అయోమయం
ఏంటో అంతా తికమకగా ఉంది..
ఇదివరకే అదిస్తాం ఇదిస్తాం అని అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఉద్ధరించిందేమీ లేదు... ఇప్పుడు చిరు వస్తాడంటారు. అనవసరంగా ఆయన సినిమాలు వదిలి ఈ కంపు రాజకీయాలలోకి రావడం అంత అవసరమా. రాష్ట్రాన్ని ఆయన ఒక్కడే ఉద్దరించగలడా? కనీసం కొంచమైనా మార్చగలడా? ఇప్పటికి ఎన్ని పార్టీలు ఆయనను ఆహ్వానించాయి. ఆయనేమో ఎటూ తేల్చక నానుస్తున్నారు. ఇప్పటిదాకా పేరుకున్న కుళ్ళును ఆయన సినిమాలలో రౌడీలను కొట్టినంత ఈజీగా కడిగేయగలడా?? అది మనం కలలో ఐనా ఊహించగలమా. ఆయన పేరు చెప్పుకుని అధికారంలోకి రావాలని వెర్రి ప్రయత్నం చేస్తున్నారు.జనాలు తెలుసుకోలేని దద్దమ్మలనీ వాళ్ళకు తెలుసుగా.. చంద్రబాబేమో తాజాగా నేను మారిపోయానోచ్ అంటాడు. కె.సి.ఆర్ అంటాడు చిరు తన పార్టీలోకి వస్తే లాభపడతాడని. అంత బచ్చాగాడా చిరంజీవి అంటే. అందరికీ తెలుసు వాళ్ళిద్దరిలో ఎవరిని ఎక్కువ జనాలు గుర్తుపడతారో? ఈ కుళ్ళిపోయిన రాజకీయాలు చూసి చూసి, కొత్తగా లోక్ సత్తా పార్టీ నేత జయప్రకాష్ చెప్పే నీతి బోధలు అస్సలు నమ్మబుద్ధికావట్లేదు. ఒకవేళ అధికారమిచ్చినా ఆ తర్వాత మన దౌర్భాగ్యం ఇలాగే ఉండదని నమ్మకమేమిటి? ఇదేమన్నా టాగూర్ సినిమానా. అంత ఈజీగా జనం మారిపోవడానికి..
ఇప్పుడు నేను ఎన్నికలలో ఓటు వేయాలా? లేక అది దుర్వినియోగం కాకుండా వెళ్ళి దాన్ని పనికిరాకుండా చేయనా?? ఇదే ఆలోచన చాన్నాళ్ళుగా నా బుర్రను తొలిచేస్తుంది??
వాట్ టూ డూ???
2 వ్యాఖ్యలు:
పై బొమ్మనూ...
మీ టైటిల్ "అయోమయాం" న్ని...
చూస్తుంటే..
దీనికి సమాధానమ్
2 X 2 = ఆరు
మన తోటరాముడు తన శైలిలో చెపితే భలే ఉంటుంది.
పరమ కంపు సినిమాలు వదలి కంపు రాజకీయాలలోకి వస్తున్నాడు కాబట్టి ఫర్వాలేదు.
ఇక మీరు కష్టపడి వెళ్లి మీ ఓటును కంపు చేయడం కంటే, మీ అభ్యర్ధులలో ఎవరు అర్హులో (పార్టీ నిమిత్తం లేకుండా) చూసి వారికి ఓటు వేయగలరు.
ఇక "ఎవరు వచ్చి మనల్ని ఉద్ధరిస్తారు?" అన్న ప్రశ్నకు.
మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. రాములవారు వచ్చి అందరి గుండెల్లోని అజ్ఞానాన్నీ, అవినీతినీ తొలగించరు. మనమే ఒక సంఘంగా దాన్ని మెల్ల మెల్లగా బయటకు నెట్టాలి. రోమునగరాన్ని ఒక రోజులో నిర్మించలేము. కొండ పైకి బండ రాయిని మెల్లగా తోస్తూవుండాలి.
Post a Comment