Monday 14 April 2008

తెలుగు బ్లాగర్లకి శుభవార్త...

సర్వధారి నామ సంవత్సర ఉగాది రోజు ప్రవీణ్ బ్లాగు పుస్తకం తయారు చేసిన సంగతి మీకు తెలిసిందే!!. దానికి వీవెన్ ఎంత అందమైన ముఖచిత్రం తయారు చేసాడో, ప్రవీణ్ అంతకంటే రెట్టింపు కష్టపడి ఆ పుస్తకం తయారు చేసాడు. అది అందరికీ కనిపిస్తుంది. కాని అది మన బ్లాగ్లోకంలోనే తిరిగితే శ్రమకు తగ్గ ఫలితం లేదు , ఉపయోగం లేదు. నేను ఈరోజు ఆంధ్రజ్యోతి నవ్య, ఆదివారం పత్రిక ముఖ్య సంపాదకురాలితో మాట్లాడాను. ఈ పుస్తకం గురించి చెప్పాను. ఐతే ఈ బ్లాగు పుస్తకం గురించి ఒక సమీక్ష రాసిస్తే దానిని తమ ఆదివారం పత్రికలో తప్పకుండా వేస్తామన్నారు. ఈ విధంగానైనా ఈ పుస్తకం, తెలుగు బ్లాగర్ల కృషి ఇంకా ఎక్కువ మందికి తెలుస్తుంది. ఏమంటారు??

ఇంకో వార్త. ఎలాగూ సందు దొరికింది సందర్భం వచ్చింది కదా అని తెలుగు బ్లాగుల్లో చాలా మంచి మంచి రచనలు ఉన్నాయి. అవి పంపిస్తాను మీ పత్రికలో వేస్తారా అని అడిగా . సరే చూద్దాం పంపించండి ఆ బ్లాగు ఒనర్ల అనుమతితో అన్నారు. తెలుగు బ్లాగర్లలోఎంతొ మంది అద్భుతమైన టపాలు రాసారు వాటిని అందరితో పంచుకోవడం, అందునా ఒక ప్రముఖ దినపత్రికలో అంటే !,మీకిష్టమేనా?? నాకు నచ్చిన టపాలు కాదు. మీకు మీరే - మీరు రాసిన మంచి పోస్టులు నాకు లింకులు ఇవ్వండి. నేను ఆ టపా పిడిఎఫ్ చేసి పంపిస్తా మీ పేరుతోనే. దీనివల్ల నాకు డబ్బులేమీ రావు. ఇంతవరకు అడగలేదు కూడా. నాకు లాభం కూడా లేదు. బ్లాగర్లకు , వారి రచనలకు, ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఒక వారధిలా ఉండాలనే నా కోరిక. క్రింద నేను చెప్పిన బ్లాగు కర్తలు మీ బ్లాగులోని కొన్ని రచనలు ప్రచురణకు మీకు సమ్మతమేనా?? ఇక్కడ నేను చెప్పనివారు కూడా తమ బ్లాగులోని ఉత్తమ టపాలు వాటిలింకులు ఇవ్వండి. అదృష్టం బావుండి ఎవరివైనా ప్రచురించబడితే మంచిదే. అది ఆ పత్రికా సంపాదకుల ఇష్టం . నేనేమిహామీ ఇవ్వలేను. వ్యాసాలూ పంపడం వరకే నా బాధ్యత.


( అందరు పేర్ల పక్కన గారు అని పెట్టుకుని చదువుకోండి)
చదువరి
కొత్తపాళీ
వికటకవి
ఊకదంపుడు
గిరి
రాఘవ
తాడేపల్లి
అంతరంగం
విహారి
భైరవభట్ల
రానారె
సత్యశోధన
సాలభంజికలు
ఓనమాలు
జానతెనుగు సొగసులు

6 వ్యాఖ్యలు:

oremuna

మంచి వార్త! బ్లాగు లింకు ఇస్తే ప్రచురించడానికి మన వాళ్ళు ఒప్పుకుంటే బాగుంటుంది. లింకు లేకుండా అయితే గుంపులో గోవిందయ్య్ అలాగా ఉంటుంది కదా!

Anonymous

జ్యోతి,
మీ కృషి అభినందనీయం.

నా రచనలు(?) నా బ్లాగు పరిధిని దాటి వెలుగు చూడలేకపోతున్నాయి.
మీరు నన్ను ఇలా గుర్తు చేసుకుంటున్నందుకు ధన్యవాదాలు. ఐతే, ఈ అవకాశం తీసుకుని నేను నా టపాలను కాస్త ఓపికగా తిరగేసుకుని పాఠాలు నేర్చుకోగలనేమో చూస్తాను. నాకేమైనా బాగున్నాయి అనిపిస్తే మీకు పంపిస్తాను.

సత్యసాయి కొవ్వలి Satyasai

మీకృషికి అభినందనలు. నాబ్లాగుని చిట్టాకెక్కించినందుకు కృతజ్ఞతలు. నాకు తెలుగు చేసినట్లే మీకు బ్లాగు చేసింది. చాలా సంతోషం. ఇది బ్లాగర్లకి శుభకరం.

చిన్నమయ్య

పై జాబితాలో, మీ పేరూ తప్పనిసరిగా వుండాలి. అందరిలో నూతనోత్సాహాన్ని నింపేరు. అభినందనలు.

Anonymous

డబ్బులా?
ఇందులో డబ్బుల ప్రసక్తి ఏముంది?
అసలు ఆ ఆలోచన దేనికి?

జ్యోతి

నెటిజన్ గారు,

ఈ రోజుల్లో ఎవరూ ఏమీ ఆశించకుండా చేయరు చేయలేరు అనుకుంటున్నారండి. మాయింటికొస్తే ఏం తెస్తావ్. మీ ఇంటికొస్తే ఏమిస్తావ్ అంటున్నారు జనాలు. నేను బ్లాగులు రాస్తుంటే ఎంతో మంది అడిగారు. నీకేమొస్తుంది అని. అలాటివాళ్ళకు ఏమని చెప్పగలం? అందుకే ఈ టపాలో అలా తప్పనిసరై చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ఏమీ లాభంలేకుంటే నేను ఈ పని ఏందుకు చేస్తున్నాను అని అనుకునే మహానుభావులు ఎంతో మంది !!!!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008