ధీర - 2
పసితనపు నీడలో ఉండగానే జరిగిన వివాహం, పట్నవాసపు ఉమ్మడికుటుంబంలో కాపురం, పంచుకున్న అనుభవాలు, కలిసి ఎదుర్కొన్న కష్టసుఖాలూ, అనుకోని అవాంతరాలు, ఒడిదుడుకులూ, పిల్లలూ, బంధుమితృలూ, బాధ్యతలూ.. ఒక సాధారణ గృహిణి జీవితంలో ఎదురయ్యే ఇలాంటి ఎన్నో రకాలా అనుభవాలూ, సమస్యల మధ్య, కేవలం ఇంటిని నడుపుకుంటూ, పుస్తకాలు చదువుకుంటే చాలదా? అనుకోలేని నైజం ఉండాలే కానీ, నేర్చుకోవడానికెన్నో విషయాలు, నెరవేర్చుకోవడానికెన్నో మార్గాలు. కావలసినదల్లా నేర్చుకోవలన్న కోరికా, అది సాధించడానికి కావలసినంత ఓపికా. ఈ రెండు చేరితే తీరిక దానంతట అదే దొరుకుతుంది, కనపడుతుంది. అది కొత్త వంట కావచ్చు, కొత్త స్వెటర్ అల్లిక కావచ్చు, భగవద్గీతా పారాయణం కావచ్చు లేక యోగాభ్యాసం కావచ్చు, మరేదైనా కావచ్చు..
" ముదితల్ నేర్వగ రాని విద్య కలదే ముద్దార నేర్పించినన్ ' అన్న దానికి భిన్నంగ " ముదితల్ నేర్వగ రాని విద్య కలదే మనసారా నేర్చిన" అని చెప్పుకోవచ్చు మన ఈ నెల " ధీర" లో ప్రస్తావిస్తున్న మహిళ గురించి చదివితే.
" ఆ మహిళ ఎవరు? ఆమె వెనకున్న కధ ఏమిటి? ఆవిడ ఊరేమిటి? పేరేమిటి?" వివరాలు వచ్చే నెల మాలిక ధీర లో చదవండి.
0 వ్యాఖ్యలు:
Post a Comment