Wednesday, 14 November 2007

సరదా ప్రహేళిక

1. నిమిషాన్ని తికమక చేసి డబ్బులు కట్టే బంధుత్వం. ఏంటది?

2. మనం ఏది కావాలన్నా ఫీ కడతాం కదా! అలాగే పెదాలకు కట్టే ఫీ ఏంటి?

3. ప్రతి ఒక్కరు వేసుకునే మాల అది. వేసుకోకుంటే మన జీవితమే వ్యర్ధం. ఏంటా మాల?

4. మినపట్టు, గోధుమ అట్టు... ఇలా ఎన్నో రకాల అట్లు మనం
తింటుంటాము. కాని మాట్లాడే అట్టు ఒకటుంది. అదేంటి?

5. పెళ్ళిళ్ళకు, పండుగలకు సెంటు వేసుకోవడం చాలామందికి
అలవాటు. కాని ఒక వ్యక్తి మాత్రం సెంటు వేసుకుని వెళితే
మాత్రం అస్సలు రానివ్వడు. ఎవరతను??

3 వ్యాఖ్యలు:

బ్లాగాగ్ని

1. ?
2. కాఫీ
3. వరమాల
4. కేసెట్టు
5. ?

జ్యోతి

ఒక్కటి కూడా కరెక్ట్ కాదు...

జ్యోతి

ఎవరికీ సమాధానాలు తెలీలేదా??ఐతే నేనే చెప్పేస్తున్నా!
౧. పెనిమిటి -పె , మినిట్(నిమిటి)
౨. ఫిలిప్స్ - ఫి, లిప్స్
౩. అక్షరమాల
౪. పెసరట్టు (తమిళంలో పెస్‍ర అంటే మాట్లాడు అని అర్ధం
౬. ఇన్నోసెంట్ - ఇన్ నో సెంట్

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008