Tuesday, 4 December 2007

స్వర నీరాజనం


మధుర గాయకుడు స్వర్గీయ ఘంటసాల 85వ జయంతి సందర్భంగా
స్వర నీరాజనం.. చూడండి.. వినండి... మనసారా ఆనందించండి.


శివశంకరి శివానందలహరి...


చందురుని మించు అందమొలికించు....


నన్ను దోచుకుందువటే వన్నెలదొరసాని...


ఊహలు గుసగుసలాడే....


ప్రతీరాత్రి వసంతరాత్రి ప్రతిగాలి పైరగాలి....


నా హృదయంలో నిదురించే చెలి.....


ధనమేరా అన్నిటికి మూలం...


మల్లుయలారా.. మాలికలారా....


ఏడతానున్నాడో బావ....


కారులో షికారుకెళ్ళే ...


ఆడుతు పాడుతు పనిచేస్తుంటే...


నమో భూతనాధ....

ఏమిటీ ఘోరం????



పేదల చిన్నారుల ఆసుపత్రి నీలోఫర్ ఇప్పుడా చిన్నారుల మరణవేదికైంది. రాష్ట్ర నలుమూలలనుండి వైద్యానికి, ప్రసవానికి వచ్చే ఎందరో తల్లుల కడుపుకోతకు కారణమైన రభస ఒక ఎం.ఎల్.ఏ.డాక్టర్ల మధ్య జరిగింది. అసలు ఇక్కడ తప్పంతా డాక్టర్లదే. తప్పు చేసిన నాయకుడిని వదిలేసి వైద్యాన్ని వదిలేయడమేంటి. ఇదేనా వాళ్ళు నేర్చుకున్న చదువు సార్ధకత.అంతగా కోపమైతే ఆ నాయకుడిని పట్టుకుని కొట్టండి కాని చావుబ్రతుకులమధ్య ఉన్న పసిపిల్లలను బలిపెట్టడమేంటి. ప్రాణాలు పోయడం వాళ్ళ కర్తవ్యమా, లేక తమ గొడవకు నెలల పిల్లల ప్రాణాలు తీయడమా. నవమాసాలు మోసి కని ఎన్నో ఆశలతో తమ బిడ్డలను ఇక్కడికి తీసుకొస్తే వైద్యం లేక తమ కళ్ళముందే ఆ పసిమొగ్గలు వసివాడిపోతే ఆ తల్లితండ్రుల కడుపుకోత ఎవరు తీర్చగలరు. ఈ గొడవ రెండు మూడు రోజుల్లో సర్దుకుంటుంది. కాని ఆ పసిప్రాణాలు మళ్ళీ తీసుకురాగలరా. దేవుడే డాక్టర్ల రూపంలో తమ పిల్లలను కాపాడతాడని ఇక్కడికి తీసుకువచ్చిన ఆ కుటుంబ సభ్యులు ఏం నేరం చేసారని. వాళ్ళకింత అన్యాయం చేస్తున్నారు.


ఇంత పంతమా ఆ డాక్టర్లకి.ఈ రాజకీయ నాయకుల సంగతి తెలిసిందే .. కర్ర విరగదు పాము చావదు అన్నట్టు నానుస్తున్నారు పైగా ఆ పిల్లలను చావు బ్రతుకుల మధ్య తీసుకొచ్చారు, వైద్యం లేక చావలేదు అంటున్నారు. తమ సమస్యలకోసం రోడ్డుకెక్కిన డాక్టర్లకు కనీస మానవత్వం లేదా పైగా ఏ పాపము తెలియని చిన్నారులు బలవుతున్నా పంతం పట్టుకుని ఉన్నారు.ఇప్పటికే రెండు రోజుల్లో పదిమంది చిన్నారులు బలయ్యారు. పైగా రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ డాక్టర్లు కూడా వీళ్ళకి మద్ధతుగా సమ్మె చేస్తారంట. మనుష్యుల ప్రాణాలతో ఆడుకోవడానికా వీళ్ళు లక్షలు ఖర్చుపెట్టి వైద్యవృత్తి చదివింది.అసలు ఈ డాక్టర్లందరిని ఉద్యోగాలనుండి తీసేసి చదువుకుని నిస్వార్ధ సేవ చేయాలని ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారిని నియమించాలి ప్రభుత్వమైనా. కాని దానికి తెగులు పట్టింది ...ఖర్మ? ఏదో ఉద్ధరిస్తారని వాళ్ళను ఎన్నుకున్న మనం నేరస్తులం.

Monday, 3 December 2007

యద్భావం తద్భవతి !!!!

ప్రపంచంలో జరిగే అన్యాయాలన్నింటిపై దృష్టి సారిస్తున్నావంటే ఖచ్చితంగా నువ్వు
అసంతృప్తివాదిగానే మిగిలిపోతావు. ఇది అక్షరసత్యం! మనసు నిండా ప్రశాంతత
ఉంటే ఎంత బాగుంటుందో ఊహించుకోండి. కానీ మనస్సు నిశ్చలంగా ఉన్నా ఏ
మూల నుండో భయం దోబూచులాడుతూనే ఉంటుంది. నడిరోడ్డులో జంట హత్య,
ప్రియురాలిని నరికి చంపిన మరో మనోహర్ అంటూ ప్రాసలు కట్టి మరీ పత్రికలూ,
మనసు పొరల్లో బలంగా ముద్రించుకుపోయేలా క్లోజప్‍లో రక్తపు ప్రవాహాన్ని
చిత్రీకరించే టెలివిజన్ చానెళ్ళు ఉన్నంతవరకూ మన మస్తిష్కాలు ప్రశాంతంగా
ఉండలేవు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, కుంభకోణాలు, రాజకీయాలు,
కుటుంబ తగాదాలు, అభిప్రాయబేధాలు…. ఇవేగా నేటి ప్రసార మాధ్యమాలకు
ముడి సరుకు! ఇలా పత్రికలు, టెలివిజన్ చానెళ్ళు తమ పేజీలను నింఫుకోవడానికి,
టైమ్ స్లాట్లని ఎలాగోలా నెట్టుకురావడానికి ఎక్కడ లేని చెత్తనంతా మన బుర్రల్లో
నింఫుతుంటే.. ప్రతీ దానికీ అదేదో మన సమస్యగా ఆవేశం తెచ్చుకునే వాళ్ళమే
మనమంతా ! తెల్లగా ప్రకాశించే మనసు పొరలపై ఎరుపు, నలుపు రంగులను
ఒలికిపోసి ప్రశాంతతను చిన్నాభిన్నం చేసుకోవడం మన స్వయంకృతం కాదా? ఈ
రోజు ఎవరిని కదిలించినా .. "చూడండి సార్! వాడికి సిగ్గు ఉందా, ఆ పని
చేశాడు, ఏమ్ రాజకీయాలండి పనికిమాలిన రాజకీయాలు, మా ప్రక్కింటి వాడు
ఉన్నాడు చూశారూ … వాడు ప్రపంచంలో పెద్ద వేస్ట్" అంటూ నిరంతర అసంతృప్తి
మొహాల్లో దోబూచులాడుతూనే ఉంటుంది. మనకు ఎక్కడా, ఎవరితోనూ సఖ్యత
ఉండదు. ఎందుకంటే మనం ప్రతీ దాన్ని అసంతృప్తి నుండి చూస్తున్నాం. మన
మనసుల్లో నెగెటివ్ భావాలు బలీయంగా స్థిరనివాసం ఏర్పరుచుకున్నాయి.
’తాను’ సరిచేయడానికి వీలుపడని సమస్యల్లో మనం తలదూర్చినప్పుడు మనస్సు
చంచలమౌతుంది. కారణం, సమస్యని పరిష్కరించాలని మనసు ఆరాటపడుతుంది.
కానీ సమస్య మాత్రం తన ఆధీనంలొ ఉండదు, దానితో ఏమీ పాలుపోక అస్థిమితంగా,
అసంతృప్తితో మనసు ఊగిసలాట సాగిస్తుంది. మన పరిధిలో లేని, మనవి కాని,
మనం స్వయంగా పరిష్కరించలేని అనేక సమస్యలనిమనసుల్లో మోస్తున్నాం. సమస్య
పరిష్కరించబడితేనే మనస్సు ఊరత చెందుతుంది. కానీ మనం నెత్తికెత్తుకునే ఏ
సమస్యా మనది కాదే… మన ఒక్కరితోనే పరిష్కారం లభించదే! మరి మనస్సు
ఎప్పటికి ఊరట చెందాలి. మనమెప్పుడు ప్రశాంతంగా ఉండాలి? నీ పనేదో నువ్వు
ఆనందంగా చేసుకుపోతూ ప్రక్క దిక్కులకు చూడకుండా మనసుకు కళ్ళెం వేయగలిగితేనే
ఎలాంటి తలనొప్పులు మనసులో పేరుకుపోవు. మనసు ఎల్లప్పుడూ నిశ్చలంగా ఉంటుంది.

మీ నల్లమోతు శ్రీధర్

Sunday, 2 December 2007

పొద్దుకు మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు





గత సంవత్సరం పొద్దు పొడిచిన "పొద్దు"పత్రికకు మొదటి వార్షికోత్సవ శుభాకాంక్షలు

Saturday, 1 December 2007

ఆటాడుకుందాం రండి..

కోతి - ఫుట్‍బాల్


Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008