Friday, 22 August 2008

మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు???

 

ఈ ప్రపంచంలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు?? ఒక్కసారి ఆలొచించి చెప్పండి. మీ భార్యా/భర్త, స్నేహితుడు/రాలు, పిల్లలు,గురువు .. కాని మీకు చాలా క్లోజ్‍గా ఉండే స్నేహితులతో మీ ఆలోచనలు, అనుభూతులు,సందేహాలు, సమస్యలు అన్నీ చర్చిస్తారా? మీ జీవితంలోని ప్రతి అంశం వారితో పంచుకుంటారా? ఇది సాధ్యం కాదేమో???.

మన జీవన ప్రయాణంలో ఎంతోమంది కలుస్తూ ఉండొచ్చు. అందులో కొందరు స్నేహితులైనా, జీవితభాగస్వాములైనా, ఎవరైనా కొందరితో మీరు చాలా క్లోజ్‍గా ఉండి, ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉండొచ్చు. కాని ఆ వ్యక్తిని మీరు పూర్తిగా నమ్మి, మీకు సంబంధించిన అన్ని విషయాలు, ఆలోచనలు చెప్తారా? ఆ వ్యక్తి ఎల్లవేళలా మీ తోడుగా ఉంటాడా?? లేదా మనుష్యులకంటే మిన్నగా మీరు ఆ భగవంతుని నమ్ముతున్నారా? ఆ సర్వాంతర్యామి అన్నీ తెలుసుకుని మీ తోడుగా ఉంటాడా? అలాంటి బెస్ట్ ఫ్రెండ్ మీకున్నాడా? ఒక్కసారి దీర్ఘంగా ఆలోచించండి. అందరికంటే ఎక్కువగా మిమల్ని ప్రేమించే, మీకు తోడుగా ఉండే మీ స్నేహితుడు ఎవరో కాదు అది మీరే.. అవును. మీకు మీరే గొప్ప స్నేహితులు. మిమ్మల్ని మీరు అభిమానించండి. గౌరవించుకోండి. మీ విలువ తెలుసుకోండి. ఎవరో కోన్ కిస్కాగాళ్ళు మిమ్మల్ని గౌరవించాల్సిన పనిలేదు. అవసరం కూడా లేదు.

ఎప్పుడు కూడా మనను మనం తక్కువ చేసుకోవద్దు. మనలో ఉన్న టాలెంట్‍ని గుర్తించాలి. మనకు ఏది ఇష్టం. ఏది మనకు సంతృప్తినిస్తుంది. అది ఖరీదైనదే కానక్కరలేదు. ఒక మధురమైన సంగీతమో, ఒక మంచిపుస్తకమో, లేదా ప్రకృతి సౌందర్యమో, లేదా ఆర్తులకు సహాయం చేయడమో. మన దైనందిన కార్యక్రమాలలో పడి , మన గురించి మర్చిపోతాము. చదువు, ఉద్యోగం, సంసారం, పిల్లలు, వాళ్ల అవసరాలు. ఇలా ఎన్నో పనులు చేయడంలో మనకేం కావాలో అస్సలు గుర్తుండదు. క్రమంగా ఒక మరమనిషిలా మారిపోతుంటాము. కొన్నాళ్లకు మనలో ఆనందించే గుణమే కనపడకుండా పోతుందేమో. అప్పుడు జీవితం కూడా భారమవుతుంది.

అందుకే మీ కార్యక్రమాలతో పాటు మీకోసంకూడా ఆలోచించండి. మిమ్మల్ని మీరు సంతృప్తి పరచుకుంటు ఇతరులను ఆనందపరచండి. అప్పుడు జీవితం ఎంతో ఉల్లాసంగా కనిపిస్తుంది.ఆ ప్రయాణంలో అలసట అన్నదే అనిపించదు. పైగా ఉత్సాహం పెరుగుతుంది..


ఇది నేను స్వానుభవంగా తెలుసుకున్న నిజం.

18 వ్యాఖ్యలు:

Kathi Mahesh Kumar

నిజమే,Jab We Met సినిమాలో కరీనా కపూర్ పాత్ర " I am my favourite person" అంటుంది. అలా ఉంటేనే సరి. We need to pamper ownself to be happy.

నిషిగంధ

VERY well said!!

cbrao

Don't Compare yourself with anyone in this world! If you do you are insulting yourself!

Purnima

Just by reading the title, the answer was ME!! After reading your posts, it is a lil strengthened me!! :-)

Unknown

చిత్రంగా మీరు స్నేహితుల గురించి అడిగిన ప్రశ్నలకి నా సమాధానం అవును. నాకు అలాంటి స్నేహితులు ఉన్నారు :-)

అయినా సరే మీరు చెప్పిన విషయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. మన గురించి మనమే ఆలోచించుకోవాలి. మన ఇష్టాలేమిటో గుర్తించి మనకోసం కూడా మనం పనిచేసుకోవాలి.

సుజాత వేల్పూరి

బాగా చెప్పారు జ్యోతి గారు! మనకు మనమే బెస్ట్ ఫ్రెండ్. మన తర్వాతే ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా!

Construction Management

hi mommy.............!!!

maa godavari

జ్యోతి గారు
మనల్ని మనం ప్రేమించుకున్నపుడే ఎదుటివారిని ప్రేమించగలుగుతాము.మనల్ని మనం గౌరవించుకున్నపుడే తోటివారిని గౌరవించగలుగుతాం.ఇంక మీ ప్రశ్న మీ జీవితం లోని అన్ని అంశాలను వారితో పంచుకుంటారా?అని.
ఎస్.నాకు అలాంటి నేస్తాలున్నారు.నా కోసం వాళ్ళు, వాళ్ళ కోసం నేను అన్నింటిని పంచుకునే ఆత్మీయత మా మధ్య అల్లుకుని వుంది. అలాంటి ఒక ప్రియ సఖి కోసం రాసిన కవిత ఇది.సంవత్సరాలు గడిచినా మా స్నేహం అప్పుడే విరిసిన బ్రహ్మకమలమంత స్వచ్చంగా,తాజాగా పరిమళాలు వెదజల్లుతూ ఉంటుంది.

నీ స్నేహం

ఆత్మీయతలో ముంచి తీసినట్టుగ వుంటుంది
కనుచూపుమేరంతా
పరుచుకున్న పచ్చదనంలా వుంటుంది
గుండెకి సంబంధించిన
సుతిమెత్తని సవ్వడి లా వుంటుంది
భుజమ్మీద వాలిన
వెచ్చని స్పర్శలా వుంటుంది
గాయాలు కన్నీళై ప్రవహించేవేళ
చల్లని ఓదార్పులా వుంటుంది
నిస్సారంగా గడిచిపోయే మధ్యాహ్న్నపు వేళ
ముంగిట వాలే ఉత్తరంలా వుంటుంది
ఏకాంతపు సాయంత్రాల్ని
ఇసుకతిన్నెల మీదికి నడిపించే
సమ్మోహన శక్తిలా వుంటుంది
దిగులు మేఘాలు కమ్ముకున్నపుడు
చెప్పలేని చింతలేవో చీకాకుపెట్టేటప్పుడు
పెదవి మీద మొలిచే చిరునవ్వులా వుంటుంది
నీతో స్నేహం.......
అపూర్వం, అపురూపం
అది నా అంతరంగానికి, ఆత్మకి సంబంధించింది

జ్యోతి

ప్రవీణ్, సత్యవతిగారు,
నిజంగా అలాంటి స్నేహితులు ఉండడం మీ అదృష్టం.కాస్త మీ స్నేహితుల గురించి బ్లాగండీ. మేము చదివి కుళ్ళుకుంటాము( ఆనందిస్తాము)

కొత్త పాళీ

మంచి ఆలోచనలు.

saisahithi

నాకూ ఓ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు.
వాడె ప్పుడూ నా ఆనందమ్లోనూ, విషాదంలోను నాతోనే ఉంటాడు. సలహాకైనా,సహాయానికైనా ముందుంటాడు...
వాడెవడో కాదు...నేనే..

saisahithi

I also have a friend..
He will be with me in deep distress and high delight...
He will be first in help or advice...
He never leaves me...
an inseparable companion..will be with me in all ways always...
IT'S ME..

HARSHAVARDHAN.THATI

true friendship never dies a fiend in need is a friend in deed

HARSHAVARDHAN.THATI

sneham kosam pranamivvadam anta kastamemi kaadu kani antati tyagam chese snehiudini pondatam katam

Unknown

good

Unknown

good

author_number_2

అదిరింది. మన గురించి మన కన్నా వేరే వాళ్ళకి తెలిసే అవకాశం తక్కువ. బాగా రాసారండి.

mohanjoy2000

chala manchi msg ...

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008