Wednesday 16 December 2015

ప్రమదాక్షరి/జె.వి.పబ్లికేషన్స్ స్టాలు - Hyderabad Book Fair 2015






సూపర్ బంపర్...




ప్రతీ సంవత్సరం డిసెంబరులో జరిగే హైదరాబాదు పుస్తక ప్రదర్శనలో తెలుగు మహిళా రచయిత్రులు కలిసి నిర్వహిస్తున్న ప్రమదాక్షరి స్టాలులో పుస్తకాల అమ్మకాల కంటే పాఠకులు, రచయిత్రుల పరిచయాలు ముఖ్య ఉద్ధేశ్యంగా గత సంవత్సరం ఘన విజయం సాధించిన సంగతి మీకందరికీ తెలుసు.అదే స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా ప్రమదాక్షరి పేరిట మూడు స్టాల్స్ తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం మరి కొందరు రచయితలు, రచయిత్రులు ప్రమదాక్షరి స్టాలులో పాల్గొంటున్నారు. ముందు చెప్పినట్టే అమ్మకాలకంటే పుస్తకాన్ని పాఠకులకు మరింత చేరువ చేయడం , పాఠకులను ప్రత్యక్షంగా కలిసి పరిచయం చేసుకుని చర్హించడం చేయాలనుకుంటున్నాము. 


 
ఈసారి ప్రత్యేక సాహితీ ప్రాంగణంలో ప్రతీరోజు పుస్తకావిష్కరణలు, ముఖాముఖీ కార్యక్రమాలు. వేర్వేరు అంశాల మీద చర్చా కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మరి ఈసారి సూపర్ బంపర్ ఏమిటో తెలుసా.. మా స్టాలు చివరి నంబరైనా ఎంట్రన్స్ కి పక్కనే ఉంటుంది. అంటే పుస్తక ప్రదర్శనలోకి అడుగుపెట్టగానే మహిళా రచయితలే స్వాగతం పలుకుతారన్నమాట..




ప్రమదాక్షరి/జె.వి.పబ్లికేషన్స్ స్టాలు నంబర్లు 268,269,270...



ఎల్లుండి కలుద్దాం మరి...

5 వ్యాఖ్యలు:

విన్నకోట నరసింహా రావు

< "మా స్టాలు చివరి నంబరైనా ఎంట్రన్స్ కి పక్కనే ఉంటుంది. అంటే పుస్తక ప్రదర్శనలోకి అడుగుపెట్టగానే మహిళా రచయితలే స్వాగతం పలుకుతారన్నమాట.."

మీరు చెప్పినది మొదటిరోజున కరక్టే. రెండోరోజుకి తాళ్ళు కట్టారుగా, దానివల్ల మీ స్టాల్స్ ఇప్పుడు Exit పక్కకి వచ్చాయిగా, వీడ్కోలు పలుకుతూ... అయితే ఏంలెండి, బయటకు వెళ్ళిపోబోతున్న వాళ్ళని ఆపేస్తుంది మీ స్టాల్, చక్కగా ఉంది.

Zilebi

ప్రమదాక్షరి స్టాలు మొత్తం జిలేబి మయము గా ఉన్నది :)

జిలేబి

శ్యామలీయం

జిలేబీమయం ఏమిటండీ? అదేమన్నా మిఠాయిదుకాణమా!

Zilebi

శ్యామలీయం వారు,

జిలేబిమయము గా ఉన్నది మీ ప్రశ్న :)
చీర్స్
జిలేబి

Viru

hahahahahaha

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008