ప్రమదావనం - 3
ఆలస్యంగా మొదలైనా అందరు భామలు రాకున్నా ప్రమదావనం మూడవ సమావేశం (25.5.08) సరస సల్లాపాలతో , సీరియస్ చర్చలతో జరిగింది.
హాజరైన ప్రమదలు:
జ్యోతి
జ్ఞాన ప్రసూన
సత్యవతి
తెరెస
స్వతి
సుజాతశ్రీ
రమణి
స్వాతి చక్రవర్తి
అందరూ ఆలస్యమైందా అనుకుంటూ ఒకరివెనకాల ఒకరు వచ్చేసారు. పాపం ఇద్దరు సుజాతలతో చిక్కే వచ్చింది. మనందరికోసం సుజాత (మనసులో మాట ) తన పేరుని మరోసారి మార్చుకున్నారు .ఈసారి జ్ఞానప్రసూనగారు భేషైన సలహా ఇచ్చారు.ఎంతైనా అనుభవజ్ఞులు కదా. సుజాతా శ్రీనివాస్ అని మరీ పొడుగు పేరు కాకుండా నాజూగ్గా సుజాతశ్రీ అని పెట్టుకోమన్నారు. అందరికి నచ్చింది. సత్యవతి గారు రెండు రోజుల క్రింద హటాత్తుగా చనిపోయిన తన స్నేహితురాలు డా.భార్గవీరావు గారి గురించి చెప్పారు. భార్గవిగారు రచయిత్రి, అనువాదకురాలు,, ఇంకా నిజాం కాలేజీలో ఇంగ్లీషు ప్రొఫెసర్.
ఇక్కడ ఇంకో ముఖ్య విషయం చెప్పాలి. ఈ రోజు సత్యవతిగారు కొండేపూడి నిర్మలగారిని ప్రమదావనానికి ఆహ్వానించారు.కాని ఎందుకో ఆవిడ రాలేదు. ఆవిడ కూడ బ్లాగరే కదా. ఏంటో మరి ఇప్పుడు రాయడం లేదు. సత్యవతి గారు తన భూమిక పత్రికతో పాటు భూమిక హెల్ప్ లైన్ అని బాధిత మహిళల కోసం సహాయ కార్యక్రమం విజయవంతంగా నడిపిస్తున్నారు.
ఈసారి అందరు కలిసి నన్ను హాట్ సీట్ మీద కూర్చోబెట్టారు. నాకేంటి భయం ఓకే అన్నా. చూద్దాం ఎవరు గెలుస్తారో అని.
సుజాతశ్రీ, రమణి , సత్యవతి , తెరెసా కలిసి నా బాల్యం , ప్రేమ కథ అడిగారు.
జ్యోతి : ఏముంది. అందరిలాగే నార్మల్. కాని ఒక్క కూతురిని అవ్వడం తొ కాస్త గారంగానే పెరిగాను. పుట్టింది , పెరిగింది అంతా హైదరాబాదు పాతబస్తీ. చిన్నప్పుడు అందరితో కలిసేదాన్ని కాదు. తక్కువ మాట్లాడేదాన్ని. నాకు గర్వం అనే పేరు కూడా ఉండేది. చిన్నప్పటినుండి అమ్మాయిల స్కూలు, కాలేజీలు. అల్లరి లాంటివి లేవు. ఇలా అంతర్జాలానికి వచ్చాకే అల్లరి మొదలైంది. బ్లాగు గుంపులో మొదట్లో ఎక్కువ అల్లరి చేసింది నేనే.. అందరికీ తెలుసు. గుంపులో కాదు నీ బ్లాగు తెరుచుకుని అక్కడ చేయమని గొడవ చేసి నాతో బ్లాగు మొదలెట్టించారు.
ఇక ప్రేమలు దోమలు అస్సలు తెలీవు. చదువుకుంటుండగానే పెళ్ళి చేసేసారు. ఏం చేస్తాం తప్పదని తప్పేదిలేదని మావారినే ప్రేమించడం మొదలుపెట్టాను. కాని నన్ను ప్రేమించేవాళ్ళు చాలామంది ఉన్నారు లైన్లో. గొడవ చేస్తారు ఇలా మాకంటే ముందుగా ఎందుకు పుట్టారు. లేకుంటే ఎత్తుకెళ్ళి పెళ్ళి చేసుకునేవాళ్లం కదా అని. నేను చెప్పా వచ్చే జన్మలో ప్రయత్నించండి. కాని ఇంకా వెతుకుతున్నా మావారికంటే బెట్టర్ క్యాండిడేట్ దొరుకుతాడేమో అని ?
తర్వాత సత్యవతి గారివైపు గాలి మళ్ళింది.
సత్యవతి : నాది ప్రేమ వివాహం . నిప్పుల మీద నడిచి సహచరున్ని పట్టుకున్నా. అతనితో కలిసి జీవితమంతా పువ్వులు పరుచుకున్నా. అప్పుడు తను చెట్టుకింద ప్లీడరు. ఇప్పుడు హైకోర్టు జడ్జి.
కాని అందరూ ఒప్పుకున్నది ఏంటంటే సంసారంలో గొడవలు లేకుంటే మజా లేదని. అస్తమానం తీపి తింటే మంచిది కాదు , కాస్త ఘాటైనా మసాలాలు తగలాలి. మధ్యలో కాకరకాయ ప్రహసనం. కాకరకాయ సంఘం పెట్టేవరకు వెళ్ళింది చర్చ.
కొద్దిసేపు రమణిగారు కాకినాడ విహారయాత్ర వివరాలు ముచ్చటించుకున్నాక రమణిగారి సమస్య చర్చకు వచ్చింది.
రమణి : నా వృత్తి రిత్యా ఓ ప్రభుత్వ ఆఫీసులో ఒక పేమెంట్ కలెక్ట్ చేసుకోవాల్సి వుంది. అక్కడికి వెళ్తే, ఓ సీనియర్ అధికారి ఓ రకంగా లైంగిక వేధిపులకి గురి చేసారు. అలాగే ఫోన్ ద్వారా కూడా వేధింపులు జరిగాయి,ఫోన్ ద్వారా కూడా అక్కడికి వెళ్ళి చెక్ చెయ్యాలి, ఇక్కడికి వెళ్ళి చెక్ చెయ్యాలి మీరు రండీ అనే వేదింపులు మొదలయ్యాయి. ఈ సమస్యకి ఎదో ఒక టైం లో మన మహిళలమందరం (ఉద్యోగం చేస్తున్నవారు/చెయ్యని వారు) గురి అవుతున్నవాళ్ళమే. ఇలాంటి సమస్య వస్తే ఎవరికి వారం ఎలా ఎదుర్కొంటాము? సమస్యకి పరిష్కారం ఏంటి. అధికారి హోదా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ, కఱ్ఱ విరగకూడదు, పాము చావకూడదు అన్న రీతిలో.
తెరెసా: నాకు ఇంతవరకు ఇలాంటి సమస్య రాలేదు కాని ఇలాంటి విషయాలు మనమే తేల్చుకోవాలి.అతడిని హెచ్చరించి లేదా పై అధికారులకు చెప్పి. లేదా ఎవ్వరికి తెలీకుండా వాడిని తిట్టేసి బయటపడడం.
స్వాతి : నేను ఈ మధ్యే ఉద్యోగంలో చేరాను. ఇలాంటి సమస్య వస్తే ఆయనకే చెప్తాను.
సుజాతశ్రీ : అలా కాకుండా ఒక చిన్ని కెమెరా తీసికెళ్ళి అతని మాటలు రికార్డ్ చేస్తే మనకు దొరికినట్టే కదా.లేదా TV 9 వాళ్ళకి చెప్తే సరి. అంతా చండాలం చేసేస్తారు.
తెరెసా : కాని ఈ చండాలంలో అనవసరంగా తన పేరు కూడ చేరుతుంది.
స్వాతి : రమణిగారు ఆ ఆఫిసర్ నంబర్ ఇస్తే మా ఆయన వారానికో కోటింగ్ ఇప్పిస్తారంట.
రమణి : నేను ఎంచుకొన్న పరిష్కార మార్గం: ఈ క్రమంలో ఓ రోజు రండీ క్రాస్ చెక్ చెయ్యాలి ఒక్క 2 మినిట్స్ లో అయిపోతుంది అని ఫోన్ చేసినప్పుడు సదరు అధికారి ఫోన్ చేసినప్పుడు "తప్పకుండా వస్తాను సర్! కాకపోతే కొంచం ఆలస్యం అవుతుంది , ఎందుకంటే ఈమధ్య వారం రోజులనుండి ఎవో మిస్డ్ కాల్స్ , రాంగ్ కాల్స్ వస్తున్నాయి, సో! అన్నయ్యకి తెలిసిన ఎవరో పోలీస్ హైయ్యర్ అఫ్ఫిషియల్స్ దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు, దానిలో భాగంగా నేను నా సెల్ లో నంబర్స్ అక్కడ ఇచ్చి వస్తున్నాను, రోజు వచ్చిన కాల్స్ వాళ్ళు చెక్ చేస్తున్నారు, సొ! నాకు కొంత టైం కావాలి మీ నంబర్కి కూడా ఫోన్ చెయ్యొచ్చు అయినా, పర్వలేదు నేను చెప్తాను మీరెంత మంచివారో అని..".
ఆతరువాత రోజు నాకు అతని(అధికారి) ఆఫీసు (ప్రభుత్వ ఆఫీసు) లాండ్ లైన్ నుండి ఫోన్, చెక్ రడీగా వుంది, ఆఫిస్ కి వచ్చి ఇస్తున్నానని, పనిలో పనిగా, మాడం నా నంబర్ మీ ఫోన్లో సేవ్ అయి వుందా. (గొంతులో ఆ కంగారు తెలుస్తూనే వుంది).
జ్యోతి : కాని ఇది అన్నివేళలా పని చేయదు కదా.
రమణి : అవును ఇప్పటికి ఈ సమస్య తీరింది.ఇంకా ఎన్ని ఎదుర్కోవాలో.ప్రతీసారి వేర్వేరుగా ప్రయత్నించాలి.
జ్ఞాప్రసూన : ఈ విషయంలో ఇంట్లోవాళ్ల సహకారం కూడ ఉంటే మంచిది.
అనుభవజ్ఞులైన ప్రసూనగారు ఇంకో మంచి సలహా ఇచ్చారు. పొద్దునే పెళ్ళానికి టీ కాని కాఫీ కాని ఇస్తే రోజంతా ఎంతా బాగుంటూందో మగాళ్ళకి తెలీదు అని. ఈసారి శ్రీవారితో కలిసి నౌకావిహారానికి తయారవుతున్న తెరెసా గారిని కాస్త ఆటపట్టించి అందరూ సెలవు తీసుకున్నాము.
4 వ్యాఖ్యలు:
చర్చించుకొందాము రండీ!
సమస్యని అన్నీ కోణాలనుండీ పరిశీలించి, మన బ్లాగర్లందరూ తలో పరిష్కారం సూచిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. సమస్య ఇంతవరకూ నాకెదురవలేదు అని అనుకొనేకన్నా, ఒకవేళ ఏదురైతే? అని ప్రశించుకొని పరిష్కారం ఆలోచిస్తే బాగుంటుంది. అధికారులందరు "బలవంతుడ నాకేమని" అనేట్లు ఉన్నా ఇలాంటి వెకిలి వేషాలు వేసెవారి అంతు, చలి చీమల్లా ఐకమత్యంతో మనందరమూ కలిసి చూడగలమని నా అభిప్రాయం. ప్రమదావన మహిళల తరుపున మన బ్లాగర్లందరికి ఇదే మా ఆహ్వానం.
జ్యోతి గారు,
సుజాతశ్రీ పేరు కేవలం ప్రమదావనం కొరకే!
మీరు hot seat మరో సారి ఎక్కాలి. ఎందుకంటే ఈ సారి అనుకోకుండా ఆ సీటులో మనం సత్యవతి గార్ని కూచోబెట్టాం అనిపించింది. (ఎప్పుడో ఒకసారి ఆవిడా కూచోవాలనుకోండి) మీ గురించి ఎవరమూ ఎక్కువ ప్రశ్నలు వేయకుండానే చాలా టైం అయిపోయింది. మరొక సారి మీరు hot seatలో కూచోవాలని మనవి
@రమణి గారు,
ఇంకోలా కూడా చెయ్యొచ్చు. మహిళా బ్లాగర్లలో ఇదివరకే ఎవరైనా ఇటువంటి వేధింపులు ఎక్కడైనా ఎదుర్కొని ఉంటే వాటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కొన్నారో ఎవరి అనుభవాలు వాళ్ళను రాయమంటే?(బ్లాగుల్లో వద్దనుకుంటే ప్రమదావనంలో చెప్పుకోవచ్చ్చు) మీ సమస్య గురించి ప్రమదావనం నివేదికలో వస్తుందని నేను ఊహించలేదు.
సుజాత గారు,,
రమణి గారి సమస్య వారి అనుమతితోనే నివేదికలో రాయడం జరిగింది..
తప్పకుండా నేను మళ్ళీ హాట్ సీట్‍లో కూర్చోడానికి రెడీ. నిజంగా చాలా చెప్పాల్సి ఉంది.
ఇక్కడ JOB చేసే LADIES కి ఒక DRAW BACK ఏమిటంటే, వారి పేరు రచ్చ అవుతుందనే భయం.. వెనకడుగు వేయించుతుంది. వెనుకా ముందు ఆలోచించాల్సిన అవసరం తప్పని సరి ఈ MIDDLE AND UPPER MIDDLE CLASSES వారికీ. అదే కనుక లోయర్ మిడిల్ CLASS వారికి .. ప్రత్యేకించి ఇటువంటి విషయాల్లో... ఎదురు లేదు.. తిరుగు లేదు.. అవతలి వాడు ఎ నా కొడుకు అయిన.. ఎంత పెద్ద వాడు అయినా.. చిరిగి చేట అవ్వల్సిందే. ఆ IMPACT ఎలా ఉంటుందంటీ.. ఆ నా కొడుకు ఇక వాడి జన్మలో ఆ అమ్మాయి వంక కన్నేత్తడు. అల ఉంటుంది వారి REACTION.
Post a Comment