Wednesday 2 July 2008

పుణుకులు




ఒకరోజు లింగం మావ లైబ్రరీకి వెళ్లి..

"ఏమిటి సార్ ఇది. వారం రోజుల క్రింద నేను తీసికెళ్ళిన పుస్తకం ఎంత చదివినా పూర్తి కాదు, కథ అర్ధం కాదు. అందులో వేళ , లక్షల పాత్రలు. పైగా విచిత్రం ఏంటంటే అందులో ప్రతి పాత్ర పక్కన ఒక ఫోన్ నంబర్. అలా ఎందుకున్నట్టు. కాస్త చెప్తారు?"

"దేవుడా !! వారం రోజుల నుండి టెలిఫోన్ డైరెక్టరీ కనపడక చస్తున్నా.. నువ్వు తీసికెళ్ళావా తండ్రీ?"

.................................................................................................................................................

ఒక వ్యక్తి హత్య చేసినందుకు మరణ శిక్ష పడింది. అతడిని విద్యుత్ కుర్చీలో కూర్చోబెట్టి శిక్ష వేయాలని తీర్పు ఇచ్చారు.

ఆ రోజు రానే వచ్చింది. ఖైదీని మరణ శిక్ష కోసం తయారు చేసారు.

కరెంట్ స్విచ్చివేసేముందు

"నీ చివరి కోరిక ఏదైనా ఉందా?"
" తీరుస్తారా సార్?"
"ప్రయత్నిస్తాము. ఏంటది చెప్పు"
"నాకు చాల భయంగా ఉంది. ధైర్యంగా ఉంటుంది కాస్త నా చేయి పట్టుకోండి"
"???????"

......................................................................................................................


డాక్టర్లు ఎప్పుడైనా తమ పేషంట్లని పెళ్లి చేసుకోవడం చూస్తుంటాము. కాని ఒక డాక్టర్ తన పేషంటు ఎంత నచ్చినా కూడా పెళ్లి చేసుకోలేడు. .. ఎందుకలాగా??


మనకు తెలిసి సంగీతంలో ఎన్నో రాగాలు ఉన్నాయి. శంకరాభరణం, మోహన ఇలా... కాని నీటిలో నుండి వచ్చే ఒక రాగం .. ఏంటది??

క్లూ ఇవ్వనా?? ... స రి గ మ ప ద ని...

20 వ్యాఖ్యలు:

Naveen Garla

>> డాక్టర్లు ఎప్పుడైనా తమ పేషంట్లని పెళ్లి చేసుకోవడం చూస్తుంటాము. కాని ఒక డాక్టర్ తన పేషంటు ఎంత నచ్చినా కూడా పెళ్లి చేసుకోలేడు. .. ఎందుకలాగా??

పేషంటు మగాడు కాబట్టి

( http://gsnaveen.wordpress.com )

Kathi Mahesh Kumar

మీ పుణుకులూ, హాస్యపు గుళికలూ బాగున్నాయ్!

జ్యోతి

నవీన్...
నువ్వు చెప్పింది తప్పు. ఐనా ఆ సంగతి నాకు తెలీదనుకున్నావా.??

Unknown

:) Good Jokes !

Purnima

baagunnai mee jokes.

Unknown

very nice jokes

Unknown

డాక్టర్/పేషంట్ కి already పెళ్ళైపోయి ఉండొచ్చు.

Anonymous

:)

Raj

అతను పశువుల డాక్టరు కాబట్టి

Purnima

patient chani poyi undacchu... anduke pelli cheulokedu.

జ్యోతి

పశువుల డాక్టరు మాత్రమే తన పేషంటును పెళ్ళి చేసుకోలేడు..

మరి రెండో ప్రశ్న ఆలోచించండి.. నీటినుండి వచ్చే రాగం. క్లూ జాగ్రత్తగా చూడండి.

Kottapali

కూని రాగం (బాత్రూం సింగింగ్)

teresa

saraagam!

జ్యోతి

కాదండి .. కాస్త డిఫరెంట్ గా ,నేనిచ్చిన క్లూ కాస్త గట్టిగా పాడుకోండి .. టక్కున ఏం గుర్తొస్తుంది???

స రి గ మ ప ద ని సా...

ఏదైనా పాట ఉందా ఇలా???

శాంతి

జ్యోతి గారు, మీరు ఇప్పటికే మాకు బోలెడు Fevicol tube లు బాకీ ఉన్నారు. ఎందుకంటే, ఇప్పటికే మీ "నీటిలో నుండి వచ్చే రాగం" ప్రశ్న కి సమాధానం ఆలోచించలేక మా బుర్రలు చాలా వక్కలు అయింది కాబట్టి.

జ్యోతి

ఇంత దగ్గరాగా క్లూ ఇచ్చినా కనుక్కోలేకుంటే ఎలా ??

స రి గ మ ప ద ని స ... కరో కరో జర జల్ సా జల్ అంటే నీరు..

hmmm.... అందుకే చెప్పా కాస్త డిఫరెంట్‍గా ఆలోచించండి అని. నేను ఏది తిన్నగా ఇవ్వను కదా!!

శాంతి

హయ్యో.. నేను మరీ సంగీతపరంగా ఆలోచించేస్తున్నాను. అందుకే రాలేదు. అసలూ.. మీరు "ఈ మధ్యే వచ్చిన సినిమా పాట 'సరిగమపదనిస' అని మొదలు అవుతుంది" అని చెప్పేస్తే.. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పెయ్యగలిగిన ఘనత నేను తీసేసుకుందును కదా.. ఎంత మంచి చాన్స్ పోగొట్టారండీ జ్యోతి గారూ!! అయితే, దీనివల్ల ఒక విషయం అర్ధం అయింది.. నా బుర్ర కి తుప్పు పారతో గోకి తీయాల్సిన రేంజ్ లో పట్టింది అని. మంచి క్విజ్ పెట్టారు.

Naveen Garla

కెవ్..కెవ్..కెవ్..కెవ్వో కెవ్వు..............

డిఫరెంటంటే...మరీ ఇంత డిఫరెంటా :O
ఇది ఏనుగు..చీమ ఫజిల్స్ కన్నా డిఫరెంటుగా ఉంది :)

hmm చేసేదేముంది...వచ్చే సారికి ఫుల్లుగా డిఫరెంటుగా ఆలోచిద్దాం....

( http://gsnaveen.wordpress.com )

సుజాత వేల్పూరి

జ్యోతిగారు,
ఇంత గట్టి పజిలా మా బుల్లి బుర్రలకి? నేనింకా, మేఘ మల్ హారు, అమృతవర్షిణి,ముఖారి(ఇదీ నీళ్ళు తెప్పిస్తుంది..కళ్లలోంచి)ఇవన్నీ ఆలోచిస్తున్నాను సుమా!

Kottapali

LOL @ శాంతి, నవీన్, సుజాత
జల్ సా లో జల్ ఆ? జల్ అంటే నీరా? వామ్మో ...

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008