జాగ్తే రహో!!! పారాహుషార్ !!
వేళ కాని వేళలో ఈ మేలుకొలుపులు ఏంటనా?? ఈ మధ్య మన బ్లాగర్లు
చాలా సుస్తీగా, బద్ధకంగా ఉన్నట్టున్నారు. చివరి నెల అని పనుల్లో బిజీనా,
లేక నడి శీతాకాలంలో చలికి ముడుచుకుని బద్ధకిస్తున్నారా. బ్లాగులు రాసేది
తక్కువ. వ్యాఖ్యలు మరీ తగ్గిపోయాయి. అందరు బ్లాగు టపా చదివి వెళ్ళి
పోతున్నారు. మరి కాస్త ఓపిక తెచ్చుకుని ఆ టపా బావుందో లేదో చెప్పండి.
ఇలా వ్యాఖ్యలకు ఎదురుచూడకపోయినా, తప్పులు అనేవి కాని, సర్దుబాట్లు
అనేవి ఉంటే చేసుకోవచ్చు అని ఆ రచయితలు ఎదురుచూస్తుంటారు. ఎన్ని
ఆశలతో రాసి ఉంటారు ఆలోచించండి. కొత్త బ్లాగర్లైతే రెస్పాన్స్ లేదని మళ్ళీ
రాయడానికి ఉత్సాహం చూపించరుగా..
4 వ్యాఖ్యలు:
జ్యోతిగారూ,ఈసందేశంతొ పాటు మరిన్ని మీవ్యాఖ్యానాలు కలిపి మా చర్చావేదికలో రాయండి
రాజేంద్ర కుమార్ దేవరపల్లి
జ్యోతి గారు, కారణం నాకు తెలియదు గానీ... ఈ మధ్య బ్లాగులు, వ్యాఖ్యలు బాగా తగ్గాయి. ఇలాంటి సమయంలో మీరు పారా హుషార్ అనడం అభినందనీయం.
జ్యోతిగారు...మీరు చెప్పింది అక్షరాలా నిజం,మా లాంటి కొత్త బ్లాగర్లయితే వారి తప్పులను సరిదిద్దుకోవడం కోసం ఖచ్చితంగా చదివేవారి అభిప్రాయాలకోసం ఎదురుచూస్తారు,ఈ విషయాన్ని అందరికీ ఒకసారి గుర్తుచేసినందుకు ధన్యవాదాలు.
జ్యోతిగారు...
బాగా చెప్పారు...నలుగురు చదవాలనే కదా రాస్తాం... ఒక్క చిన్న అభినందన మంచి ఉత్సాహాన్ని కూడా కలిగిస్తుంది...ముఖ్యంగా కొత్తగా బ్లాగులు రాశే వారికి ...
Post a Comment