పుణుకులు
రామారావు పేపర్ చదువుతూ కూర్చున్నాడు. అంతలో అతని బామ్మర్ది వచ్చి " బావా! బోర్ కొడుతుంది ఒక జోక్ చెప్పవా "
"సరే! సన్నగా , పొడుగ్గా, ఎర్రగా ఉంది . ఏందది?"
" ఏమో . నువ్వే చెప్పు"
"ఎర్రదారం"
"సన్నగా, నల్లగా ఉంది అదేమిటి?"
"ఏమో. నాకేం తెలుసు?"
" దాని నీడ."
" సరే .ఇంకోటి.. సన్నగా, పొడుగ్గా , తెల్లగా ఉంది .ఏమై ఉంటుంది. కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. అందాక నేను ఈ పేపర్ చదివేస్తాను"
" సరే . నేను ప్రయత్నిస్తాను."
గంటతర్వాత...
"బావా! నాకు రావట్లేదు కాని . నువ్వే చెప్పు."
" ఏం లేదోయ్! అది దాని ఆత్మ." అంటు లేచి వెళ్ళిపోయాడు బుర్ర గోక్కుంటున్న బామ్మర్దిని వదిలేసి.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
మనం పళ్ళ రసాలను గ్లాసుతో కాని స్ట్రాతో కాని తాగుతాం . అది అందరికీ తెలుసు. కాని గుడ్డును కూడా స్ట్రాతో తాగితే ఏమవుతుంది??
ఈ రోజుల్లో అందరి ఇంట్లో cd లు ఉంటాయి. కాని ఒక ప్రత్యేకమైన cd ఉంది. చాలా విలువైనది. కాని దాదాపు అందరి దగ్గరా ఉండే చాన్స్ ఉంది. ఏంటా స్పెషల్ cd ???
9 వ్యాఖ్యలు:
pasidi? correctena ?
EggStraw
తెలుగు’వాడి’ని గారు,
కాదండి. కాస్త తికమకగా ఆలోచించండి..
నేను ఈ పుణుకులకు ఆశపడం మానేసాను.వినోదం చూస్తూ కూర్చుంటాను...కానీయండి. :)
teliyatam ledu
bolloju baba
తెలుగులో రెండు మూడు సార్లు EggStraw అనుకుంటే ... మిగతా వారికి కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది కదా అని అలా వ్రాసాను .. అసలు సమాధానం : ఎగస్ట్రా (ఎగ్-స్ట్రా .. EggStraw) :-)
bssvunnayi. nenu samadhaanaala kosam eduru choodatame...
FANTASTIC..
సబ్ సీ డీ అయ్యుండొచ్చు
Post a Comment