అత్యాచారం - అమానుషం
భగవంతుడు తన సృష్టిలో ఆడా, మగా అని సమానంగా సృష్టించాడు. ఇద్దరూ అందమైనవాళ్లే, శక్తివంతులే. ఒకరినొకరు గౌరవించుకుంటూ సమాజాన్ని ముందుకు నడిపించేవాళ్లే.
కానీ ఈనాడు కాదు పురాణాలనుండి ఆడదాన్ని ఒక విలాసవస్తువుగా భావించారు. నచ్చిన స్త్రీని శాస్త్రయుక్తంగా కానీ, గాంధర్వరీతిని గానీ, రాక్షసరీతిని గానీ వివాహం చేసుకునేవారు రాజులు, మహారాజులు. కాలక్రమేనా స్త్రీ తనలోని ప్రతిభని గుర్తించి దైన్యాన్ని, నిస్సహాయతని వీడి ఒక శక్తిగా మారసాగింది. ఈనాడు ఎంత అభివృద్ధి చెందినా, స్త్రీ అంట్లు తోమడం, ఆవకాయ పెట్టడం నుండి అంతరిక్షంలోకి దూసుకుపోయే స్ధితికి ఎదిగినా ఆమెకు భద్రత లేకుండా పోయింది. ప్రతీచోటా ప్రమాదమే.. ఎదిగిన ఆడపిల్ల విషయంలోనే కాదు మూడేళ్లు, ఐదేళ్ళ పసిపాపల మీద కూడా కామాంధుల పైశాచిక దాడులు జరుగుతున్నాయి. చదువుకునే సమయంలో, ఉద్యోగాలకు వెళ్లిన సమయంలో, ఉద్యోగం కాని ఏదైనా అవసరార్ధం మగవాళ్ల దగ్గరకు వెళ్లాలంటే దాదాపు అందరూ ఆడవాళ్లు ఎన్నో జాగ్రత్తలు తీసుకోక తప్పడంలేదు. చివరికి ఉద్యోగం నుండి ఇంటికి వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు వాహానాలలో కూడా భద్రత ఉండడం లేదని అందరికీ తెలిసిన విషయమే. ఆడవాళ్లు అనాలా? ఆడపిల్లలు అనాలా? చిన్నారులు అనాలా? అందరూ ఏదో విధమైన ఆకృత్యాలకు బలైపోతున్నారు. చివరికి తండ్రి, అన్నలు , కుటుంబ సభ్యుల చేతిలో కూడా అత్యాచారానికి లోనవుతున్న ఆడపిల్లల కథలు కూడా వినవస్తున్నాయి.
ఇక వయసులో ఉన్న ఆడపిల్ల అత్యాచారానికి గురైతే ముందుగా సమాజం ఆమెను దోషిగా,
చాలా పెద్ద తప్పు చేసినదానిలా చూస్తుంది. చెడగొట్టబడలేదు.. చెడిపోయింది
కాబట్టి ఆ అమ్మాయిని ఎవ్వరూ పెళ్లి చేసుకోరు. అసలు ఆ అమ్మాయే తను చేయని
నేరానికి శిక్ష పడి ఒక పనికిరాని వస్తువు అవుతుంది. ప్రతీవారు ఒక వింతలా
చూస్తారు. మీడియావాళ్లైతే తమ లాభం కోసం దాన్నొక స్పెషల్ స్టోరీ
చేసుకుంటారు. కాని తర్వాత ఆ అమ్మాయి సంగతేంటి?? ఎవ్వరూ పెళ్లి
చేసుకోవడానికి ముందుకు రారు. అందుకనే ఆ అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టమున్నా
లేకుండా బంధువులందరూ కలిసి ఒప్పించి మానభంగం చేసినవాడికే ఇచ్చి పెళ్లి
చేయమంటారు. అసలే అత్యాచారానికి గురైన అమ్మయి. మళ్లీ ఆ దుర్మార్గుడికే
జీవితాంతం బానిసగా పడుండాలి. ఒకరివల్ల అమ్మాయి జీవితం నాశనమైతే సమాజం
ముందుకొచ్చి పూర్తిగా నాశనం చేసేస్తుంది... ఇది ఆ అమ్మాయి చేసిన దోషమా?
కొవ్వెక్కి చేసిన ఘనకార్యమా? అత్యాచారానికి గురై వాడినే పెళ్లి చేసుకుని
ప్రతిదినం అత్యాచారం చేయించుకోవాలి. అప్పుడు అది తప్పు కాదన్నమాట....
కాని అత్యాచారానికి గురైన ఆడపిల్లను తల్లిదండ్రులు ఆమెను చేరదీసి కాపాడుకుని జరిగినదొక పీడకలగా భావించి ముందుకు సాగాలి. కాని ఇప్పటికీ ఈ అత్యాధునిక, అభివృద్ధి చెందిన సమాజం మాత్రం రేప్ చేసిన దుర్మార్గుడికే ఇచ్చి పెళ్లి చేయడం ఉత్తమమైన పరిష్కారం అని చెప్తోంది .. నేనో కథ చదివా.. తన కూతురు అత్యాచారానికి గురై ఇంటికి వస్తే తల్లి అంటోంది.. "వెళ్లి తలారా స్నానం చేసిరా. ఏమీ జరగలేదు. ఒక యాక్సిడెంట్ అంతే. స్నానం చేసి, తినేసి పడుకో. ఎవరితో ఏమీ చెప్పాల్సిన పని లేదు."
నా ఈ మాటలకు, ఉద్వేగానికి కారణం Rajuగారి ఈ కార్టూన్. చాలామందికి ఇది చిన్న సూక్తి లేదా మంచి మాట చెప్పే బొమ్మలాగే అనిపించవచ్చు . కాని ఆ తండ్రి కళ్లలోని నిస్సహాయత, ఆ తల్లి మనసులోని ఆవేదన ఎంతమందికి కనిపిస్తోంది. ఎంతమందిని ఆలోచింపచేస్తుంది....