చదువుకున్న పశువులు ...
ఇదేంటీ అనుకుంటున్నారా? ఇంతకంటే మంచి పేరు నాకు తట్టడం లేదు మరి. ఈ రోజుల్లో ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయక తప్పడం లేదు. అమ్మాయిలు కూడా ప్రతి రంగంలోనూ అబ్బాయిలతో సమానంగా సై అంటున్నారు. చదువుకునేటప్పుడు ఎలాగూ అబ్బాయిల వేధింపులు తప్పవు. కాని ఉద్యోగంలో చేరాక అందరూ ఒక భాధ్యతాయుతమైన పదవిలో ఉండి పనిచేస్తారు. అక్కడ అల్లరి వేషాలకు తావుండదు. కాని ఇది కూడా అసంభవమే. ఎందుకంటే లైంగిక వేధింపులు అనేవి మహిళలకు ఎక్కడైనా తప్పేటట్టు లేవు. ఆడవాళ్ళు ఉద్యోగం చేయడం కత్తి మీద సాములా మారింది.ఏరోజు ఏం జరుగుతుందో తెలీదు. రోడ్ల మీదే పని పాటాలేనివాళ్ళు వేధిస్తారు అనుకుంటే పొరపాటే. చదువుకుని , ఒక గౌరవమైన పదవిలో ఉండి కూడా మహిళలను లైంగిక వేదింపులకు గురిచేసేవాళ్ళు ఎందరో ఉన్నారు.
ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నాలుగు నెలలక్రిందే ఉద్యోగంలో చేరిన మా అమ్మాయికి ఇలాంటి అనుభవం కలిగింది. ఆ వెధవకు పెళ్ళై ఇద్దరు పిల్లలున్నారు. ఒకసారి ఎదో పని మీద మా ఇంటికి వస్తే టీ ఇచ్చి మాట్లాడాను కూడా. మా అమ్మాయి ఎంతలా బాధపడిందో కళ్ళారా చూసాను కాబట్టి ఈ టపా రాయకుండా ఉండలేకపోతున్నాను. అంత మంచి ఉద్యోగం వదులుకోలేదు. తన పనేదో తను చేసుకుంటుంది. అయినా అతను అలా ప్రవర్తించినందుకు నిజంగా షాక్ అయ్యింది. ఇలాంటి సమస్యే రమణిగారికి కలిగింది. కాని తను సమయస్పూర్థిగా తప్పించుకుంది.నేను మా అమ్మాయికి ఒకటే చెప్పాను " ఉద్యోగంలో ఉన్నప్పుడు ఆడవాళ్ళకు ఇలాంటివి ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది.ఏడిస్తే పని కాదు. ధైర్యంగా ఉండాలి.వెళ్ళి ధైర్యంగా దులిపేయ్. మళ్ళీ అలా చేస్తే మా మమ్మీ వచ్చి వాళ్ళావిడతో వచ్చి మాట్లాడుతుందంటా" అని చెప్పమన్నా. ఇందులో నా ప్రమేయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే తనకు ఇది మొదటిసారి. ఇక్కడ ముందు తనకు ధైర్యం కావాలి. ఇంట్లోవాళ్ళు ఇలాంటి విషయాల్లో తోడుగా ఉంటే ఎంతో ధైర్యం వస్తుంది. తర్వాత వాళ్ళే ఎలాంటి సమస్య అయినా ఎదుర్కొంటారు.
ఆడవాళ్ల మీద వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్నాయి అంటే చదువు,సంధ్య సంస్కారం లేని వాళు చేస్తున్నారనుకుంటే పెద్ద పెద్ద కంపెనీల్లో , ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న చదువుకున్న పశువులు కూడా ఉన్నాయని తెలుస్తుంది. అసలు వీళ్ళు ఏమనుకుంటారు. తమ జల్సాల కోసమో, టైం పాస్ చేయడానికో ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారా? ఉద్యోగం చేసే మహిళలకు ఎన్ని తిప్పలో ఒక్కసారైనా ఆలోచిస్తారా? Do they think working women are available?
ఇలాంటి పశువులను రోజు చూడక తప్పదు. కాని వాళ్ళ నుండి తమను తాము రక్షించుకుంటూ ఉండాలా? నేను చెప్పేది ఒక్కటే . "అమ్మాయిలూ! ముందు మీరు ధైర్యంగా ఉండండి.ఆత్మవిశ్వాసం ఉంటే మీరు ఎటువంటి సమస్యనైనా సమర్ధవంతంగా ఎదుర్కోగలరు. కాని కొన్ని జాగ్రత్తలు పాటించండి. అది మీకోసమే. చెప్పులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆకతాయిలను ఎదుర్కోవడానికి తయారు చేసిన పెప్పర్ స్ప్రే లాంటివి కొనుక్కుని ఎప్పుడు మీ బ్యాగులో ఉంచుకోండి. ఇకా ఆఫీసుల్లో ఇలాంటి పసువులు కనుక తగిలితే , అధికారులకు చెప్పే కంటే ముందు మిగతా ఆడవాళ్ళను కలుపుకుని వాడికి మర్చిపోలేని శాస్తి చేయండీ. అందరు కలిసి తన్నండి, వీలైతే మొత్తం ఆఫీసు స్టాఫ్ ముందు. ఆ తర్వాతే అధికారులకు ఫిర్యాదు చేయాలి.మీలో ఒకరు ఎప్పుడు ఇలాంటివి గమనిస్తూ ,అలా ప్రవర్తించివాళ్లను హెచ్చరించి, వినకుంటే ఉతికేయాలి. ఇది సినిమా సీను లా అనిపిస్తుంది కదా. లేదు మూడు నెలల క్రింద హైదరాబాదులో జరిగింది. హాస్టల్లో ఉండే అమ్మాయికి ఒకడు ఊరికే ఫోన్ చేసి సతాయిస్తుంటే ఒక అమ్మాయి తన స్నేహితురాళ్లతో కలిసి వాడిని పిలిపించి అందరూ కలిసి బాగా తన్ని పోలీసులకు పట్టించారు. So nothing is impossible , if ur brave to handle the situation ...
ఇంతకూ ముందు ఒక బ్లాగులో ...ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, వేధింపులకు కారణం వారి వేషదారణ అని చర్చ జరిగింది. కాని మా అమ్మాయి ఎప్పుడూ పంజాబీ డ్రెస్సులు వేస్కుంటుంది. రమణి గారు నిండుగా చీరలోనే ఆఫీసుకు వెళ్తారు. మరి ఇలా ఎందుకు జరుగుతుంది..
15 వ్యాఖ్యలు:
this is a serious problem, and must be condemned.
Jyothi akka! belated marriage silverjubilee wishes.
2 telugu bloggers:
my blog adress is annisangathulu.blogspot.com
c n tell me your opinion. I too discussed a serious problem.
ఇదివరకు నన్ను మా ఆఫీస్ లో ఒకడు ఇలానే సతాయిస్తే మా మేనేజర్ తో చెప్పాను.ఆయన వాడికి దొబ్బులు పెట్టాడు,కాని అప్పట్నుంచి వాడు నన్ను చాలా సీరియస్ గా చూస్తాడు.అదేదో నేనే వాడ్ని సతాయించినట్టు!వెధవలు ఎప్పుడు బాగుపడతారో ఏమో!
జ్యోతి గారు..
మంచి మాట చెప్పారు. వేధింపులకు గురయ్యే పిల్లలూ.. మహిళలూ మొదట సమస్య ని మనసు లో పెట్టుకుని కుంగిపోకుండా.. ''ఇలాంటివి అమ్మా నాన్నల తో ఎలా డిస్కస్ చెయ్యాలి''.. అంటూ భయాలూ, అనుమానాలూ పెట్టుకోకుండా.. కుటుంబ సభ్యుల తో తప్పకుండా చర్చించి, వాళ్ల సహకారం పొందాలి. తల్లీ, తండ్రీ ఇచ్చే మోరల్ బూస్ట్ వీళ్ళకి శ్రీ రామ రక్ష. అందరికీ సినిమాల్లో మహేష్ బాబు లాంటి అన్నయ్యలు ఉండరు. అందుకే, ఒక వేళ హాస్టల్ లో కుటుంబానికి దూరంగా ఉన్నా పిల్లలు ఇలాంటి పరిస్థితులను యెదుర్కొనగలిగె ధైర్యం కలిగి ఉండాలి.
ఆడ వాళ్ళు ఆఫీసుకి ఎట్లా తయారయి వస్తున్నారు అనేదే ఈ దేశానికి పెద్ద 'ఆందోళన' కలిగించే విషయం. ఆడవాళ్లు ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎందుకు డ్రెస్ చేసుకోవాలి అని బోల్డంత కష్టపడి ఆలోచిస్తుంది ఈ సమాజం. వర్క్ లో చేరేటప్పుడు జరిగే ఇండక్షన్లో కంపెనీ హెచ్.ఆర్ పాలసీ, లైంగిక వేధింపుల పట్ల కంపెనీ ధోరణీ గమనించాలి. ఊరుకోవాల్సిన అవసరం లేదు. అదృష్టవసాత్తూ ఈ విషయానికి చట్టాలున్నాయి.
హ! హ! క్రాంతి నేను సమస్య మొదట మా బాస్ కి చెప్పాను,సింపుల్ గా ఆయనన్నమాట ఎంటో తెలుసా? "పోలిసులకి చెప్పండీ ఇలా అల్లరి పెడ్తున్నాడని" అని .. ఉచిత సలహాలు ఇలాగే వుంటాయి. వాడెవడో మిమ్మల్ని సీరియస్ గా చూస్తున్నాడు అన్నారు. రోజు మొఖం చూసేవాళ్ళకి తెలివిగా బుద్దులు చెప్పాలని నా అభిప్రాయం, అంటే అటు కర్ర విరగకుండా ఇటు పాము చావకుండా..
జ్యోతిగారు: వేషదారణ మగవారిని ఉసిగొల్పుంది అనేది ఎంతమాత్రం నిజం కాదండీ. ఇది కాలేజ్ కుర్రకారుకి మాత్రమే పరిమితం. ఆఫిస్ లోని మగవాళ్ళకి "ఆడ" అయితే చాలు. ఆంటీ నా! అమ్మాయా! పాపా! అనేది కూడా చూడరు ముఖ్యంగా ఆఫిస్ లోని మగపశువులు. ఇట్లో బార్య రంభలా ఉన్నా, పక్కింటి పళ్ళెత్తు అమ్మాయిని చూసి చొంగ కార్చే రకాలు వీళ్ళంతా.
not in all the offices this will happen...and all the men are not "Pasuvulu".... In Govt. Sector Conduct, Discipline and Appeal rules will be there .... if any one misbehaving with ladies they can complain to CVO directly...
srinivas babugaru,
I never said tht this happens in all offices. and all men are pasuvulu. only women can understand the pain .. and all matters cannot be reported to CVO.
మూర్ఖులు, వీళ్ళని క్షమించకూడదు. వాళ్ళకి కూడా అమ్మ, అక్క, చెల్లి, పెళ్ళాం, కూతుళ్ళు ఉంటారు కదా...వాళ్ళతో కూడా ఏ ఎధవన్నా ఇలాగే ప్రవర్తిస్తే ఏమవుతారు?
ఒడ్డు మీద కూర్చుని మునగకుండా ఉండటం ఎలాగో చెప్పడం చాలా ఈజీ కనక నేను ఆ ప్రయత్నం చేయట్లేదు కానీ, మీరు, మీ అమ్మాయి ఈ ప్రోబ్లెం ఎలా సాల్వ్ చేసారో చివరకి (ఓడిపోకుండా) మాకు చెప్పండి.
నేనే ఈ ప్రోభ్లెం లో ఉంటే వాయిస్ రికార్డర్ తప్పకుండా ఉపయోగిస్తా. ఒక్కళ్ళూ ఏడుస్తూ కూర్చుంటే ఒరిగేది సున్నా.
ఒక్క విషయం. పెంట్ అప్ సెక్స్ కోరికల వల్ల లైంగిక వేధింపు చేసే మగాడికి అమ్మాయిలు వేసుకునే డ్రెస్సులతో సంబంధం లేదని తెలుసుకోండి. పూర్తిగా బట్టలేసుకున్నా ఫాంటసీతో చూసే మగాడికి కనపడేవి కనపడుతూనే ఉంటాయ్. అపార్ధం చేసుకోకండే ఇలా అన్నానని? బట్ దట్ ఈజ్ ది సేడ్ రియలిటి.
"విద్య లేని వాడు వింత పసువు" అన్న నానుడి ని రీ-డిఫెన్ చేయాలండి. ఈ రోజుల్లొ మీరన్నట్టుగా చదువుండి కూడా అలా పసువు లా ప్రవర్తించడం చాలా విచారించతగ్గది. చదువు తొ బాటు సంస్కారం కూడా ఉండాలండి, అప్పడె ఆ చదివిన చదువుకి విలువ. ఈ రోజుల్లో ఆ సంస్కారం బాగా కొరవడింది.
తప్పకుండా HR కి ఫిర్యాదు చేయండి. మేనేజ్ మెంట్ అంత సీరియస్ గా తీసుకోలేదూ అంటే అఫీసులొ ఆడవాళ్ళంతా కలిసి తగిన శాస్తి చేయండి.
http://prajasakti.com/headlines_3.htm
Exactly, they think working women or women living/studying by themselves are so available, so ready, so craving. ఆ జబ్బు హైదరాబాదు, బెంగలూరు కాదు, US వచ్చినా వదలదు. ఏంటో ఆ కక్కుర్తి, ఎదవలకి. True, only women who go thru this can undestand the pain. వస్త్రధారణకి, వయసుకి, ప్రవర్తనకి యే మాత్రం సంబంధం ఉండదు. ఇలాంటి వెధవలు, బయటకి మర్యాదస్తులుగా చెలామణి అవ్వాలీ, పరువు పోకూడదూ, అయినా మన కక్కుర్తి తీరాలి అనుకుంటారు. అందుకే అలాంటివారిని రూంలో ఉండి తిట్టడం కాదు. అందరిముందు మొహమ్మీద తిట్టాలి, అందరికీ వినబడాలి, గూబ గుయ్యిమనిపించాలి. అది office colleagues విషయం లో అయినా, cinema hall లో వెనకాలనుంచి తన్నేవాడన్నా, bus లొ చెయ్యి నొక్కేవడన్నా, ఆకతాయి వేషాలు వేసే వయసూ వరసా తెలియని పక్కింటి 10th class కుర్రోడన్నా, familyకి దూరంగా చదువుకుంటున్న/work చేసుకుంటున్నప్పుడు శ్రేయోభిలాషి గా వ్యవహరిస్తూ indirectగా ఉద్దేశ్యం బయటపెడుతూ advance అవుతున్న పెళ్ళయ్యి పిల్లలున్న family friend అన్నా. Fortunately, నాకు officeలో Indians, particularగా తెలుగువాళ్ళు లేరు గాని, this technique worked for me in all other cases.
డైరెక్ట్ గా వాడితోనే మాట్లాడమనండి, ఇంకోసారిఇలా చేస్తే ఆఫీస్ లోనే గాక ఇంటిదగ్గర కూడా రచ్చచేస్తానని బెదిరించమనండి. ఇలాంటి వాళ్ళలో సమాజానికి, పరువుపోతుందని భయపడేవాళ్ళే ఎక్కువ (ముదురుగాళ్ళు తప్పితే). ఒకవేళ అతను మీ అమ్మయికి లీడర్ అయి మీఅమ్మాయిమీద ప్రతీకారం తీర్చుకుంటున్నట్టనిపిస్తే మేనేజ్ మెంట్ తో మాట్లాడి లీడర్ మార్పునుకోరొచ్చు. మరోవిషయం ఇలాంటివిషయాలు ఒకేసారి జరగవు, అంటే వేధింపు చేసేవాడు స్టెప్ బై స్టెప్ మొదలెడతాడు. మొదటికొన్ని స్టెప్స్ అమ్మాయి నో అనిచెపుతుందా లేదా అని తెలుసుకోడానికి. అమ్మాయిలు ఇలాంటివాటిని స్వేచ్చ, లేటెస్ట్ ట్రెండ్, ఫ్రెండ్ షిప్, గాడిదగుడ్డు అనిఅనుకోకుండా అప్పుడే వాడికి బుద్ది చెపితే తరువాత సమస్యలు రావు. మీగౌరవం మీచేతుల్లోనే ఉంది.
ఈవిషయం పై, మీకు అంటే ఆడాళ్ళకి బహుశా నచ్చని మరికొన్ని కోణాలను నా బ్లాగులో రాద్దామనుకుంటున్నాను, త్వరలో.
క్రాంతిగారు: వాడు మిమ్మల్సి చూశాడా లేక మీరే వాడ్ని చూశారా. మీరు వాడికేసి చూసిన ప్రతిసారీ, వాడేవిధంగా అనుకుంటాడో ఆలోచించారా? ఒక సంఘటన జరిగింతర్వాత ఒకరి చూపులో మరొకరికి విపరీతార్ధాలు కనబడడం మామూలే. మనిషి సైకాలజీనే అంత.
మగాళ్ళంతా పశువులే.. కాదు కాదు.. కోతులు,
మగ కోతులు, కోతినుండేగా మనంవచ్చింది. అందుకే చంచలత్వం... ఆడ కోతిని చూస్తేచాలు..
తోక లేపుకుంటూ... చొంగ కార్చుకుంటూ...
మగాళ్ళంతా పశువులే... కొందరు గోవుల్లా... మరికొందరు ఎనుబోతుల్లా... (బ్లా.. బ్లా.. బ్లా..)
బెంగుళూరు వెళ్ళినా... (బ్లా.. బ్లా.. బ్లా..)
అయినా మగాళ్ళంతా పశువులే.
(ఈ కామెంట్ రాస్తున్నప్పుడు సడన్ గా నాలో "కపిత్వం" పొంగుకొచ్చి, ఏదో పైనది రాశాను. ఇదేదో "తవిక" లాగనిపింస్తుందికదా?)
నేను మా అమ్మాయికి చెప్పాను. ఆ వ్యక్తికి చెప్పు " మమ్మీ వచ్చి వాళ్ళవిడతో మాట్లాడతానంది.అవసరమైతే కంపెనీ చైర్మన్‍తో కూడా మాట్లాడతాను" అని చెప్పమన్నా. కాని తను అతను వయసులో పెద్దవాడు కాబట్టి ఇంత పెద్ద కంపెనీలో పని చేస్తు ఎందుకిలా చేసారు, కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది తెలుసా? behave urserlf" అతను బెదిరిపోయాడు. తెల్లారి ఆఫీసుకు రాలేదు. సారీ అని మెసేజిలు పంపించాడు సెల్‍కి. రోజు కలిసి పనిచేయకతప్పదు కాబట్టి ఎక్కువ గొడవ చేయలేదు. నేను తరచూ అడుగుతూనే ఉన్నా ఎలా ఉంది ఆఫీసులో అని.
ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. నాకు తెలిసి కంపెనీలలో హెచార్ ఇప్పుడు కఠిన నియమ నిబంధనలు రూపొందిస్తున్నాయి ఇలాంటివి అరికట్టడానికి.
భయపడకుండా ఇలాంటి వారి మీద కంప్లయింటు ఇచ్చి పని పట్టాల్సిందే.
jyothi garu i think it depends on the individual whether he is lady or gent it depends on their character.
Post a Comment