గుడ్ బై
రెండేళ్ళుగా తెలుగు బ్లాగు గుంపులో ఉంటూ, ఒకటి తర్వాత ఒక బ్లాగు మొదలెట్టి ఇప్పటికి కాస్తో కూస్తో మంచి పేరు తెచ్చుకున్నాను. కాని ఈ మధ్య వస్తున్న అనామక దాడి తట్టుకోవడం నా వల్ల కావట్లేదు. ప్రతి సారి టపా రాయగానే అనామకులతో జాగ్రత్తగా ఉండాల్సొస్తుంది. ఏదో అంటారు, మనమేదో అంటాము. అలా మాట్లాడేవారికి తమ పేరు చిరునామా కూడా ఉండదు . వ్యాఖ్య రాసేటప్పుడు తెచ్చిపెట్టుకున్న ధైర్యం తమ వివరాలు ఇవ్వడానికి ఉండదు. ఈమధ్య ఏవేవో చెత్త మెసెజిలు, ఒక్కోసారి వైరస్ లింకులు కూడా ఇస్తున్నారు వెధవలు.. వీళ్ళను ఎదుర్కోవడమే పనా. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఈ రోజు నుండి నా బ్లాగులన్నింటిలో పేరు , చిరునామా లేకుండా అనామక వ్యాఖ్యలు రాసేవారికి గుడ్ బై , వీడుకోలు చెప్తున్నా. అలా అని తిక్క వేషాలు వేసినా సహించేది లేదు..
5 వ్యాఖ్యలు:
మంచి పని చేసారు. ఇంతకీ ఈ అనామకులందరు మగ వెధవలనే మీ ఉద్దేశ్యమా :-) సరాదాకడుగుతున్నా :-)
హమ్మయ్యా! అనామకాసురుల్ని కదా దండించేది.. మీరే బ్లాగింగ్ కి గుడ్ బై అన్నారేమో అని హడలిపోయాను ఆ టైటిల్ చూసి! రక్షించారు!
నేను కూడా డిట్టో! ఒక పక్క మీరిలాంటి నిర్ణయం తీసుకోరని బుర్ర చెపుతున్నా టపా తెరుచుకునేంతవరకూ ఉత్కంఠ అనుభవించాను.
jyothi garu
you have spent lot of time in the blogs and do write very well. Please do not discontinue. You should do vigorously from now on, This month's Telugu section of Beyond India Monthly free English magazine has the following Articlesa.
Your aeticle -Braeve- Kalhara Garu's musings; Phanindra gari's Nireekshana and Dilip Garu's " Maa taatalu ....".
I am very thankful to all of you for your time & efforts.All of you are doing a great service
నేను కూడా టైటిల్ చూసి, మీరే బ్లాగులు రాయటం మానేస్తారని అనుకుని, హ్హడ్డలిపొయ్యాను. రక్షించారు. :)
Post a Comment