Friday, May 30, 2008

నమ్మకాలు - నిజాలు


సోమవారం శివుడు, మంగళవారం దుర్గామాత, ఆంజనేయుడు, బుధవారం వినాయకుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం అమ్మవారు, శనివారం వేంకటేశ్వరుడు. ఇలా మనం పూజలు చేస్తుంటాము. అందరికి ఏదో ఒక నమ్మకము ఉంటుంది. అలా చేస్తే వాళ్ళకు అన్ని శుభాలే జరుగుతాయని గట్టిగా నమ్ముతారు. పాటిస్తారు కూడా. అది వారి జాతక ప్రభావమో, యాద్రుచ్చికమో చాలా సార్లు అవి నిజమవుతాయి.

నా విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. నేను దుర్గామాతను మనస్పూర్తిగా నమ్ముతాను. నేను ఏ పని చేసినా ముందు అమ్మ ఆశీర్వాదం తీసుకుని , ఆ పని నిర్విఘ్నంగా పూర్తి చేయడానికి తగిన ధైర్యాన్ని కోరతాను. ప్రతి మంగళవారం రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు పెడతాను. ఎన్నో క్లిష్టమైన సమస్యలు తీరాయి కూడా . ముఖ్యంగా పిల్లల చదువుల విషయంలో. అలా అని అమ్మా నీదే భారం అని గాలిలో దీపం పెట్టను. కాని ఎప్పుడు నాకు సంబంధించిన శుభవార్తలు కాని, నాకు సంతోషం కలిగించే సమాచారం కాని మంగళవారం రోజే తెలుస్తుంది.

ఇలా మీకు కూడా జరుగుతుందా?????

3 వ్యాఖ్యలు:

nuvvusetty

yes. నేను ప్రత్యేకంగా ఎవరినీ పూజించను గాని, నాకేదైనా మంచి వార్త తెలిసినా, మంచి జరిగినా అది సాధారణంగా మంగళవారమే అవటం ఎక్కువగా జరుగుతుంది. ఇది యాధృచ్చికమో లేక భ్రమో నాకు తెలీదు.

-గ్రి

బండి సున్నా

తెలుగు పుస్తకాలు చదువుతూంటే, మొదటి పేజీ నుంచి చివరిదాకా (ఎడ్వర్ టైజ్ మెంట్స్ తో సహా) చదవడం అలవాటు అయ్యింది. అలా చదువుతున్న ఒకానొక రోజు ఆంధ్ర ప్రభలో ఒకరు లెటర్స్ టు ది ఎడిటర్ లో ఇలాగ రాసారు...

"మీ పత్రికలో వచ్చే వారఫలాలు గత ముప్పై ఏళ్ళుగా చదువుతున్నాను. ఇప్పటివరకు ఒక్కసారంటే ఒక్కసారి కూడా మీరు రాసినట్టు జరగ లేదు. గమనించండి."

డిరైవ్ యువర్ ఓన్ కాంక్లుజన్ !

సీనుగాడు

నాకు ఎప్పుడూ అలా జరగదు, ఎందుకంటే వారంలో ఏ రోజునీ ఒక ప్రత్యేకత తో చూడను గనుక. మీ నమ్మకాల మీద కామెంట్ చెయ్యమని మీరుగా అడుగలేదు కానీ, నాకే ఓ మాట చెప్పాలనిపిస్తుంది, దయచేసి తప్పుగా అనుకోవద్దు. మీరు అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మీకు confidence పెరిగి, మీ ప్రయత్నం మీరు గట్టిగా చెయ్యడం వల్లే మీరు చాలా సార్లు విజయాన్ని సాధించ గలుగుతున్నారని నా ఉద్దేశ్యం. అమ్మవారి involvement మీకు confidence పెంచడం వరకే అని నా నమ్మకం. కోరుకున్నది జరగనప్పుడు, నా మీద అమ్మవారికి దయ తగ్గింది అనుకోకుండా, నా ప్రయత్నంలో ఏమి లోపం జరిగిందీ అని అలోచించగలిగినన్నాళ్ళూ, ఎటువంటి పూజలు ఎవరికి చేసినా మంచిదే.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008