కదా రచయితలకు, రచయిత్రులకు స్ఫూర్తినిచ్చేది వాటిని తమదైన శైలిలో అక్షరబద్ధం చేయించేది.. మాకు అందిన ఏ కథలోని విషయం మరొక కథలో కనబడలేదు. ఇంత విభిన్నమైన కధలను అందించిన ఈ పదిమంది రచయిత్రులను అభినందిస్తూ ముందుకు సాగుదాం..

ఈ కధలన్నింటిని చదివి విశ్లేషించినవారు మంధా భానుమతి.

మరి ఆ రచయిత్రులు...
పి.ఎస్.ఎమ్.లక్ష్మి
నండూరి సుందరి నాగమణి
జి.సుబ్బలక్ష్మి
సి.ఉమాదేవి
వారణాసి నాగలక్ష్మి
వి.బాలామూర్తి
మణి వడ్లమాని
సుజల గంటి
ఆర్.దమయంతి
సమ్మెట ఉమాదేవి

ఇంతే కాక ఈ అంశానికి, ప్రయోగానికి అద్భుతమైన చిత్రాన్ని వేసి ఇచ్చిన వాసు చెన్నుపల్లిగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము..

1 వ్యాఖ్యలు:

Anonymous

బ్లాగ్ వేదిక మరిన్ని వినూత్నమైన ఫీచర్స్ తో తయారుకానుంది.త్వరలో సొంత డొమైన్ కూడాపొంది వెబ్సైట్ గా రానుంది.మీరు కూడా బ్లాగ్ వేదిక మెంబర్ అయ్యినందుకు చాలా సంతోషిస్తున్నాము.బ్లాగ్ వేదిక యొక్క సభ్యులను బ్లాగర్ ప్రపంచానికి దగ్గర చేయాలనే ఉద్దేశ్యంతో వారి పరిచయాలను బ్లాగ్ వేదిక ద్వారా అందించాలని సంకల్పించాము.దయచేసి మీరు మీ పరచయాన్ని,మీ బ్లాగ్ యొక్క ఉద్దేశ్యాన్ని,మీ బ్లాగ్ అనుభవాలను,మీ ఫొటొలను [మీకిష్టమైతేనే],ఇంకా ఏముంటే అవి,క్రింది మెయిల్ ఐడికి పంపించగలరు.
md.ahmedchowdary@gmail.com

www.blogvedika.blogspot.in

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008