మాలిక పత్రిక ఆగస్టు 2020 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
రచయితలకు, పాఠక మిత్రులకు సాదర ఆహ్వానము. నమస్కారములు.
కరోనా, లాక్ డౌన్ అని మనమంతా ఇంట్లోనే ఉన్నా, ప్రకృతి ఊరుకుంటుందా. తనపని తాను చేసుకుంటూంది. వేసవి ఎండలు, మామిడి, మల్లెలు అయిపోయి వానాకాలం మొదలైంది. చినుకులు, అప్పుడప్పుడు కుంభవృష్టితో నగరాలు, పల్లెలన్నీ తడిసి ముద్దవుతున్నాయి. వ్యవసాయం పనులు కూడా మొదలయ్యాయి. ఉద్యోగాలకు వెళ్లేవాళ్లు తగు జాగ్రత్తలతో వెళ్లి వస్తున్నారు. చాలామంది ఇంటినుండే పని చేస్తున్నారు. మంచిదే.. తగు జాగ్రత్తలతో ముఖ్యమైన పనులు పూర్తి చేసుకోక తప్పదు. వరలక్ష్మీ వ్రతం అయిపోయింది. స్నేహితుల దినోత్సవం రాబోతుంధి. తర్వాత వినాయిక చవితి, దసరా, దీపావళి... పండగలు వస్తున్నాయి, వెళ్లిపోతున్నాయి.. హడావిడి, సంబరాలు లేకుండా చేసుకుంటున్నారు. దేవుడు కూడా మనతోపాటే .. నా దగ్గరకు ఎక్కువగా రాకండి. క్షేమంగా ఉండండి.. అంటున్నాడు.
మనం కూడా రాబోయే పండగలకు స్వాగతం చెప్తూ కష్టకాలం త్వరగా దూరం అవ్వాలని కోరుకుందాం. మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..
మనం కూడా రాబోయే పండగలకు స్వాగతం చెప్తూ కష్టకాలం త్వరగా దూరం అవ్వాలని కోరుకుందాం. మీ అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు..
మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
ఈ మాసపు విశేషాలను చూద్దాం:
7. వాన బుడగలం
8. ఊరు
10. పరిపూర్ణం
11. గిరిజా సదన్
13. చిన్న బతుకులు
14. చంద్రోదయం – 6
16. అమ్మమ్మ – 16
18. చేనేత మొగ్గలు
0 వ్యాఖ్యలు:
Post a Comment