Tuesday, 1 June 2021

మాలిక పత్రిక జూన్ 2021 సంచిక విడుదల

 

 
 



 
 
Jyothivalaboju 
 
Chief Editor and Content Head
 
 
మండే ఎండలలో చల్లబరిచే మల్లెలు, కాస్త చినుకులు పడినవేళ మత్తెకిస్తాయంటారు పెద్దలు. చల్లని సాయంత్రాలలో చిరుజల్లుల చలిలో సుమనోహరమైన మల్లెల సుగంధాలు మనసును పులకింపజేస్తాయి.. అవునంటారా.. కాదంటారా..
 
మాలిక పత్రిక జూన్ సంచికలో ఎన్నో విశేషాలున్నాయి. ముఖ్యమైనవి రెండు. 
 
 ప్రముఖ రచయిత, కవి రామా చంద్రమౌళిగారి కథల సమాహారం "తాత్పర్యం".  
ఈ ' తాత్పర్యం' కథా సంపుటి మొత్తం 6 కథా‌పురస్కారాలను సాధించింది. ఎందరో పాఠకుల ప్రశంసలను అందుకున్నది.

ముఖ్యమైనవి
1) డా.ఎన్.రామచంద్ర కథా పురస్కారం, ప్రొద్దుటూరు
2) రంగినేని ఎల్లమ్మ కథా పురస్కారం, సిరిసిల్ల.
3) ప్రతిష్టాత్మక ' తెలంగాణ సారస్వత‌ పరిషత్తు, హైదరాబాద్, డా.కె.అంజిరెడ్డి కథా‌పురస్కారం.
 ఇది ఇంగ్లీష్ లో prof.Indira babbellapati తో అనువాదం చేయబడి  HE AND OTHER STORIES పేర అంతర్జాతీయ మార్కెట్‌లో విడుదలైంది.
ఈ తాత్పర్యంలోని రామాచంద్రమౌళిగారి కథలు ప్రతీనెల మాలిక పాఠకులకోసం  ప్రత్యేకంగా అందిస్తున్నారు. వారికి మా మనఃపూర్వక ధన్యవాదాలు.
 
 
మరొక ఆత్మీయ రచయిత్రి మణికుమారి గోవిందరాజుల మొదటిసారిగా మాలిక కోసమే ప్రత్యేకంగా ధారావాహిక రాస్తున్నారు.

  “నా కంటి చూపులో నిలచిపో  అందమైన లోకాలు చూపిస్తాను” అన్నాడు అతను…
  “మా ఇంటి మహలక్ష్మిలా రామ్మా! ఈ సామ్రాజ్యమంతా నీ ఎదుట నిలుపుతాను” అన్నారు ఆయన.
  “మంచి సంబంధం. కలలో కూడా ఊహించలేదు. నీ అదృష్టమమ్మా” అన్నారు తలితండ్రులు.
  “నేను బతికుండగానే నా మనవరాలి పెళ్ళి చూడాలని ఉందిరా” అన్నది బామ్మ.
  తొలిచూపులోనే అతని మీద కలిగినది ఉట్టి ఆకర్శణ మాత్రమేనా?
  ఏమి జరుగుతున్నది? ఏమి జరగబోతున్నది?  

 అందం, ఆకర్శణ కలబోసిన అల్లరిపిల్ల ధృతికి ఎదురైన అనుభవాలేమిటి? తప్పక చదవండి లేడీ ఓరియెంటెడ్
 ధారావాహిక "ధృతి"
 
ఈ ప్రత్యేక ఆకర్షణలతోపాటు మరెన్నో కథలు, కవితలు, వ్యాసాలు, యాత్రా విశేషాలు, పుస్తక సమీక్షలు, కథలు, సీరియళ్లు మీకోసం వచ్చేసాయి... 
 
మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
 
ఒక ముఖ్య గమనిక:  ఈ సంచికలోని రచనలలోని  భాష, వ్యాకరణ దోషాలు రచయితలకే చెందుతాయి. ఎన్నిసార్లు చెప్పినా అలాగే పంపిస్తున్నందు వల్ల నేను కరెక్షన్స్ చేయలేదు. మన్నించగలరు. రచయతలు,  పాఠకులు మీరే చెప్పండి ఇలా తప్పులతో ఉన్న కథలు, వ్యాసాలు చదవడం బావుందా?? 



ఈ మాసపు పత్రికలోని విశేషాలు:















































 
 
 
 

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008