Wednesday, April 16, 2008

వారెవ్వా !!! ఏమి కూలి ???...


తెలంగాణా రాష్ట్రీయ సమితి (టి ఆర్ ఎస్ ) ఆవిర్భవించి ఏడేళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ నెల 27 వతేదినాడు హైదరాబాదులో నిర్వహించబోయే బహిరంగా సభకు కావలసిన నిధులకోసం మన ప్రియతమ నాయకుడు కే.సి.ఆర్ నిన్న హైదరాబాదు శివార్లలో కూలి పని చేసారు. సభకు కావలసిన డబ్బులు లేవు కాని లక్షలు వెచ్చించి చిన్నిపాటి ఇల్లులా తయారు చేయించుకున్న బస్సు ఉంది. ఇదేమీ వింత? కే.సి. ఆర్ కూలి పది నిమిషాలకు లక్షల్లో ఉంది. గంజి పెట్టి ఇస్త్రీ చేసిన తెల్లని బట్టలు వేసుకుని సెక్యూరిటీ గార్డ్ అందించిన సిమెంట్ గంపను ( ఆ కాంక్రీట్ మిక్సింగ్ యజమానిని ఏమని బెదిరించారో ) మూడడుగుల దూరంలో వేయడానికి తీసుకున్న కూలి అక్షరాలా రెండున్నర లక్షలు ( పైసలు కాదు రూపాయలే ). ఒక మస్కిటో కాయిల్స్( యజమానికి ఎం ఫిట్టింగ్ పెట్టారో ) డబ్బా తల కేత్తుకుని పదడుగుల దూరం లో పెట్టినందుకు లక్ష. పొలంలో వరి కోసినందుకు (అదీ ఐదునిమిషాలే) ఆ రైతు ఇచ్చింది( ముందే అతని ఆ డబ్బు కట్టలు ఇచ్చారా?? ) అక్షరాలా మూడు లక్షలు. నిజంగా మన రైతుల దగ్గర అంత డబ్బు రెడీగా ఉంటుందా? అందునా వరి కోతలు కాకముందే, పంట డబ్బులు రాకముందే??? ... ఇన్ని పనులు చేసినా సినిమాల్లో , టీవి సీరియ్యల్స్ లో లాగా బట్టలు నలగలేదు. అది మన రాజకీయ నాయకుల ఇస్తైల్ .

అసలు ఈ డ్రామా ఆంతా ఎందుకంట ???


వారెవ్వా క్యా బాత్ హై ?? దేఖ్నే వాలే హౌలే హై ???
సుభానల్లా ??

6 వ్యాఖ్యలు:

teresa

Ridiculous Theatrix!

krishna rao jallipalli

ఈ comedy episode ని నేను కూడా news paper లో చదివాను. మన స్వార్తాంద్ర ప్రదేశ్ లో ఒక్కక్కోరు ఒకో రకం గా సంపాయించు కొంటారు. ఇదొక రకం సంపాదన. అంతే మరి.

Raj

ఇలాంటి కూలీ ఒక్క రోజుకు ఇప్పించండి. తర్వాత వెంటనే రెటైర్ అయిపోతా.

N.SaiCharan

జ్యోతి గారు నిజ౦గా బాగా రాసారు ముఖ్య౦గా లాస్ట్ లైన్స్ చాలా కామెడిగా ఉన్నాయి

Trinethra

I sincerely hope that this idiot repays the public money that is getting wasted in the name of repeated elections (have we ever seen an idiot running in elections twice in an year) by paying 33% of money earned as income tax. Yes, that is his income and he needs to pay tax and declare the same in his income proof in his nomination.

జ్యోతి

kcr రెండోరోజు కూలి ఎనిమిది లక్షలు, ఒక LCD హోమ్ థియేటర్ (ఇది ఎక్కడికెళుతుందో) , మూడోరోజు పుస్తకాల దుమ్ము దులపడం,చాయ్‍లు ఇవ్వడం లాంటీవి చేస్తే వచ్చిన కూలి పది లక్షలు

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008