మాలిక పత్రిక ఫిబ్రవరి 2019 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
పాఠక మిత్రులకు, రచయితలకు, కవులకు మాలిక తరఫున సాదర ఆహ్వానం. వీడిపోయేముందు విజృంభిస్తున్న చలిగాలులు, వేసవి ఎంతగా వేధిస్తుందో అన్న ఆలోచనలు మొదలైన వేళ మీకు నచ్చే, మీరు మెచ్చే కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్ తో మాలిక కొత్త సంచిక మీకోసం వచ్చేసింది. మాలిక పత్రిక మీడియా పార్టనర్ గా ఉన్న ఒక సాహితీ కార్యక్రమంగురించి కొన్ని మాటలు. అమెరికా వాసులైన నాట్యకారిణి, నటి, రచయిత్రి శ్రీమతి ఉమాభారతి తన అర్చన నృత్యకళాశాల, తన తల్లిదండ్రుల పేరిట నెలకొల్పిన ట్రస్టు పేరిట కథల పోటి, పద్యకథల పోటి నిర్వహిస్తున్నారు. మీరు కూడా అందులో పాల్గొని మంచి రచనలు అందజేయగలరు. ఈ పోటీల విజేతలకు ఆగస్టు 31 న హైదరాబాదు తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగే సమావేశంలో బహుమతి ప్రధానం జరుగుతుంది.
మాలిక పత్రికలో ప్రత్యేక పేజీలో ఈ పోటీల గురించిన ప్రకటన ఉంది. గమనించగలరు. ఆఖరు తేదీ: మార్చ్ 31, 2019
మాలిక పత్రిక కోసం మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
ఈ మాసపు విశేషాలు మీకోసం:
1. భగవంతుల రహస్య సమావేశం
2. మానవత్వం
3. బ్రహ్మలిఖితం 22
4. కంభంపాటి కథలు
5. దారి తప్పిన స్నేహం
6. చిన్న చిన్నవే కాని
7. విశ్వపుత్రిక వీక్షణం
8. మన( నో) ధర్మం
9. బద్ధకం - అనర్ధం
10. సంస్కరణ
11. కౌండిన్య హాస్యకథలు
12. అన్యోన్య దాంపత్యం
13. ఆడాళ్లూ - మీకు జోహార్లు
14. శాకుంతలం
15. నా స్వామి పిలుపు వినిపిస్తుంది
16. తపస్సు
17. హిమవత్పద్యములు 1
18. తేనెలొలుకు తెలుగు
19. ఆంద్రపితామహుడు
20. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి
21. కార్టూన్స్ - జెఎన్నెమ్
22. దుఃఖమనే అనాది భాషలో
0 వ్యాఖ్యలు:
Post a Comment