అంతులేని వింతకథ...
ఈ రోజుల్లో వస్తున్న అన్ని టీవీ సీరియళ్ళతో విసిగి వేసారి రాసిన ఈ వింతకథ.. మిమ్మల్ని విసిగిస్తున్న మీ స్నేహితులకైనా, బాస్‍కైనా పంపండి. చాలా కాలం క్రింద పొద్దులో ప్రచురితమైంది. మరొకసారి పునర్ముద్రితం కొత్త మిత్రుల కోసం.. నాకోసం కూడా...:)
ఈ కథ మొత్తం చదివి చివరలో అడిగిన ప్రశ్నకు జవాబివ్వగలరేమో ప్రయత్నించండి….
1975 జనవరి 1
ఉదయం ఐదు గంటలైంది. ఇంకా సూర్యుడు నిద్ర లేవలేదు. చీకటిగానే ఉంది.అది బాపూ అనాథాశ్రమం. దాని నిర్వాహకుడు ప్రకాశం అప్పుడే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆ అనాథాశ్రమాన్ని ప్రారంభించి చాలా ఏళ్ళయింది. దానికి ప్రకాశమే వ్యవస్థాపక నిర్వాహకుడు. ఇంతలో బయటనుండి కలకలం వినిపించింది. ప్రకాశం ఏంటా అని బయటకెళ్ళి చూసాడు.
అనాథాశ్రమం మెట్లపైన చీరలో చుట్టిన ఒక పసిపాప. ఆడపిల్ల. అంతటి చలిలో రోజుల పాపను అలా వదిలేసి వెళ్ళిన వాళ్ళపై ప్రకాశంకు చాలా కోపం వచ్చింది. ముద్దులొలికే ఆ పసిపాపను తానే పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు.
17 ఏళ్ళ తరవాత..
ఆ పసిపాప (పద్మ) పెరిగి పెద్దదై ఇప్పుడు హాస్టల్లో ఉండి చదువుకుంటోంది. పద్మ వాళ్ళ క్లాస్‍మేట్ ఒకతనిని ప్రేమించింది. ఇద్దరొకటై గర్భవతైంది. అది తెలిసి హాస్టల్ నుండి గెంటేసారు. ప్రకాశం అది తెలుసుకుని వచ్చి పద్మను తిరిగి అనాథాశ్రమానికి తీసికెళ్తాడు. ఆమె ఒక ఆడపిల్లకు జన్మనిస్తుంది, కాని ఆ పాపను ఎవరో ఎత్తుకెళ్తారు. అది విని తట్టుకోలేక ప్రకాశం ఆత్మహత్య చేసుకుంటాడు.
ప్రసవ సమయంలో కలిగిన కొన్ని ఆరోగ్య సమస్యలవల్ల పద్మ డాక్టరును కలిసింది. అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఆ డాక్టరు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు: ఆమెకు Adrenalo Sytosis అని, ఇది ఒక సీరియస్ జబ్బు .. దీనివల్ల శరీరంలో హార్మోనుల అవకతవకలు జరుగుతాయి. ఆపరేషన్ చేయాలి అని. కొద్ది రోజుల తర్వాత పద్మకు ఆపరేషన్ జరిగింది. ఆ ఆపరేషన్ ఫలితంగా ఆమె మగవాడిగా (ప్రభు) మారిపోయింది.
ప్రభు చాలా బాధపడుతూ ఉండేవాడు, తన కన్నబిడ్డను పోగొట్టుకున్నందుకు, తనను పెంచిన ప్రకాశంగారు చనిపోయినందుకు, తన ప్రేమికుడు మోసగించినందుకు, మగవాడిగా మారవలసి వచ్చినందుకు… ఇది తలుచుకుంటూ తాగుడుకు అలవాటు పడ్డాడు.
ఒకరోజు ప్రభు తమ కాలనీలో ఒక కొత్త బార్ తెరవడం చూసాడు. దాని పేరు “అమృతా బార్”. లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మనిషి కనపడ్డాడు. ఆ వ్యక్తి ప్రభును పిలిచి తాను కనుగొన్న “టైం మెషీన్” చూపించాడు. ప్రభు ఆ వ్యక్తిని బ్రతిమిలాడి అది ఇంటికి తెచ్చుకుని తాను గతం లోకి వెళ్ళాడు. 1992 సంవత్సరంలోకి….
1992 సంవత్సరం…
ప్రభు తన టైం మెషీన్తో పాటు 1992 సంవత్సరంలోకి అడుగెడతాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయిని చూస్తాడు( అదే మగవాడిగా మారక ముందు ఉన్న అమ్మాయి). ఆమెని ప్రేమించి, కలిసి తిరిగి, ఒకానొక గడియలో ఒకటవుతారు. ఆ అమ్మాయి గర్భవతైంది. ప్రభు ఆమెను పెళ్ళాడటానికి నిరాకరించి, ఆ ఊరినే వదిలి వెళ్ళి పోతాడు. అలా ఇంకో ఊరికెళ్ళి కొంత డబ్బు సంపాదించి తిరిగి తను ప్రేమించిన అమ్మాయి ఉన్న ఊరికొస్తాడు.
కాని తనను గుర్తుపట్టకుండా ఉండాలని బారెడు గడ్డం పెంచుకుంటాడు.ఒక బార్ మొదలెడతాడు. “అమృతా బార్ “అని. ఒక రోజు అతను బార్లో కూర్చుని ఉండగా ఒక వ్యక్తి వస్తాడు( అదే వ్యక్తి ఇంతకు ముందు అమ్మాయిగా ఉన్నవాడు). గడ్డపు వ్యక్తి తన దగ్గరున్న టైమ్ మెషిన్ను ఆ వ్యక్తికి ఇస్తాడు. ఆ వ్యక్తి దాని సాయంతో గతంలోకి వెళ్ళిపోతాడు. ఇంతలో ఒక ముసుగు దొంగ వచ్చి కత్తి చూపించి ఆ టైమ్ మెషిన్ తన దగ్గర్నుంచి లాక్కుని ఆ గడ్డపు వ్యక్తిని తీసుకుని గతంలోకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళాక ఆ ముసుగు దొంగ ఆ మెషిన్ తిరిగిచ్చేసి గడ్డపు వ్యక్తిని వదిలేసి వెళ్ళిపోతాడు.
గడ్డపు వ్యక్తి అలా అలా తిరుగుతూ బాపూ అనాథాశ్రమానికి వస్తాడు. లోపలికెళ్ళి చూస్తే అక్కడొక అమ్మాయి (తర్వాత అబ్బాయిగా మారిన అమ్మాయే), పక్కన అప్పుడే పుట్టిన ఆడపిల్లను చూస్తాడు. ఆ పసిగుడ్డును తీసుకుని టైమ్ మెషిన్ మొదలెట్టి ఆ పాపతో సహా గతం (1975) లోకి వెళతాడు.
1975 జనవరి 1
ఉదయం సుమారు నాలుగున్నర అయింది. గడ్డపు వ్యక్తి ఆడపిల్లతో బాపూ అనాథాశ్రమానికి వస్తాడు. ఆ పాపను ఆశ్రమ గుమ్మంలో వదిలి వెళ్ళిపోతాడు. కాలేజీలో చేరి బాగా కష్టపడి చదివి డాక్టరవుతాడు. ఒక రోజు ఒక స్త్రీ అతని ఆసుపత్రికి వస్తుంది. ఆమెను పరీక్షించి, ఆమెకు Adrenalo Sytosis అనే ప్రమాదకరమైన జబ్బు ఉన్నట్టు కనుగొని ఆపరేషన్ చేసి ఆ స్త్రీని మగవాడుగా మారుస్తాడు. ఆ తర్వాత టైమ్ మెషిన్ సహాయంతో గతంలోకి వెళతాడు. ఆప్పుడు అతను జనాలు పడుతున్న కష్టాలు చూసి మనసు ద్రవించి ఒక అనాథాశ్రమాన్ని ప్రారంభిస్తాడు. దానికి బాపూ అనాథాశ్రమం అనే పేరు పెట్టి అనాథ పిల్లలకు ఆసరా ఇస్తాడు.
ఒక రోజు అతని ఆశ్రమం ముందు ఎవరో ఒక పసికందును వదిలి వెళతారు. అతను ఆ బిడ్డను తన కన్న బిడ్డలా పెంచి పెద్ద చేస్తాడు. ఆ పాప పెరిగి పెద్దదై చదువుకుంటూ ఒక హాస్టల్లో ఉంటుంది. ఒకరోజు అతనికి ఒక విషయం తెలుస్తుంది: ఆ ఆడపిల్ల ఒక వ్యక్తి వల్ల మోసపోయి గర్భవతైందని, హాస్టల్ వాళ్ళు గెంటేసారని. జాలితో ఆ అమ్మాయిని తమ ఆశ్రమానికి తీసుకొస్తాడు. ఆ అమ్మాయి ఒక ఆడపిల్లని కంటుంది.
ఆ వ్యక్తి…అదే ప్రకాశం భవిష్యత్తులోకి వెళ్ళాలని అనుకుంటాడు. ముసుగు ధరించి, ఒక తుపాకి తీసుకుని టైమ్ మెషిన్ తీసుకుని అమృతా బార్ కి వెళతాడు. బార్ లోపలికి వెళ్ళి ఆ గడ్డపు వ్యక్తిని బెదిరించి తనతో పాటూ గతంలోకి తీసికెళ్తాడు. కాని గతంలోకి వెళ్ళాక పశ్చాత్తాప పడి ఆ గడ్డపు వ్యక్తికి టైమ్ మెషిన్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. అలా తిరిగి మళ్ళీ తన ఆశ్రమానికి వచ్చాక తెలిసిందేమంటే పుట్టిన పసిబిడ్డను ఎవరో ఎత్తుకెళ్ళారని. అది విని తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుంటాడు.
5 వ్యాఖ్యలు:
అసలు కధేది దాని తోకేది. అయ్యో అంతా అర్థమైందే కానీ అర్ధమవ్వలెదండీ...
జ్యోతి గారు - ఇందులో పాత్రధరులందరూ ఒక్కరే!
ఒకసారి చదివేను - అన్నట్టు మీరు ఏక్తా కపూర్ని ఓ మారు కాంటాక్ట్ చెయ్యకూడదూ ? :D
జ్యోతిగారూ,
మొదటిసారి సరదాగా చదవడానికి సరదాగానే ఉంది.తలా తోక లేనట్టుగా,గజిబిజిగా. కానీ రెండవసారి చదివేసరికి మాత్రం కొంచెం పట్టుతప్పిందని తెలుస్తోంది. 1975కి పదిహేడేళ్ళతరువాత 1992 కదా.
పద్మ,ప్రభుగా మారడం,ఇవన్నీ కూడా 1992 కదా.మరి టైం మిషన్ తెచ్చుకొని గతంలోకి అంటే 1992లోకే ఎలా వెళ్ళేడు అని.బహుశ పెద్ద కాలవ్యవథి లేదనుకోవాలా...అసలే పిచ్చెక్కించే కథ కి ఈ పిచ్చి సందేహాలేమిటి అని సందేహపడుతున్నారా...అయినా ఇంత మాత్రం ఆలోచనతో చూస్తే,చదివితే ఆ దిక్కుమాలిన సీరియల్స్ ఎందుకు ఫాలో అవుతారు చెప్పండి, ఎవరైనా...ఇంతకీ కథ ఎవరిదో తెలీలేదు...
mammeeeeeeeeee :(((((
naaku time machine dorikithe ee katha chadivina 2minutes venakki velli, malli raanu waaaaaaaaaaaa :(((((
Aa time machine dorikithe naku..nenu one hour venakki velli ee link forward chesina Gopi ni Champestanu...:)
-Kiran
Post a Comment