Monday, 28 July 2008

బ్లాగర్ల ఫ్రెషర్స్ డే ...

ముందు అనుకున్నట్టుగానే కూడలి కబుర్లలో ఫ్రెషర్స్ డే ఘనగా జరిగింది. దాదాపు అందరు కొత్త బ్లాగర్లు వచ్చారు. ర్యాగింగ్, పరిచయాలు. సందేహాలు, చర్చలు ఎంతో ఉల్లాసంగా ,ఉత్సాహంగా జరిగాయి. నిజంగా ఒక కాలేజిలో ఇలాగే జరుగుతుంది అన్నట్టుగా ఫీల్ అయ్యారు అందరూ. ఇప్పటినుండి సీనియర్లు, జూనియర్లు అన్న బేధాలు లేకుండా అందరం బ్లాగర్లమే అన్నట్టుగా ఉండాలి అని డిసైడ్ అయ్యారు అందరూ. అనూహ్యంగా ఈ సమావేశం సాయంత్రం ఆరు గంటలకు మొదలై రాత్రి పన్నెండింటి వరకు జరిగింది. అల్ హ్యాపీస్. అందరూ ఇలా ప్రతి నాలుగో ఆదివారం కూడలి కబుర్లలో కలిసి కష్ట సుఖాలు చెప్పుకోవాలి . ఇన్ని గంటలు జరిగిన సమావేశ నివేదిక రాయాలని ప్రయత్నించాను. కాని నా చిన్ని బుర్ర అందుకు అంగీకరించలేదు. అందుకే అటువంటి దుస్సాహసం చేయకుండా మొత్తం ముచ్చట్లను (పనికిరానివి తుడిచేసి) ఇలా పుస్తక రూపంలో ఇస్తున్నాను. తీరిగ్గా చదువుకోండి.

ఇక నిన్న వచ్చిన బ్లాగర్లు. (వారి బ్లాగులు మాత్రం నేను వెతికి లంకెలు పెట్టలేను బాబోయ్, ఈ విషయంలో నన్ను వదిలేయండి. పుణ్యముంటుంది).

యడవల్లి శర్మ
గిరీష్
చదువరి
ప్రతాప్
ఒరెమునా
సాలభంజికలు
దిలీప్
బ్రాహ్మి
నాగమురళి
మురళీధర్
సరస్వతి కుమార్
మీనాక్షి
ఫ్రెషర్ (?)
మహేష్
శివ
జ్యోతి
పూర్ణిమ
వేణు శ్రీకాంత్
ఎస్.పి .జగదీశ్
వికటకవి
ప్రదీప్ మాకినేని
ప్రవీణ్
ప్రసాద్
సాయిచరణ్
నల్లమోతు శ్రీధర్
డా.రామ్స్
రాకేశ్
రానారె
వరోధిని
మోహన
రాజేంద్ర
సిబిరావు
శ్రీకాంత్
.....




Read this document on Scribd: freshers day1

7 వ్యాఖ్యలు:

Purnima

బహు బాగు జ్యోతిగారు.. ఇంత "లావు" మీటింగ్ కి మినిట్సా అనుకున్నా... మీది చిట్టి బుర్ర కాదు.. మహా గట్టి బుర్ర!!

Anonymous

నాకు ఈ ర్యాంగుంగు కాన్సెప్టూ నచ్చాలా, దాని ఫ్రెషెర్స్ కాన్సెప్టూ నచ్చలా.
ఇంత మంది పాల్గొన్నారంటే నా అభిప్రాయం నచ్చని వాళ్ళు ఇంత మందున్నారన్నమాట బ్లాగుల్లో.

నేనింక జై హింద్.

-- విహారి

సుజాత వేల్పూరి

జ్యోతి గారు,
నేను మిస్సయిపోయానండి! నేనూ ఫ్రెషర్ నేగా,!ఈ సారి చూద్దాం! ఇంతమంది ఒక్క సారి కబుర్ల గదిలో చేరారా అయితే! బాగా ఎంజాయ్ చేసుంటారు కదా!

Saraswathi Kumar

@ విహారి గారు,

మీరీ విషయాన్ని లైట్ తీసుకోండి.చివరికి మంచే జరిగింది కదా!మీరెప్పటిలా మీ లింగం బాసు కబుర్లతో బ్లాగ్లోకాన్ని అలరించండి.

మీరు నా బ్లాగులో మీ కామెంట్‌ను తొలగించకుండా ఉండవలసినది.మీరు మంచి సూచనే చేసారు.కానీ ఆ డైలమా నాలో అప్పటికే ముగిసినది.అందుకే మీ సూచనను నేను పాటించలేదు.మీరు ఫీల్ అయినట్లున్నారు.

ఆనంద్ గారికి కూడా ఆ టపా కామెంట్లలో వివరణ ఇచ్చాను.

హర్షోల్లాసం

మేడం నేను ఈ బ్లొగ్ల్ లోకానికి కోత్తే నండి
మరి నన్ను పిలవలేదే.అంటె ఇలా ఎంతమందిని వదిలీసారుఉఉఉఉఉఉఉఉఉఉఉఉఉ
:(.ఈ సారికి నెను పాత ఐపోతాగాగాగా:)

Anonymous

@ సరస్వతి కుమార్ గారు,

నేను తీసుకునే వన్నీ లైటే.

మీ బ్లాగు లో నా కామెంటు ను తొలగించడానికి కారణం.అది టైమ్‌ సెన్సిటివ్ అని. నేను చెప్పాల్సింది నేను చెప్పాను. మీకు నచ్చింది మీరు చేశారు. అది మీ ఇష్టం. ఇక్కడ నేను ఫీల్ అయ్యే సీను లేదు. మీరు చెప్పాల్సిన అవసరం లేదు నేను వినాల్సిన పనీ లేదు.


-- విహారి

Saraswathi Kumar

@ జ్యోతి గారు,

మీదే అసలైన రిపోర్ట్.నా రిపోర్ట్ దీనికి సపోర్ట్.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008