జల్సా .........ఆ ఆ ఆ ఆ ఆ ?????????
ఇది నా అభిప్రాయం కాదు. మా అబ్బాయి చెప్పాడు. నేనేం చేయను. పాటలు అదిరిపోయాయని నిన్న మొదటి రోజు మార్నింగ్ షో కి వెళ్ళాడు.
థియేటర్ లో ఉన్నప్పుడు ఫోన్ చేస్తే "చెత్త సినిమా అస్సలు బాలేదు , దరిద్రంగా ఉంది" అన్నాడు.
సాయంత్రం ఇంటికొచ్చాక సినిమా ఎలా ఉందిరా అంటే "అసలు నాకు అర్ధమైతే కదా" అని పడుకున్నాడు.
ఇవాళ పొద్దున్న మళ్ళీ అడిగా ఎలా ఉంది అని.. " చీ ! చెత్త సినిమా ఒక్కటీ అర్ధం కాలేదు కాని తలనొప్పి మాత్రం వచ్చింది" అన్నాడు.
సరే అని పడుకుని లేచాక సాయంత్రం అడిగా సినిమా స్టోరీ చెప్పరా నా బ్లాగులో రాయాలి అని. "థు !! అసలు సినిమా కథ అంటూ ఉంటే కదా. ఒక్కటీ అర్ధం కాదు. పాటలు బానే ఉన్నాయి కదా అని వెళ్ళా. థియేటర్ నుండి పారిపోవాలనిపించింది. కాని వంద రూపాయల టికెట్ పెట్టా కదా చూద్దాం బావుంటుందేమో అని అలాగే కూర్చున్నా. ఇంతవరకు ఇంత చెత్త సినిమా చూడలేదు. ఇలా భయంకరమైన తలనొప్పి తెచ్చుకోలేదు. మళ్లీ అడిగావంటే ఆ సినిమా టికెట్ తెచ్చి నిన్ను తీసికెళ్ళి థియేటర్ లో కూర్చోబెడతా" అన్నాడు మా ప్రబుద్ధుడు.
నేను అంత రిస్క్ తీసుకోవడం అవసరమా ????
5 వ్యాఖ్యలు:
rocking
మా తమ్ముడినీ అడిగాను జ్యోతిగారు సినిమా ఎలా వుంది? అని, హిట్టే అక్కా! అన్నాడు. మరి కధ లేదు అంటే హిట్టే కదా. మీ బాబు చెప్పిన తరువాత, ఇదిగో ఇప్పుడు అర్ధమవుతోంది డౌట్ లేదు, ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని.
నిజమేనండీ! దర్శకుడు సినిమాలో ఎక్కడా కధ లేకుండా జాగర్త పడ్డాడు. చాలా బాగుంది.
నాసుదీర్థజీవితకాలంలో పొద్దున్నే లేచి పంచాంగశ్రవణం (పోనీ, పంచాంగపఠనం అనుకోండి) ఇదే తొలిసారి, జ్యోతిగారూ,
పంచాంగ టపాకర్తగారు, సుఖీభవ!
Post a Comment