Wednesday, March 19, 2008

ఒటేద్దామా !!!.........ఆంధ్రదేశంలో ఎక్కడ చూసినా ఎన్నికలొచ్చేసాయని అన్ని పార్టీలు పాంట్లు, పంచెలు, చీరలు ఎగదోసి తమ దుమ్ము దులుపుకుని మనలందరిని మళ్ళీ టోపీ పెట్టడానికి ఓ గోల పెట్టేస్తున్నాయి. నాలుగేళ్ళనుండి ఏం చేసారో మరి.. ఇది పాత గోలే . అందరికి తెలిసిందే. కదా. మరి బ్లాగ్లోకంలో ఓటేయడమేంటీ? ఎంటా ఎన్నికలు అనుకుంటున్నారా! .. అబ్బే అ కంఫు ఇంకా మనలోకంలోకి రాలేదులెండి..


పత్రికలలో వస్తున్న వ్యాసాల పుణ్యమా అని, రోజు రోజుకు తెలుగు బ్లాగులు పెరిగిపోతున్నాయి బంగారం ధరల్లాగా . చదివేవారు పెరుగుతున్నారు. కాని వ్యాఖ్యలు రాసేవారు మాత్రం ఇప్పుడు సెన్సెక్స్ సూచి లా తగ్గిపోతున్నారు. బ్లాగులో టపా పేరు , దాని కథ ఓ నాలుగు లైన్లు కూడలిలో చూసి ఆ తోక పట్టుకుని ఆ బ్లాగుకెళ్ళి చదువుతున్నారు. చాలా సంతోషం. కాని ఇలా ఓ నాలుగైదు టపాలు చదివేసరికి ఉన్న ఓపిక మొత్తం హుష్ కాకి అవుతుంది. ఇక వ్యాఖ్యలు ఎలా రాస్తారు. పాత కాపులు(బ్లాగరులు ) అర్ధం చేసుకుంటారు. కాని కుర్ర బ్లాగర్ల (కొత్త బ్లాగర్లందరు కుర్రోళ్ళే, బ్లాగ్వయసులో) సంగతేంటీ? తెలుగు మీద ఉన్న అభిమానం, ప్రేమ తో బ్లాగు మొదలెట్టి టపా రాసి ఒక్క వ్యాఖ్యకాని, గుర్తింపు కాని రాకుంటే క్రుంగిపోతారు కదా. అసలు తను రాసింది ఎంతమంది చదివారు , ఎంతమందికి నచ్చింది , అసలు నచ్చిందా లేదా?, అని ప్రతి బ్లాగరుకు ఉంటుంది. కొందరు ఉద్ధండ బ్లాగ్పండితులు తప్ప.ఒక వేళ మనము చదివిన టపాకు వ్యాఖ్య రాసే ఓపిక లేకున్నా, బద్ధకించినా కనీసం అది మనకు ఎంత నచ్చింది, దానికి ఎన్ని మార్కులు ఇవ్వొచ్చు అని ఓటు వేస్తే. కనీసం ఆ మార్కులు చూసి ఆ బ్లాగరు మొహం వెలిగిపోతుంది కదా.(అందులో నేను కూడా ఉన్నాను మరి). అందరు ఇచ్చిన ఆ మార్కుల ఆధారంగా ఆ టపా విలువ పెరగొచ్చు , తరగొచ్చు. ఈ మార్కుల ఆధారంగా ఏ టపా ఎక్కువ ఆదరణ పొందింది అని తెలుస్తుంది , వ్యాఖ్యలు రాకున్నా కూడా. భలే ఉంది కదా !.. సో అందరు.. టపా చదవండి. వ్యాఖ్య రాసే ఓపిక లేకుంటే, మీరు చదివిన టపా మీకు ఎంత నచ్చింది అని మార్కులేయండి ఆ చుక్కల్లో ఉన్న నంబరు ప్రకారంగా.


అస్సలు నచ్చలేదు, ఫర్వాలేదు, బాగుంది, చాలా బాగుంది, సూపర్ అదుర్స్.. ఇలా 1, 2, 3, 4, 5...


బ్లాగులో టపా రాయగానే నిమిషాల్లో కూడలిలో కనిపిస్తుంది. అది చూసి చదువరులు ఆ బ్లాగు టపా చదువుతారు . వెళ్ళిపోతారు. ఎప్పుడొ ఒకసారి వ్యాఖ్య రాస్తారు కొందరు. అలాగే ఎందరో రాసే టపాలతో మన టపా ఎక్కడికో వెళ్ళిపోతుంది. లేదా మనకు నచ్చిన బ్లాగు టపా తర్వాత ఎప్పుడన్నా చదవాలంటే ఎలా. ఫలానా టపా బాగుండింది. మళ్ళీ చదువుదామంటే ఒక్కోసారి ఆ బ్లాగు చిరునామా కూడా గుర్తుండదు. ఇలాటి సమస్యలు చాలా మందికి ఉంటాయి. ఈ సమస్యకు జల్లెడవారు పరిష్కారం కనుగొన్నారు. కొత్త టపాలు, మూడు రోజులు , వారం, నెల రోజుల ప్రముఖ టపాలు .. ఇలా వివిధ విభాగాలు ఏర్పాటు చేసారు. ఇక మనకు తీరిక ఉన్నప్పుడు అన్ని బ్లాగులు చదువుకోవచ్చు. ఏది మిస్ అయ్యామనుకోకుండా..


ఇంతకీ ఓటెక్కడెయ్యాలో చెప్పలేదు కదా! ఇదిగో ఇక్కడ.

సర్వే బ్లాగ్జనా సుఖినోభవంతు..

3 వ్యాఖ్యలు:

చిన్నమయ్య

మీ ఆలోచన బ్లాగ్జన బాహుళ్యపు మనసుని ప్రతిబింబించింది. మూడింట రెండు వంతుల ఆధిక్యత మీదే. అభినందనలు.

Naveen Garla

ఓటేద్దామని ఒట్టేద్దామా :)

- నవీన్ గార్ల
(http://gsnaveen.wordpress.com)

radhika

నా ఒటు వేసాను మళ్ళి ఒటు వేయవచ్చ

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008