Monday, 2 June 2008

ప్రమదావనంలో పూబంతుల ముచ్చట్లు




ఎక్కడెక్కడ అని వెతుక్కోకండి. ఈ పూల మీద సున్నితంగా స్పృశించండి.

2 వ్యాఖ్యలు:

Ramani Rao

చాలా బాగుంది జ్యోతిగారు!

నేను మాటల ద్వార చెప్తే , మీరు ఒక్క సిత్రంతో, యిసిత్రాలు సేసెస్తున్నారు మరి.

amar

డబ్బుతో స్ర్తీకి సాంఘిక హోదా కాదు. సాంఘిక భద్రత వస్తుంది. డబ్బు సహాయం కోసం వేరే వాళ్ళ దగ్గర చేయి చాస్తే అన్నయ్య అని చెప్పేవాడు కూడా ‘వేరే’ విధంగా వాడుకోవాలని చూస్తాడు (అందరూ అలా ఉండరేమో!! కొందరి ఖర్మ కొద్ది ఇలాంటి వాళ్ళు దాపురిస్తారేమో!!). కేవలం డబ్బే కాదు మాట సాయమైనా సరే. ఎవరూ సాయం లేని నిస్సహాయ పరిస్థితిలో డబ్బు తోడుంటే, ఆ డబ్బు పడేస్తే జరిగే పనులు జరుగుతాయి. నా దృష్టిలో డబ్బు ఉంటేనే స్ర్తీ సుఖంగా ఉంటుంది. ఎవరూ కాదని వాదించినా సరే!! ఏమీ కందకుండా పుట్టిన దగ్గర నుండి ఇంట్లో అన్ని రకాలుగా బాగా జరిగేవాళ్ళకు ఇది వర్తించకపోవచ్చు.

ఇంక ఉద్యోగాలు చేసే ఆడపిల్లల పెళ్ళి విషయానికి వస్తే....
ఏ తల్లితండ్రుల కైనా ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళి పిల్లలతో సంతోషంగా ఉండాలనే ఆశిస్తారు. కానీ, ఆర్ధికంగా చితికిన కుటుంబపు ఆడపిల్ల ఏం ఆలోచిస్తుందో తెలుసా? ‘పెళ్ళికోడుకుల సంతలో తగినవాడిని తమ తల్లితండ్రులు ఎలాగో కొనలేరు. పై పెచ్చు కట్నం దారపోసి, రేపు సంపాదించే డబ్బు దారపోసి తమ వాళ్ళని చూసుకొనే అవకాశం ఉండదు. అన్నింటికి డబ్బు పెట్టి కొనుక్కున్న వాడి అనుమతి కావాలి’. అందుకే అన్ని రకాలుగా ఆలోచించే ఆ ఆడపిల్ల పెళ్ళి వద్దనుకుంటుంది. అంతే కానీ, నాకు తెలిసి 99% బాధ్యతారాహిత్యమైన తల్లితండ్రులు ఎవరూ ఉండరు. ఈ రకమైన నరకం, గుండెకోత అనుభవమైతే కానీ, నేను చెప్పే మాటలకు ఓటు పడదు. అయినా మగవాడే కానీ, ఆడపిల్ల తల్లితండ్రుల బాధ్యత తీసుకోకూడదా?

గృహ జీవితం తీర్చిదిద్దే భారం ఇద్దిరి పైన ఉంటుంది. మగవాడు బయటకు వెళ్ళి సంపాదించుకు రాకపోతే ఎంతటి గొప్ప భార్య అయినా ఎలా తీర్చిదిద్దుతుంది? ఈ మధ్య టపాలు చూస్తుంటే... మగవాడిని మరీ తక్కువ చేసి మాట్లాడటం ఎక్కువ అయింది. ఇద్దరూ సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. ఇద్దరు ఒకరికి ఒకరు విలువ ఇచ్చుకోవాలి. సమాజం విలువ ఇచ్చేలా మసలుకోవాలి. విలువల కోసం పోరాటం, ఆరాటం తప్ప భార్యగా భర్తకి, భర్తగా భార్యకి ఎంత ప్రేమ పంచుతున్నాం, ఎంత ఆసరాగా ఉంటున్నాం అనే విషయం పై ఆలోచించాలి. భార్యకు విలువ ఇంట్లో నిజంగా దొరికేవాళ్ళే ఇంకా విలువల గురించి మాట్లాడుతున్నారు. దొరకని ఎంతో మంది అన్నింటికి సహించి ఉంటున్నారు. వాళ్ళకు ఈ విలువలు వగైరాలు ఏమీ పట్టవు. భర్తకు ఏంచేశామా? పిల్లలకు ఏం చేశామా అని తప్పిస్తే. నా ఉద్దేశ్యం ఎవరికి తప్పు పట్టడం, కించపరచడం కాదు. ఎవరికి ఎవరూ పోటీ కాదు. సర్వేజనాసుఖినోభవంతు!!!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008