Saturday, October 18, 2008

ప్రమదావనంలో ప్రయాణాలు - కబుర్లు.ప్రమదావనం చాట్ రూంలో సాంకేతిక సమస్యలవల్ల చిరాకేసి మహిళా బ్లాగర్లకు ఒక శాశ్వతమైన ఆంతరంగిక గుంపు మొదలుపెట్టడమైనది. అలాగే ప్రమదావనం కోసం వేరే చోట చాట్‌రూం ఏర్పాటు చేసుకోవడమైనది. కాని అందరికి ఒకేసారి కలిసి కబుర్లాడుకోవడం కుదరటంలేదు. దానికి పరిష్కారమే ఈ గుంపు. అందులో సరదా కబుర్లతో పాటు చర్చలు కూడా జరుగుతున్నాయి.

ఎలాగూ అందరూ ఏదో ఒక టపా రాస్తుంటారు కదా. అందరూ కలిసి అప్పుడప్పుడు ఒకే అంశంపై ఎందుకు టపాలు రాయకూడదు అన్న ఆలోచన వచ్చింది. వెంటనే ఆచరణలో పెట్టడం జరిగింది కూడా. "బ్లాగు ప్రయాణంలో నేను" అంటూ దాదాపు పది మంది మహిళ బ్లాగర్‌లు తమదైన శైలిలో టపాలు రాసారు. అది మీకందరికి నచ్చిందని అనుకుంటున్నాము. కాని ఇది చేసింది ఎవ్వరినో మెప్పించడానికి కాదు. ఏదో సాధించడానికి మాత్రం కాదు. ఈ పరపంపర ప్రతినెలా నిర్వహించాలని అనుకుంటున్నాము. ఒకోసారి ఒకో విభిన్నమైన అంశం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది.

బ్లాగు ప్రయాణంలో నేను అన్న శీర్షిక ఎంచుకోవడానికి కారణం.. బ్లాగు మొదలుపెట్టి నెలలు ఐనా, సంవత్సరాలు ఐనా , వందల సంఖ్యలో ఉన్న తెలుగు బ్లాగులలో మహిళా బ్లాగులు పదులలో ఉన్నా కూడా అందరూ తమకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అందుకే ప్రతి ఒక్క మహిళా బ్లాగర్‌ని బ్లాగ్ వయసుతో సంబంధం లేకుండా , అనుభవాలు అనేవి అందరికీ ఒక్కటే అని ఈ అంశంపై రాయమని ప్రోత్సహించడం జరిగింది.

మొదటి ప్రయత్నం దిగ్విజయంగా పూర్తయ్యింది. చదువరులు అందరూ ఓపికగా అన్ని బ్లాగులు తిరిగి, చదివి కామెంటారు. ధన్యవాదములు. ఆ రోజు బ్లాగ్లోకమంతా ఒక Exhibition లా అనిపించింది నాకైతే. రాసిన వారికంటే చదివేవారు తెగ బిజీగా ఉన్నారు. అంతా బిజీ బిజీ.. కాదంటారా?

తమ ప్రయాణవిశేషాలు పంచుకున్న ప్రమదలు..

1. సౌమ్య -

2. జ్ఞానప్రసూన -

3. పి.ఎస్.ఎం. లక్ష్మి -

4. రమణి -

5. జ్యోతి -

6. పూర్ణిమ -

7. వరూధిని -

8. లలిత -

9. లచ్చిమి -

10. క్రాంతి -


ప్రమదావనంలో చేరాలనుకునే కొత్త మహిలా బ్లాగర్లు నాకు మెయిల్ చేయండి.

jyothivalaboju@gmail.com

2 వ్యాఖ్యలు:

రమణి

మీరు చెప్పిన తరువాత కాదు అనగలమా జ్యోతిగారు. తప్పకుండా రాద్దాము.
"ప్రమదల ముకుమ్మడి దాడి " అని ఏదో మాటవరసకన్నారు గాని, చీరల రెప రెపలు, గాజుల గల గలలు అందరికీ ఇష్టమే నండీ. అందుకే అన్నారు ఎంత నేర్చినా, ఎంత చూచినా, ఎంత వారలైనాకాంత (ఇక్కడ బ్లాగు దాసులని మార్చుకోవాలి.) దాసులే, మరి అది బ్లాగులోకంలో కూడా వర్తిస్తుంది కదా. కాకపోతే మనము ఎంచుకొనే విషయాలు కాస్త హాస్యంగా, ఆహ్లాదకరంగా ఉండాలన్నది నా అభిప్రాయం.

రామచంద్రరావు

జ్యొతి గారు మీరు చేసిన ప్రయత్నం బాగుంది కాని మా బ్లాగ్ ను కూడ చూసి కొంచెం కామెంటండి మాకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. నా బ్లాగ్ అడ్రస్
http://www.ragamrrao.blogspot.com/

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008