సాయాన్ని విస్మరించకండి...
"ఆపదలో అభయహస్తం అందించే మంచి మనుషులకు మనం ఇస్తున్న విలువ ఏమిటి? మనలొ స్వార్ధం పెరిగే కొద్దీ మనుషుల విలువలను చిన్నచూపు చూస్తూ వస్తున్నాం. మనలాగే మెటీరియలిస్టిక్‍గా స్నేహపూర్వక స్వభావం, సేవాతత్వం ఉన్నవారు ఆలోచించడం మొదలుపెడితే నిండా కష్టాల్లొ మునిగినా ఎవరి అండా లభించదు. అవును… ఎవరి గురించో ఆలోచించవలసిన అవసరం నాకేమిటీ?" అని ఈ రోజు మనం ఎంత లౌక్యంగా ఆలోచించడం మొదలుపెట్ట్టామో అంతే లౌక్యంగా అందరూ ఆలోచించగలరు. అయితే మనకీ ఎంతో కొంత చేతనైనంతా సాయం చేద్దామని తాపత్రయపడే వారికి ఉన్న ప్రధాన వృత్యాసం.. మనలో మానవత్వం లోపిస్తోంది. వారు భగవంతుడు మనిషి జన్మకంటూ ప్రసాదించిన ప్రేమ, అప్యాయతలు, సేవాతత్పరతలను కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ రోజు మన మనసులు ఎంత నీచంగ తయారయ్యారంటే.. ఎవరైనా ఏదైనా సాయం చేస్తే దానికి కృతజ్ఞత చూపించకపోగా ’దానిదేముంది .. వారు కాకపోతే మరొకరు చేస్తారు’ అని ఆలోచించేటంతగా ! ఇది నిజంగా మన మానవత్వపు పార్ఘ్యాలను సమాధి చేస్త్తోంది. కష్టాల్లో
ఉన్నప్పుడూ ఆదుకున్న మంచి మనుషుల్ని మనసుల్ని మన అభిజాత్యంతో తిరస్కరించడం మొదలుపెడితే.. సామాజికంగా ఉన్నత శిఖరాలు ఎక్కగలమేమో గానీ మానసికంగా మన విజయాలను పంచుకోవడానికి, మన ఆనందాన్ని మరింత ఇనుమడింప జేసుకోవడానికి, మరోమారు కష్టాలు వచ్చినప్పుడు అండగా నిలవడానికి ఏ ఆత్మీయుడూ అందుబాటులొ ఉండరు. కాబట్టి… అర్ధంపర్ధం లేని మెటీరియలిజం ఆలోచనలను స్వస్తి చెప్పి మనిషిగా పుట్టిన తర్వాత మనిషిగా బ్రతకడానికి ప్రయత్నిద్దాం….
నల్లమోతు శ్రీధర్
6 వ్యాఖ్యలు:
చిఱు సవరణ :-
ఆపన్నహస్తం - ఈనాడు దినపత్రిక తెలిసీ తెలియకుండా వాడుకలోకి తెచ్చిన, సందర్భశుద్ధి లేని అనేక తప్పుడు పదాల్లో ఇది ఒకటి. ఎందుకంటే ఆపన్నుడు అంటే ఆపదలో ఉన్నవాడు. ఆపన్నహస్తం అంటే ఆపదలో ఉన్నవాడి చెయ్యి. కాని ఈనాడు దీన్ని అభయహస్తం అనే అర్థంలో వాడుతోంది. ఈ వాడుకని మనం అనుసరించాల్సిన అవసరం లేదు.
తెలిసినవాళ్ళం కనుక, "అభయహస్తం" అందాం.
కష్టాల్లొ ఉన్నప్పుడూ ఆదుకున్న మంచి మనుషుల్ని మనసుల్ని మన అభిజాత్యంతో తిరస్కరించడం మొదలుపెడితే.. సామాజికంగా ఉన్నత శిఖరాలు ఎక్కగలమేమో గానీ మానసికంగా మన విజయాలను పంచుకోవడానికి, మన ఆనందాన్ని మరింత ఇనుమడింపజేసుకోవడానికి, మరోమారు కష్టాలు వచ్చినప్పుడు అండగా నిలవడానికి ఏ ఆత్మీయుడూ అందుబాటులొ ఉండరు.----ఇంతటి పచ్చి నిజాలు అందరూ తట్టుకోలేరు శ్రధర్ గారు.
సరిచేసాను తాడేపల్లిగారు.మీరు చెప్పేవరకు అది సరియైనదే అనుకున్నా నేను కూడా.
శ్రీధర్, జ్యోతి గారు,
బాగా వ్రాశారు, అది నూటికి నూరుపాళ్ళు నిజం 'మనిషి ఎలాగయినా బ్రతకవచ్చు కానీ మానవత్వ విలువలను కాపాడుతూ బ్రతకటమే నిజమయిన బ్రతుకు '.
తాడేపల్లి గారు,
మంచి విషయం చెప్పారు, ఇప్పటి వరకు నాకూ తెలియదు.
~ సత్యసురేష్
గవ్ తాడేపల్లన్న ! ఆపన్నుని కొరకు హస్తము అని చతుర్థి తత్పురుష సమాసం చెప్పుకుంటే సరిపోదా? ఆపన్న హస్తం పదం బాగుందన్నా. దాన్ని వదులు కోవటమెందుకు
ఆదుకున్న వాళ్ళని, దూరం చేసుకున్న వాడు అసలు మనిషే కాడు. ఆదుకోబడిన వాళ్ళు తమ మాటలతో, చేతలతో నిరాశ చెందించినా ... ఇతరులను ఆదుకోవటానికి ఎన్నడూ వెనుకడుగువేయని వాడే మహామనిషి. మీ మాటల్లో ఉన్న సత్యాన్ని మనుషులు గ్రహించి ఆచరించగలిగిననాడే సమాజం బాగుపడుతుంది. అయితే చదివే వాళ్ళు, వినే వాళ్ళే తప్ప ఆచరించేవారెవ్వరు?
Post a Comment