వైవిధ్యతే విజయానికి పునాది
ఒక అవసరాన్ని వేర్వేరు వ్యక్తులు వేర్వేరు మార్గాల్లొ తీర్చడానికి ప్రయత్నించినప్పుడు ఎక్కువ మంది ఏ పద్ధతినైతే హర్షిసారో అదే విజయం సాధిస్తుంది. పెద్ద పెద్ద కార్పోరేట్ సంస్థలు మొదలుకుని సాహిత్యం, క్రీడలు, సినిమాలు వంటి రంగాలన్నింటిలోనూ కామన్‍గా వర్తిస్తున్న ఫేక్టర్ "వైవిధ్యత"! ఒకరిని అనుసరించే వారు ఎప్పుడూ "అనుసరించే " స్థితిలోనే ఉంటారు తప్ప "ఆదర్శప్రాయమైన" హోదాని ఆర్జించరు. మీరు మీ రంగంలో అత్యుత్తమమైన విజయాలను స్వంతం చేసుకోవాలన్నా, యావత్ ప్రపంచం మన్ననలనీ పొందాలన్నా లక్ష్యాన్ని సాధించడంలో రేయింబవళ్ళూ కష్టపడడానికి తోడు మీ ప్రయత్నంలో వైవిధ్యతను ఆపాదించుకోవాలి. ఫలానా వ్యక్తి ఫలానా విధంగా కష్టపడ్డాడు. కాబట్టి అదే మార్గాన్ని అనుసరిస్తే మనమూ సక్సెస్ అవుతాం అన్న ధోరణి మీ ఉనికినైతే కాపాడగలుగుతుందేమొ తప్ప మీకంటూ "మీకో" ప్రత్యేకత ఆపాదించలేము. ఎందరో సినిమా తారలు ఉన్నారు. అందరిలోనూ అమితాబ్ బచ్చన్ సూపర్ స్టార్‍గా పరిగణించబడుతున్నాడెందుకు? అప్పుడప్పుడు ఒక్క మ్యాచ్‍లోనూ సరిగ్గా రాణించకపోయినా సచిన్ టెండూల్కర్‍ని క్రికెట్ అభిమానులు ఆరాధ్య దైవంలా కొలుస్తున్నారెందుకు? ఎప్పుడైనా ఆలోచించారా? వారి వారి రంగాల్లొ వారు తమకంటూ ఒక ముద్ర వేసుకున్నారు కాబట్టి . మీరు ఓ స్టూడెంట్ కావచ్చు. ఉద్యోగి కావచ్చు. బిజినెస్ పర్సన్ కావచ్చు. మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా పదిమంది గుర్తుంచుకునేలా మీదైన స్వంత బాణిలో మీ ముందున్న లక్ష్యాలను సాకారం చేసుకోవడానికి శ్రమించండి. ఖచ్చితంగా అందరి దృష్టి మీ వైపే తిరుగుతుంది. ఆటోమేటిక్‍గా విజయం మిమ్మల్ని వరిస్తుంది.
నల్లమోతు శ్రీధర్
3 వ్యాఖ్యలు:
విషయం బావుంది. ఉత్తేజితంగానూ వుంది. అమితాభ్ బచ్చనూ, సచిన్ తెందూల్కరూ,కఠోర పరిశ్రమతో తమ తమ రంగాల్లో మాత్రమే రాణించేరు.
ఏకాగ్ర సాధనే విజయానికి సోపానమని, సోదాహరణంగా వివరించి, శీర్షిక పేరు "వైవిధ్యం" అనడం అంతగా నప్పలేదేమో!
I think the idea is that "being different" from the set path.
So, I guess the title is well suited?
మనం ఉన్న రంగంలో యాంత్రికంగా ఇతరులను అనుసరించడం కాకుండా మనకంటూ స్వంత శైలిని ఏర్పరుచుకోవడం వల్ల విజయం సులభమవుతుంది అన్నది సారాంశం కాబట్టి ఆ టైటిల్ ని ఎంచుకోవడం జరిగింది. లలిత గారు మీరు చెప్పినదే కరెక్ట్!
Post a Comment