ఏడుపుగొట్టు పద్యం
తురగా వెంకమరాజు అనే కవి ఒకసారి తాళ్ళూరులో ఒక కమ్మవారింట పెళ్ళి జరుగుతుంటే కవిసత్కారం చేస్తారని ఆశించి వెళ్తే, ఆ యజమాని "ఇప్పుడీ కవుల ఏడుపేమిమిటి? వెళ్ళు! " అని కసురుకున్నాడంట. వెంటనే తురగా కవి కోపంతో
పెండ్లి పేరంటాండ్రు పెనురంకులకు నేడ్వ
బాజా భజంత్రీలు పప్పుకేడ్వ
రాజబంధువులంత రంకు ముండల కేడ్వ
బాజారు వెలదులు పసుపుకేడ్వ
వచ్చిపోయేడి వారు వక్క లాకులకేడ్వ
గుగ్గిళ్ళకై పెండ్లి గుర్రమేడ్వ
పల్లకీ బోయీలు భత్యాలకై యేడ్వ
బలు పురోహితుడు నేబులకు నేడ్వ
హారతి రూకల కాడూబిడ్డలు నేడ్వ
కట్నంబుకై గ్రామకరణ మేడ్వ
పెద్దమగండని పెండ్లి కూతురేడ్వ
పిల్ల చిన్నదటంచు పెనిమిటేడ్వ
చాల్పుగానిన్ని యేడ్పుల సాగెఁబెండ్లి
సరస తాళ్ళూరు లోపల విరసముగను
నర పేరయ్య చేసే నీ నాటి కహాహా!
కమ్మకులమున జన్మించి ఘనులు నవ్వ !!
అని పెద్ద పద్యం చెప్పి తిట్టుకుంటూ పోయాడట. పాపం! ఆ నర్రా పేరయ్య ఎవడో? అనవసరంగా కొరివితో తల గోక్కున్నాడు.
2 వ్యాఖ్యలు:
bagundi, kani meeru ila caste feeling tho raasthe vivaadam jarugundi.
aachi toochi raayandi, taruvata "STHREE BLOGGERS PAINA ---" ani headings pettukovadam enduku??
sorry if i am wrong.
Regards,
Rajesh
రాజేష్ గారు, ఇది నా సొంత కవిత్వం కాదు. అప్పుడెప్పుడో తురగా కవిగారు చెప్పినట్టు ఒక గ్రంధంలో చదివాను. ఈ పద్యంలో కవి ఆక్రోషం మాత్రమే కనిపిస్తుంది కాని కులం కాదు..
Post a Comment