పుణుకులు
చాలా రోజులైంది. వాతావరణం కూడా చల్లచల్లగా ఉంది. కొన్ని పుణుకులు వే్సుకుందామా?
1. క్రిందివాటికి తెలుగు పదాలు చెప్పండి.
Tirumalesaa -
Hello -
Good afternoon -
2. మనవడు తాతకు ఫోన్ చేసి "తాత! నువ్వు జూనియర్, నేను సీనియర్ " అని అన్నాడు. తాతకూడా "సరేరా! .. ఏం చేస్తాం?"
ఇదెలా సాధ్యం? ఎవరెక్కడెక్కడున్నారు. ఇద్దరూ ఉన్నది ఆంధ్రప్రదేశ్ లోనే..
3. ఇప్పుడు కూరగాయల రేట్లు సెన్సెక్స్ కి వ్యతిరేక దిశలో అకాశంలో ఉన్నాయి. కాని బ్రతకడానికి తినక తప్పదు కదా. అయితే కూరగాయల మార్కెట్టుక వెళ్లేముందు,వెళ్లిన తర్వాత, కొన్న తర్వాత కూడా గుర్తొచ్చే ఒక కూరగాయ ఏంటీ?
4. ఒక కూరగాయ అందరినీ చాలా మర్యాదగా తిడుతుందంట. ఏంటది???
16 వ్యాఖ్యలు:
౨. తాత నియర్-జూ , మనవడు నియర్-సీ కరెక్టేనాండి?
౩. ఉల్లిపాయ.
మిగతావి మీరే చెప్పాలి. లేదూ ఇంకెవరైనా..
www.cinugaadu.blogspot.com
3. టమాటో
4. క్యాబేజీ
ఇట్లు,
మీ సీనుగాడు ఉరఫ్ శ్రీనివాస్
తిరుమలేసా
నమస్కారం
శుభ మధ్యాహ్నం
zoo నియర్, sea నియర్ కరెక్ట్. కాని వాళ్లు ఉండేది ఏ ఊర్లో.
శ్రీనివాస్ గారు, మీ సమాధానలకు వివరణ ఇవ్వండి.
పసిగుడ్డు గారు, నేను సరియైన తెలుగు పదాలు ఇవ్వమన్నా. మీకు తెలీదేమో నేను ఏదీ తిన్నగా చెప్పను. కాస్త డిఫరెంటుగా ఆలోచించాల్సిందే..
tata, manavadu kuda undedi Visakhapatnam lo
maraydapoorvakam ga tittedi: kyabe..jii
vankaya anukuntaa (one kaaya)
telugulo comment elaga rayalo koncham teliyacheyagalaru....
pappu గారు
మీరు చెప్పిన క్యాబేజీ ఒక్కటే కరెక్ట్..
తెలుగులో రాయడానికి .. http://lekhini.org .. ఇక్కడ ప్రయత్నించండి. కాపీ పేస్ట్ చేస్తే సరి..
ధన్యవాదములు
cabbage .. ha ha ha .. good one.
ఇంతకాలానికి నాకు మీ పుణుకుల్లో ఒక్క దానికి నవ్వొచ్చింది :P
కొత్తపాళీగారు,
సంతోషం. మీకు నవ్వు తెప్పించగలిగినందుకు. ఇంతకు ముందు ఒక హైదరాబాదీ జోక్ గుర్తుందా??(ఇంటర్వ్యూ ది)
నేను అసలే పసిగుడ్డు తిన్నగా నడవటమే రాలేదు... :-( ఇంక ఏం చెప్పగలను లేండి?? మీరే చెప్పండి :-(
Tirumalesaa - ti. rumaal. esa...
తీ.. రుమాల్ .. ఏసా...
Hello - hell. o....
నరకమే...
Goodafternoon - gud. after. noon..
గుడ్డు తర్వాత నూనె
అదీ సంగతి...
తాత ఉన్నది హైదరాబాదు జూ దగ్గర. మనవడు ఉన్నది వైజాగ్ బీచ్ దగ్గర..
ఇక మనకు ఎప్పుడు గుర్తుండే కూరగాయ.. క్యారెట్. kyaa rate?? కొనకముందు, కొనేటప్పుడు , కొన్నాక రేట్ అడుగుతామా లేదా??
Dumb and Dumber.
Goodafternoon - gud. after. noon..
గుడ్డు తర్వాత నూనె
noon ante,నూనె??
పుణుకులు చాల బాగున్నాయి
Post a Comment