విజయ ప్రస్థానం - జె.వి.పబ్లికేషన్స్
ఈ జీవితం చాలా విచిత్రమైంది. ఎన్నో ఆశలు, ఎన్నో మలుపులు, కష్టాలు, నష్టాలు, మిత్రులు, శత్రువులు.. కృంగిపోతే నామరూపాల్లేకుండా పోతాం. అదే నిలదొక్కుకుని, ధైర్యంగా ఎదురొడ్డి పోరాడితే తప్పకుంఢా గెలుపు సొంతమవుతుంది. ఎంత సక్సెస్ సాధించినవారైనా, ఎంత గొప్పవారైనా వారికి విజయం అంత సులువుగా చేతికందదు. నిలబడదు. నిజాయితీగా, కష్టపడి సాధించినదాన్ని నిలబెట్టుకోవడం అంత సులువు కాదు కాని అసాధ్యం కూడా కాదు..
అసలు నాకంటూ ఒక అస్తిత్వం ఏముందని నన్ను నేను ప్రశ్నించుకుని, నాకంటూ ఒక దారిని ఏర్పరుచుకుంటూ మధ్యలో కలిసి ఆత్మీయులైన మిత్రుల సాయంతో ముందుకు సాగుతున్నాను. అసలు కలలో కూడా ఊహించని పనులు చేయగలుగుతున్నాను అంటే ఇందులో నా ఒక్కదాని శ్రమ లేదు. ఎవరికైనా ముందుగా కావలసింది కుటుంబం నుండి సహకారం, ప్రోత్సాహం. అది నాకు పూర్తిగా లభించడం వల్లనే ఈనాడు ఇన్ని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించగలుగుతున్నాను. మధ్య మధ్య ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అవి లైట్... వాటిని పక్కన పెట్టి ముందుకు సాగిపోవడమే.కొన్ని సమస్యలు లైట్ తీసుకుని మర్చిపోవడం కుదరదు. అలాంటప్పుడు వాటికి వీలైనంత తక్కువ ప్రాముఖ్యం ఇస్తే మనకే మంచిది అని నేనంటాను. నమ్ముతాను.. పాటిస్తున్నాను కూడా..
ఈ సోదంతా ఎందుకంటారా?? నాకూ ఒక కెరీర్ ఉండాలి, ఉండగలదు, ఉంటుంది అని అనుకోలేదెప్పుడు. డబ్బులకంటే పరిశ్రమించడమే పెట్టుబడి అని నమ్ముతూ జె.వి.పబ్లికేషన్స్ సంస్ధను రెండేళ్ల క్రితం ప్రారంభించాను. అది కూడా పూర్తిగా తెలుసుకుని కాదు. తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, మెరుగుపరుచుకుంటూ ఒక్కో పుస్తకం ప్రచురణ బాధ్యతలు సమర్ధవంతంగా పూర్తి చేయగలిగాను అని ధైర్యంగా చెప్పగలను. ఈ ప్రచురణ విషయాలన్నీ నేనే చూసుకొవడం వల్ల ప్రతీది పర్ఫెక్టుగా నాకు నచ్చి, రచయిత సంపూర్ణంగా ఇష్టపడేలా చేస్తున్నాను. నా జె.వి.పబ్లికేషన్స్ నుండి వరుసగా ఒకటి తర్వాత ఒక పుస్తకం చేయాలంటే ఒక టీమ్ వర్క్ ఉండాలి. డిటిపి ఆపరేటర్, కవర్ డిజైన్, ప్రింటర్, గ్రాఫిక్ డిజైనర్, రచయిత, నేను కలిసి పని చేస్తేనే పుస్తకం అనుకున్నట్టుగా, మంచి క్వాలిటీతో . తక్కువ సమయంలో, తక్కువ తప్పులతో తయారవుతుంది. ఈ విషయంలో జె.వి.పబ్లికేషన్స్ డిజైనర్ గా Ramakrishna Pukkallaగారు, డిటిపి ఆపరేటర్ Kothapally Ravi Prabhaగారు నాతో సమానంగా పరుగులు పెడుతూ, నాకు నచ్చినట్టుగా వర్క్ చేస్తున్నారు. వారి సాయం లేకుంటే ఇన్ని పుస్తకాలు చేయగలిగేదాన్ని కాదు. అలాగే కొన్ని పుస్తకాలకు ప్రముఖ ఆర్టిస్టులు చిత్రాలు కూడా తీసుకోవడం జరుగుతుంది.. ..
నన్ను అభిమానిస్తూ, అభినందిస్తూ ప్రోత్సాహాన్ని ఇస్తున్న మిత్రులందరికీ... నా రచనలు, వంటలు, పుస్తకాలు, బుక్ ఫెయిర్, టీవీ షో లకు ఇంటినుండి పూర్తి సహకారాన్ని ఇస్తున్న మావారికి కూడా మనఃపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను..
శుభం భూయాత్.
మీ జ్యోతి వలబోజు...
ఈ క్రమంలో ఇప్పటివరకు అంటే జనవరి 2014 నుండి డిసెంబర్ 2015 వరకు జె.వి.పబ్లికేషన్స్ నుండి అచ్చైన 40 పుస్తకాలు ఇవి.. ఇంకా మూడు ప్రింట్ కి వెళ్లబోతున్నాయి..నన్ను నమ్మి తమ పుస్తకాల పని అఫ్పజెప్పిన Chitten Raju Vanguriగారికి, ఎందరో ప్రముఖ రచయితలు, రచయిత్రులకు ధన్యవాదాలు. నేను చేసిన పుస్తకాలన్నీ అందంగా, మంచి క్వాలిటీతో ఉన్నాయని ప్రశంసించారు.. షుక్రియా..
Books Published by J.V.Publications.
1. తెలంగాణ ఇంటివంటలు – వెజ్ – జ్యోతి వలబోజు
2. ఆకుపాట – శ్రీనివాస్ వాసుదేవ్
3. సాగర కెరటం - సి.ఉమాదేవి
4. కేర్ టేకర్
5. మాటే మంత్రము
6. అమ్మంటే..
7. మంచి మాట – మంచి బాట
8. ఏ కథలో ఏముందో.
9. సిరిసిల్ల రాజేశ్వరి కవితలు - రాజేశ్వరి
10. కదంబం – శ్రీనివాస భరద్వాజ కిషోర్
11. ఊర్వశి - వారణాసి నాగలక్ష్మీ
12. ప్రమదాక్షరి కథామాలిక
13. తెలంగాణ ఇంటివంటలు – నాన్ వెజ్ – జ్యోతి వలబోజు
14. ధర్మప్రభ – కొంపెల్ల రామకృష్ణ
15. అమూల్యం – నండూరి సుందరీ నాగమణి
16. హాస్యామృతం – ఆర్.వి.ప్రభు
17. నాకు తెలుగు చేసింది – సత్యసాయి కొవ్వలి
18. జీవన వాహిని – డా. మంథా భానుమతి
19. ఎగిరే పావురమా - ఉమాభారతి
20. ఫేస్ బుక్ కార్టూన్స్ – లేపాక్షి, రాజు
21. పాశుపతం – మంచాల శ్రీనివాసరావు
22. నీలి – ఆకుపచ్చ – డా.మధు చిత్తర్వు
23. మహాభారతం – తాతా శ్రీనివాసరావు
24. కలికి కథలు – వెంపటి హేమ
25. వృధాప్యం వరమా? శాపమా? – డా.శోభా పేరిందేవి
26,. తెలుగు కథ
27. స్పూర్తి ప్రదాతలు – రామా చంద్రమౌళి
28. పిల్లనగ్రోవికి నిలువెల్లా గాయాలు
29. అంతిమం
30. ఒకపరి జననం –ఒకపరి మరణం
31. ఒక ఏకాంత సమూహంలోకి
32. చిగురాకు రెపరెపలు – మన్నెం శారద
33. అగ్గిపెట్టెలో ఆరుగజాలు – డా.మంథా భానుమతి
34. అమెరికా ఇల్లాలి ముచ్చట్లు 2 – శ్యామల దశిక
35. అమృతవాహిని - సుజల గంటి
36. ప్రియే చారుశీలే
37. ప్రమదాక్షరి కథామాలిక – తరాలు అంతరాలు
38. అసమాన అనసూయ – వింజమూరి అనసూయాదేవి
39. అర్చన – అత్తలూరి విజయ
40. ఆవిరి – స్వాతి బండ్లమూడి