Sunday 22 June 2008

ఆహా ఏమి రుచి !!!




ఇప్పటిదాకా నాకు వచ్చిన వంటలు బ్లాగులో పెట్టుకున్నా, కొన్ని దిన పత్రికలో ప్రచురించబడ్డాయి అని చెప్పుకుని మురిసిపోయాను. అలాగే మావారు నాకు వంటలో సాయం చేయరు. రోజు వంట చేయడం విసుగొస్తుంది అని ఈ మధ్యే సుజాతగారి బ్లాగులో చెప్పాను కదా. నా బాధ చూసో, మిగతా బ్లాగర్ల సానుభూతి చూసో దివినున్న నల భీములకు నా మీద జాలి కలిగిందో ఏమో. నిన్నరాత్రి మావారు చికెన్ తెచ్చి నేనే వండుతా అన్నారు. అంతకన్నా భాగ్యమా అనుకుని సరే చేయండి అన్నా. ఐతే అన్ని రెడీగా పెట్టు వస్తున్నా అన్నారు. హమ్మా! అన్ని రెడీ చేస్తే నేనూ చేయగలను . అన్నీ చేసుకోండి. కావాలంటే కళ్ళలో నీళ్లు రాకుండా ఉల్లిపాయలు తరిగి పెడతా అన్నా. సరే నాకు రాదా ఏంటి అని రంగంలోకి దిగారు. నిజంగా నాకు ఎంత సంతోషంగా ఉండిందో. పెళ్ళయిన పాతికేళ్ళకి నా ముందు వంట చేస్తుంటే రాదేంటి. ఇంతకూ ముందు రెండు సార్లు పప్పు చేసారు. అది నన్ను తిట్టుకుంటూ (బాగా చేయటంలేదు అని). సరే అన్ని చేసుకుంటూ పసుపు ఇవ్వు, కారం ఇవ్వు అంటే, ఎప్పుడో ఒకసారి వంటింట్లోకి వస్తే ఎలా? ఏవి ఎక్కడున్నాయో తెలిదు. తీసుకోండి అని చూపించా. సరే అని తీసుకుని ఎలాగైతేనేమి చికెన్ కూర వండేసారు. నేను ఏదైనా చెప్పబోతుంటే , నువ్వు ఊరుకో ఇన్నేలయింది నీకు ఏమి రాదు అన్నారు. నాకేం పోయింది అని ఇంచక్కా మల్లెపూలు గుచ్చుకుంటూ ఉన్నాను. చివరలో కుక్కర్ మూత పెట్టమంటే కూడా అది మాత్రం నేనెందుకు మీరే పెట్టుకోండి అన్నా. (ఎలాగు సందు దొరికింది . వంటింట్లో అడుగు పెట్టారు. అలాగే కంటిన్యూ చేయిస్తే నాకే లాభం అని అనుకుని కాస్త వెన్న రాయడం మొదలుపెట్టా) ఇన్నేళ్ళకు నా ముందు మీరు వంట చేసి చూపెట్టారు. అలాగే పిల్లలను పట్టుకుని ప్రతి ఆదివారం చేయొచ్చుగా అన్నా. ఏమిటి ఆదివారం సెలవు సినిమా చూసి అడుగుతున్నావా అంటే కాదు మిగతా పనులు నేను చేసుకుంటా. వంట పని ఒక్కటి మీ ముగ్గురు కలిసి చేయండి, నేను ఎలాగున్నా నోరు మూసుకుని తినేస్తా అని చెప్పా. ఓయస్ ! అలాగే మా అబ్బాయికి కూడా వంట నేర్పిస్తా అన్నారు. వాడికి అసలే బద్ధకం. చూద్దాం. ఆ పని చేయండి అని ఊరుకున్నా. ఇక మెల్లిగా ప్రతి ఆదివారం నలభీముల్ని నిద్ర లేపాలి. ఎన్ని రోజులు చేస్తారో చూడాలి. మాటలకైతే కోటలు దాటుతాయి. ఏదైతేనేమి రుచి అదిరింది అనుకోండి.. నేను చేసిన ఒకే పని ఏంటంటే పైన కాస్త కొత్తిమిర చల్లి వడ్డించడం..

ఆయన ఇచ్చిన సలహా.. నేను చేసిన చికెన్ కూర ఫోటో తీసి నీ బ్లాగులో పెట్టుకో . మిగతావారు నేర్చుకుంటారు అన్నారు. అసలు ఈ ప్రయోగానికి కారణం తెలుసా?? ఈ మధ్య నేను శ్రద్ద పెట్టి వండడంలేదు. చెప్పి చెప్పి విసిగిపోయారు. లాభం లేదని తనే రంగంలోకి దిగారు. ఆయన వంట చేస్తున్నంత సేపు తెరేస, వరూధిని గార్లను గుర్తు చేసుకున్నా. కాని అలాంటి అవసరం లేకుండా కిచెన్ కౌంటర్ , గోడలు నీట్ గానే ఉన్నాయి.

మావారు వంట చేయలేదని కంప్లెయింట్ చేసిన దాన్ని , ఆయన చేసింది కూడా చెప్పాలి కదా.

10 వ్యాఖ్యలు:

Purnima

so... baagaa vandaka pOvataM minchina brahmaastram ledani maro saari rujuvayyindi maata. ;-)

baagu baagu.. mahaa baagu.

durgeswara

akkaa ii vayassulO aarOgyam paaDuchEsukOvaDam amta avasaramaa !

durgeswara

akkayya gaaroo ! miiru ii vayassulO aarOgyamtO prayOgaalu chEstunnaarEmO kaasta aalOchimchamDi.

Kathi Mahesh Kumar

మొత్తానికి సాధించారన్న మాట! మంచిది. ఇంకా చాలామంది దిన్ని ఆదర్శంగా తీసుకుంటారన్నమాట...పాపం మొగాళ్ళు...ముఖ్యంగా మొగుళ్ళు.

Bolloju Baba

ఈ టపా మా ఆవిడ కంట పడకుండా, "hidden" గా అయిపోవటానికి శ్రీధర్ గారితో కానీ, ప్రవీణ్ గారితో కానీ అర్జంటుగా డిస్కషను చేయాలి. సరదాగా.

బాగుందండి మీ టపా
బొల్లోజు బాబా

కొత్త పాళీ

అభినందనలు!
మరి నలభీమపాకమా, మజాకానా? రుచిగా కుదరకపోడానికి ఆ కోడికెన్ని గుండెలు? :-)

సుజాత వేల్పూరి

సో, అదీ రహస్యం! మనం శ్రద్ధగా వండటం మానేస్తే పుర జనుల టాలెంట్లన్నీ బయట పడతాయన్నమాట!

E.V.Lakshmi

your blog is good.

vino

JYOTHI AKKAYYA,
Meeru chala baga rastharu.Meru cheppe sangathulu chala bagunnai.Naku mee blog choosthe
rayalane korika modalayindi.Naku sahayam cheyyagalara...........
mee mail kosam yeduru choosthu...........


Chelli
VINODINI

జ్యోతి

వినోదిని,
బ్లాగు ఎలా రాయాలి వగైరా వివరాలన్నీ బ్లాగ్ గురువులో ఉన్నాయి చూడు. సులువుగా అర్ధమవుతుంది..

http://telugublogtutorials.blogspot.com

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008