పుణుకులు
1. తేడా
"భార్యా విధేయుడికి, భార్యా బాధితుడికి ఏమిటి తేడా?"
"చెప్పకముందే పనులన్నీ చేసి భార్య మెప్పును పొందేవాడు భార్యా విధేయుడు."
" చెప్పాకే పనులు చేస్తూ ఒకోసారి చివాట్లు కూడా తినేవాడు భార్యా బాధితుడు."
2. వీలునామా
"ఏంట్రా దిగాలుగా ఉన్నావ్?" అడిగాడు కిరణ్ తన స్నేహితుడు చైతన్యను.
" మా నాన్న తన తదనంతరం యావదాస్తిని నా పేరు మీద విల్లు రాశాడురా." చెప్పాడు చైతన్య.
"వ్వావ్! మరైతే ఆనందంగా ఉండాలి కాని అలా దిగులుగా ఉన్నావేంటి?"
"ఆయన గుండులా ఉన్నాడు.మరో పాతిక ముప్పయ్యేళ్ళయినా కనీసం జ్వరం కూడా వచ్చే చాన్స్ లేదు." అంటూ నిట్టూర్చాడు
చైతన్య.
3. ముగ్గురు పిల్లలు ఆటలాడి అలసిపోయి కూర్చుని తమ తండ్రుల గురించి మాట్లాడుకుంటున్నారు.
రాజు : "ఓరేయ్! మా నాన్న తెలుసా! బాణం వేసాడంటే దానికంటే ముందే అవతలి దిక్కుకు చేరుకుంటాడు."
అలీ : "ఓస్ అంతేనా! మా నాయన ఐతే తుపాకి కాలిస్తే ఆ గుండు కంటే ముందే వెళ్ళిపోతాడు తెలుసా?"
మల్లేష్ :"ఇగ మా అయ్య సంగతి ఇనుకోండి. అయ్య పని జేసే ఆఫీసు ఐదు గంటలకు బంద్ ఐతే, అయ్య నాలుగు గంట్లకే ఇంట్లో
ఉంటడు మల్ల . ఎందుకో తెలుసా? సర్కారీ నౌకరీ కదా!"
4. ఉతుకుడు
పెళ్ళైన స్త్రీలు పూర్వం తెలుగులో తోమేవారు, ఇప్పుడు హిందీలో తోముతున్నారు. ఏంటది????
2 వ్యాఖ్యలు:
ఇంతేనా సింపుల్. భర్తను (మన అంట్లే హిందీ వాళ్ళ భర్తను) జ్యోతి గారు వాళ్ళకు తోమటానికి ఇంతకన్నా సులభమైనది ఏముంది?
(నువ్వుశెట్టి బ్రదర్స్ గా కామెంట్ ఇవ్వటానికి జ్యోతి గారు అనుమతించలేదు.)
-గిరిచంద్
Bartan (PAATRA) Telugu lo BHARTHANU anavach
-------V.V.Satyanarayana Setty
Post a Comment