నూతన సంవత్సరవేళ విజయోత్సవం
అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు... ఈ సంవత్సరం కూడ అందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఒక చిన్ని శుభవార్త. పదిహేను నెలల క్రింద మొదలు పెట్టిన నా బ్లాగు ప్రయాణం విజయవంతంగా కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో ఈ రోజుకు మొత్తం ఆరు బ్లాగులు కలిపి 1500 టపాలు పూర్తయ్యాయి. కావాలంటే లెక్కెట్టుకోండి. ఐతే ఏంటి గొప్ప అంటారా.. ఏమీ లేదు. ఇంకో క్లాసు పాసయ్యా అంతే..ఈ బ్లాగు సరదా కోసమే ఉంది. అంత పనికొచ్చేవి ఇరగదీసే టపాలంటూ ఏమీ లేవు. అది నాకూ తెలుసు. కాని గీతలహరి, నైమిశారణ్యం, షడ్రుచులు బ్లాగులలో అందరికీ ఉపయోగపడే టపాలు రాసా.
జ్యోతి 1 264
జ్యొతి 2 51
షడ్రుచులు 360
గీతలహరి 400
నైమిశారణ్యం 50
Health 75
Annapoorna 300
ఇక నా బ్లాగు గురించి, నా టపాల గురించి కొంతమంది శ్రేయోభిలాషులకు కొన్ని సందేహాలు ఉన్నట్టున్నాయి. అవి తీర్చడం అవసరం అని భావించి చెప్తున్నాను. ముందుగా ఒక్క విషయం.. నేను నా బ్లాగులు నాకోసమే మొదలెట్టాను. ఎవరి కోసమో, ఎవరు చెప్పినట్లో నేను వినాల్సిన పనిలేదు. ఇష్టమున్నవాళ్ళు చదవండి. బాగున్నా , బాగోలేకపోయినా పర్లేదు. ఎవరి అభిరుచి, ఎవరి తలతిక్క వారిది. ఒకె.నా బ్లాగులన్నింటిలో (సేకరణలైనా) నేను తప్ప ఇతరులెవరూ రాసే ప్రసక్తే లేదు. నేను ఆ అధికారం ఎవరికీ ఇవ్వలేదు. ఒక్క గీతలహరిలో రవి వైజాసత్యకి ఇచ్చా కాని అతను నాలుగు వీడియో పోస్టులు తప్ప రాసిందెమీ లేదు) నేను ఇతరుల రచనలను నా స్వంతమని కొందరనుకుంటున్నారు. ముఖ్యంగా నల్లమోతు శ్రీధర్ సంపాదకీయాలు. అవి శ్రీధర్ రాసినవే. కాని అతను రాసిన మంచి విషయాలు అందరితో పంచుకోవాలనే ఉద్దేశ్యంతో అతని అనుమతితోనే నా దగ్గరున్న పాత సంచికల నుండి నాకు నచ్చినవి రాస్తున్నాను. ఈ వివరాలు ఆ సంపాదకీయాలు చదివే బ్లాగర్లందరికీ తెలుసు అది నా సొంతం కాదని, నేను అలా ఎప్పుడూ చెప్పుకోలేదని. అనానిమస్ గా మంచి వ్యాఖ్యలు రాస్తే పర్లేదు. తల తిక్క వ్యాఖ్యలు రాస్తేనే మాకు నచ్చనిది. ఇలాటివాటిని నియంత్రణలో పెట్టుకోవచ్చు. కాని ఒకరిద్దరి తలకు మాసిన వెధవలకోసం(అనుచిత వ్యాఖ్యలు రాసే అనానిమస్) అందరి వ్యాఖ్యలను ఆపి పెట్టడం సమంజసం కాదని నేను కామెంట్ మాడరేషన్ పెట్టలేదు.
చివరిగా ఒక హెచ్చరిక: నా బ్లాగులో ఎవైనా సందేహాలుంటే మర్యాదగా వ్యాఖ్య రాయండి. కాని నా బ్లాగులో వ్యాఖ్యలు రాసే మిగతా బ్లాగర్ల గురించి నీచంగా మాట్లాడితే ఊర్కునేది లేదు. అసలే నేను హైదరబాదు పాతబస్తీలో పుట్టి పెరిగిన దాన్ని. తెలంగాణా , ఉర్దూ తిట్లన్ని కలిపి దండకం చదివానంటే(రాసానంటే) బాగోదు..
3 వ్యాఖ్యలు:
నమస్తె. నూతన సంవత్సర శుభాకాంక్షలు.
జ్యోతక్కా, కేవలం 15 నెలల క్రితం ప్రారంభమైన మీ బ్లాగు ప్రస్థానం సగటున నెలకు 100 పోస్టుల చొప్పున 1500 పోస్టులను పూర్తి చేసుకుందంటే నిజంగా.. మీలాంటి సీరియస్, ప్రొఫెషనల్, డైనమిక్ బ్లాగర్ ఇతర భాషల్లోనూ ఉండరేమో! చాలా గొప్ప డిటర్మినేషన్ ఉంటేనే ఇది సాధ్యం.
క్క్ క్క్ కక్క్ క్ కామెంట్ వ్రాద్దామంటే భ భ్ భయంగాఉంది. అసలు మీ పేరు ఝాన్సీ కీ రాణి అని పెట్టాల్సింది. any how you are great. మనసులో భావాలని నిర్మొహమాటంగా చెప్పే ధైర్యం మీ బ్లాగు నుండి నాలోకి కొంతైనా లాక్కోగలనేమో చూస్తాను.
Post a Comment