Thursday, 31 January 2008

పుణుకులు

1. స్నేహితుడు..

"ఏరా సంతోష్ ! అలా ఊరికే కూర్చునే బదులు నీ స్నేహితుడు శేఖర్‍తో బ్యాడ్మింటన్ ఆడుకోవచ్చుగా" అని అమ్మ అంది.

"ఆడుకోవచ్చు కాని, ఎదుటివాడు పాయింట్లు సాధించినపుడు అతడు తొండి చేస్తున్నాడని ఊరికే గొడవ చేస్తుంటే ఎవరు మాత్రం ఆడతారు?"

"అవును . అదీ నిజమే. ఎవరాడతారు?"

"అందుకే శేఖర్ నాతో ఆడడం లేదు మరి." అన్నాడు సంతోష్.



2. లింగం మావ కంఫ్యూటర్ చిక్కులు

అందరూ కంఫ్యూటర్ కొంటున్నారని లింగం మావ కూడా కంప్యూటర్ కొన్నాడు. అది తెచ్చినవాళ్ళు అన్నీ అమర్చి వెళ్ళిపోయారు. ఒకరోజు ఏదో ప్రాబ్లం వచ్చిందని లింగం మావ ఆ కంపెనీ కాల్ సెంటర్ కి ఫోన్ చేసాడు.

"హలో ! చెప్పండి , మీకు ఎటువంటి సహాయం కావాలి?"

"నా కంప్యూటర్‍తో ప్రాబ్లం వచ్చింది. ఎంత టైప్ చేసినా ఒక్క అక్షరమూ కనపడడం లేదు."

"మీరిప్పుడు కంప్యూటర్ ముందే ఉన్నారా? మౌస్‍తో కర్సర్‍ని కదిలించండి."

"అలాంటిదేమి కన్పించడం లేదు"

"కంప్యూటర్ వెనుక వైర్లన్నీ ఒకసారి తీసి మళ్ళీ పెట్టండి "

"ఇక్కడంతా చీకటిగా ఉంది"

"లైటు వేసుకొని చూడండి"

"అయ్యో! ఇక్కడ గంట నుండి కరెంట్ లేదండి. కొవ్వొత్తి పెట్టుకున్నాను.ఇంకో విషయం ఇక్కడ సిడి డ్రైవ్ పని చేయటం లేదు. ఏం చేయను?

"ఆ సిడి డ్రైవ్ లో ఉండే చిన్న హోల్‍లో పిన్నుతో కదిలించండి. సిడి ట్రే బయటికి వస్తుంది.అందులో సిడి పెట్టాలి "

"ఏది నేను టీ కప్పు పెట్టిన ప్లేటా"

"???????? ... పెట్టేయ్ ఫోన్ !!"



3. ఒక రకమైన కర్రలతో నోరూరించే పులుసులు, కూరలు చేసుకోవచ్చు.

ఏంటా కర్రలు?

7 వ్యాఖ్యలు:

Anonymous

మునక్కాయలు కాక మరేమిటి?
డ్రమ్ స్టిక్స్ నాకు చాలా ఇష్టం. వాటితో పులుసు తలచుకుంటేనే నోరూరిపోతుంది...

కొత్త పాళీ

జీల "కర్ర"

teresa

కర్రపెండలం!
కొత్తపాళీగారూ, మీ ఆవిడ జీలకర్ర పులుసు చేస్తారా?!

జ్యోతి

ఇక్కడ నేను చెప్పింది డ్రమ్ స్టిక్స్ గురించే.

కొత్తపాళి గారు
కర్ర గాని కర్ర జీలకర్ర అండి. మీకు వంట బాగా వచ్చు అని మీ శిష్యులతో ఒకసారి అన్నారు మరి ఇలా పప్పు చారులో కాలేసారేంటండి??

తెరెసా గారు,
కర్ర పెండలం పేరు విన్నాగాని అది ఎలా ఉంటుందో, ఎలాటి వంటకాలు చేయాలో తెలీదండి. ప్రయత్నించాలి. హై లో దొరుకుతుందో లేదో..

Rajendra Devarapalli

గురువు గారు తెరెస గారి ప్రశ్నకు సమాధానం ఏమి చెప్తారో చూడాలి

Anonymous

teresa గారు అన్నారు:
"కొత్తపాళీగారూ, మీ ఆవిడ జీలకర్ర పులుసు చేస్తారా?!"
teresa గారు, మీరు చేయరా?
[Double entendre :- )]

కొత్త పాళీ

ఒకటి - ములక్కాడలు ఆంగ్లములో మాత్రమే కర్రలు - తెలుగులో అవి కాడలు!
రెండు - తెరెసాగారూ, మా ఆవిడ చెయ్యడమెందుకండీ, నేనుండగా. మనలో మాట, ఒక పూట నేను కాచిన జీల కర్ర పులుసు రుచిచూసే నన్ను పెళ్ళిచేసుకున్నదన్ని నాకు ఘట్టి అనుమానం
మూడు - రాజేంద్రా, నీకు ప్రైవేటు క్లాసు తీసుకుంటాలో, జీలకర్ర పులుసు ఎలాక్కాయాలో
నాలుగు - పద్మగారూ, తెరెసాగారు చెయ్యి కాల్చుకునే రకం కాదుట - నేనేనా తక్కువ "తిన్నది"?(triple entendre!!!)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008