Thursday 28 February 2008

వంటింటి కుందేలు


"తప్పించుకోలేనిది " అనే అర్ధంలో ఈ మాట వాడతారు. కుందేలు పిరికిజంతువే కాని దాన్ని ఉచ్చు వేసి పట్టాల్సిందే. చాలా వేగంగా ఎగురుతూ గెంతుతూ దూకుతూ పరిగెత్తుతుంది. దొరికిన కుందేళును చెవులు పట్టుకుని లేవదీస్తారు . పొట్ట నొక్కితే చచ్చిపోతుంది. ఆ భాగం పరమసుకుమారమయింది. కుందేలుని పట్టుకున్న వేటగాడు దాన్నినేలమీద పెట్టు చుట్టూ అరంగుళమెత్తున మట్టికుప్ప వేసినా సరే ఆ "కోటగోడ"ను దాటి అది పారిపోదు ! చిన్న పుల్లతో ఆ మట్టికుప్పలో కాస్త దారిపెడితే చాలు, చెంగున ఎగిరి దూకిపారిపోతుంది. అది దాని స్వభావం , బలహీనత కూడ. దొరికిన తర్వాత ఏ కాస్త అడ్డున్నాసరే అది పారిపోదు -పోలేదు. కుందేలును వంటింట్లో బంధిస్తే అది తప్పించుకోవటమనే ప్రశ్నే లేదు. అందువల్ల మనకు దొరికిపోయి తప్పించుకోలేని ఏ వ్యక్తిని గురించయినా ’వంటింటి కుందేలు’ అని వ్యవహరిస్తారు. భారతీయ కుటుంబములోని స్త్రీని గురించి కూడా ఇలాగే వ్యవహరించేవాళ్ళు. ఉద్యోగం, సంపాదన, విడాకులను గురించిన ఆలోచనవంటివేమి లేకుండా కేవలం వంటమనిషిగా మాత్రమే బతికే ఆడవాళ్ళను కూడా "వంటింటి కుందేళ్ల"తో పోలుస్తారు.

4 వ్యాఖ్యలు:

గిరి Giri

ఇది బూదరాజు రాధాకృష్ణగారి తెలుగు జాతీయాలు అన్న పుస్తకంలోది, కదూ?

జ్యోతి

అవునండి గిరిగారు,

ఈ విషయం నేను మొదట్లోనే చెప్పాను.

గిరి Giri

క్రితం నెల హైదరాబాదు విశాలాంధ్రాకి వెళ్ళినప్పుడు నేను కొన్న పుస్తకాలలో అది ఒకటి - చాలా నచ్చింది, ఆయన రాసిన మిగతా పుస్తకాలు కూడా కొనాల్సిందే అనుకున్నాను..అవకాశం దొరికినప్పుడు మరో సారి వెళ్ళి కొనాలి

Anonymous

ప్రస్థుతం ౫౦ /50 శాతం దాక తగ్గింపు అవకాశంఉంది!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008