వీకెండ్ మస్తీ ... ఇది అవసరమా???
వారానికి ఐదు రోజులు హైటేక్ గొడ్డు చాకిరి చేసేవారందరికి , కాలెజీ కుర్రకారుకి వారాంతం అంటే వీకెండ్ పండగలాంటిది. అదేంటో చాలా మంది ఈ వీకెండ్ అంటే ఒక కంపల్సరీ ఎంజాయ్‌మెంట్ అనుకుంటారు.ఈ రెండు రోజులు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తే తరువాతి వారానికి రీచార్జ్ ఐపోతారన్నమాట. కాని ఈ వీకెండ్ సెలవులు హాయిగా గడపాలంటే మార్గాలేంటి. సరదాగా అలా సినిమాకో, షికారుకో, తిరిగిరావడం. ఓకే. కాని ఇప్పుడు శనివారం రాగానే ప్రతి పబ్బులలో వీకెండ్ పార్టీలని ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. అది చాలా మంది యువతీ, యువకులకు తప్పనిసరి ఐపోయింది. అంటే వీళ్లకు ఆ పబ్బువాడు ఖరీదైన వినోదాన్ని ఆనందాన్ని ఇస్తున్నాడన్నమాట. (వాడి లాభం చూసుకునే) ఇక్కడికి వచ్చేవాళ్లు ఎక్కువగా పద్దెనిమిది నుండి పాతికేళ్లవారే ఉంటారు (నేను ఎన్నో టివి ప్రోగ్రాములలో చూసాను) ఇందులో వీరు చేసేది ఏంటంటే అమ్మాయిలు చాలీ చాలని బట్టలు (అదేమంటే లేటెస్ట్ ఫ్యాషన్) , అబ్బాయిలు నిండుగానే వేసుకుని, తాగుతూ పిచ్చెత్తినట్టుగా డాన్సులు చేయడం. ఇక్కడ ఆడేవాళ్లను చూస్తుంటే పోనీలే పిల్లలు అనిపించదు. ఇదేనా సంస్కృతి అనిపించదు. తమను తాము ఇంత నికృష్టంగా ఆనందింపచేసుకుంటున్నారు అని బాధ కలుగుతుంది. అందునా బోలెడు డబ్బు తగలేసి.
ఇక్కడ ఎక్కువమంది చదువుకునే పిల్లల్లా ఉంటారు. అందులో చాలా మంది తల్లితండ్రులు బాగా ధనవంతులై ఉంటారు కాబట్టి వాళ్లకు డబ్బుల ఇబ్బంది ఉండదు. కరెన్సీ నోట్లను పచ్చ కాగితాల్లా వాడుకుంటారు. ఈ విచ్చలవిడి నృత్యాలు, తాగుడు , హోరెత్తించే సంగీతం.... ఇదేనా ఈ యువతకు దొరికిన వినోదం, విలాసం. ఇటువంటి జల్సాలకోసం ఎందరో మధ్యతరగతి అమ్మాయిలు డబ్బున్న యువకులను ఆకర్షించి తమ అందాన్ని, శీలాన్ని తాకట్టు పెట్టి ఈ విలాసవంతమైన ఆనందాన్ని కొనుక్కుంటారు. కొందరు దాన్ని ప్రేమ అని భ్రమపడతారు కూడా. కాని అది కేవలం శారీరక ఆకర్షణ మాత్రమే, శరీరాన్ని ఉపయోగించుకుని తమకు కావల్సినవి పొందడమే తప్ప వేరే ఆలోచన ఉండదు. ఇలాంటి వాళ్లు ముందు ముందు ఎలా ఉంటారో అర్ధం కాదు. అనుబంధం, ఆత్మీయత, అనురాగం అనేది వీళ్లకు ఎప్పుడైనా దొరుకుతుందా. దొరికిందాన్ని వీళ్లు సరైన రీతిలో ఆస్వాదించగలరా? గత అనుభవాలు వాళ్లను వర్తమానం, భవిష్యత్తులో బాధించవా? కాని చాలా మంది యువతీ యువకులు ఇలాంటివన్ని పనికిరాని సెంటిమెంట్లు , అలా మాట్లాడేవాళ్లు ఫూల్స్ (పిచ్చోళ్లు) అంటారు. ఈ క్షణంలో అనుభవించేదే జీవితం అని నిర్ధారించుకుంటారు. నాకైతే ఇలాంటివాళ్లను చూస్తే కోపం రాదు, అసహ్యం వేయదు. బాధ, జాలి కలుగుతాయి. ఎందుకంటే వీళ్ల పరిస్థితికి కారణం ఎక్కువగా వాళ్ల తల్లితండ్రులు. తమ పిల్లలకు పెద్ద పేరున్న స్కూళ్లకు పంపించాము, డిజైనర్ దుస్తులు ఇప్పించాము, వాళ్లకిష్టమైన కార్లు, బైకులు కొనిచ్చాము అడిగినంత డబ్బు ఇచ్చాం. ఇంకా అంతకంటే ఏం చేయాలి. ఐనా వాళ్లు చిన్నపిల్లలా? వాళ్ల బాగు వాళ్లే చూసుకోగలరు. They are grown up అంటారు. ఇదేనా పిల్లలకు తల్లితండ్రులు సమకూర్చవలసింది. ఇంకేమీ లేదా??
12 వ్యాఖ్యలు:
పాశ్చాత్య సంస్కృతి ఇవ్వగలిగిన మానసిక ఆనందం,మందు మగువ ఈరెండుమాత్రమే . తెచ్చుకున్న తలనొప్పి.తరంమొత్తం నిర్వీర్యమై జాతి వయస్సుమల్లిన ఎముకలు కుళ్ళిన సోమరులారా ! అని శ్రీశ్రీ గారన్నట్లుగా తయారవటానికి రహదారి.
ఇలాంటి వాళ్లు ముందు ముందు ఎలా ఉంటారో అర్ధం కా....
మీ బాధ, భ్రమే గాని వారు ఏమి అవరు.... అటువంటి వారికే చక్కటి, ఏమి తెలియని అమాయకులు, ధనవంతులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు దొరుకుతారు. కొండకచో NRI లు కూడా వలలో పడవచ్చు.
కొత్తొక వింత అని అన్నారు కదా.. ఈ సంస్కృతి మనకి పరిచయమై కొద్ది కాలమే కావడం వల్ల ఎక్కడి వరకు వెళ్ళాలి, ఎక్కడ ఆగాలి అన్నది ఎవరికీ తెలియకుండా, ఎవరికీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేలంవెర్రిగా వుంటున్నారు. నా ఉద్దేశ్యం (ఆశ కూడా) ఇది కూడా కొన్నాళ్ళలో సెటిల్ అవుతుంది అని!!. ఈ వెర్రి లో వున్నవాళ్లు తాము కోల్పోతున్నది ఏమిటో, దానినుంచి తామూ పొందుతున్నది ఏమిటో తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టదని!.
ఇలాంటివి అప్పుడెప్పుడో ధనవంతుల ఫార్మ్ హౌసుల్లో జరిగేవి. అప్పటి ప్రభుత్వం విదేశి పెట్టుబడులను ఆకర్షించాలని అనుమతులు ఇచ్చింది. పైగా మనం వుంటున్నది మార్కెట్ ఎకానమీ. కన్సుమరిజం కని విని ఎరుగని వింత పోకడలు పోతున్నది. ఈ మీడియా వీటినన్నిటిని glamarize చేసి చూపిస్తున్నారు.
ఇక టీవీ లో డాన్సు ప్రోగ్రాములలో డాన్సు చేసే వారంతా చిన్న పట్టణాల నుంచి వచ్చిన వారే. వారి దుస్తుల గురుంచి చెప్పనవసరం లేదు.
ఉత్సాహం ఉల్లాసం నృత్యం ఆట పాట వుండాల్సిందే. కాని ఎవరికి అభ్యంతరం కాని విధంగా వుంటే బాగుంటుంది. సాంప్రదాయ వాదులు, సాంప్రదాయ పద్ధతులు విఫలమైన చోట ఇటువంటివి అధికమవుతాయి.
నేను కూడా అటువంటి అమ్మాయిలను చూసా. మొదట్లో నేను కూడా అక్కడికి వచ్చే వారు ధనవంతుల అమ్మాయిలూ, high salary working woman అనుకున్నా, కాని వారి లో ధనవంతుల అమ్మాయిలకంటే ఎక్కువగా ఎస్కార్ట్ గా పనిచేసే మధ్య తరగతి అమ్మాయిలే ఎక్కువ.
వ్యాఖ్య బాగుంది కానీ , ఫొటో తీయడానికని కొంపదీసి మీరు ఆ దరిదాపుల్లోకి కూడ వెళ్ళ లేదుగా?
Hi,
chala baaga rasaru andi.
Sounds good.
Regards
Ramesh
ఈ స్వేచ్ఛ ముసుగు లో పిల్లల్ని వాళ్ళ ఇష్టానుసారం తిరగకుండా కొంతమంది తల్లిదంద్రులిన control చేస్తే బాగుంటుంది అని naa అభిప్రాయం....
TV లో ఒకసారి ఫ్యాషన్ షో చూస్తూ,"ఈ డ్రస్సులు నిజంగా ఎవరైనా వేసుకుంటారా?" అని ఒక చొప్పదంటుప్రశ్న వేసాను. దానికి నామిత్రుడొకడు,"నీకు తెలిసిన పరిధిలో అవి వేసుకునేవాళ్ళు నీకు కనబడకపోతే, నీపరిధి చిన్నదనేతప్ప, అలాంటి దుస్తులు ధరించేవాళ్ళు లేరనికాదురా మూర్ఖుడా!" అని జ్ఞానబోధ చేసాడు.
అందుకే, మన పరిధిలో మన విలువలతో ఈ వీకెండ్ సాంప్రదాయాన్ని(ధోరణి అనకుండా సాంప్రదాయం అనటంలోని ఆంతర్యాన్ని గ్రహించగలరు)కొలవకుండా,ఈ ఆనందాన్ని పొందేవాళ్ళతో కొంత సమాచారం సేకరించగలిగితే,చర్చ అర్థవంతంగా ఉంటుందేమో!
chala baga rasaru.idi chadivi pillalu ardham chesukunte chalu nalanti tandrulu endaro anandistaru.Thank you!
dasam rjy.
జ్యోతి గారు,
వీళ్లగురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మన మానసికారోగ్యానికి.
జ్యోతి గారు,
వీళ్లగురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మన మానసికారోగ్యానికి.
మీరు చెప్పిన విషయం చాలా నిజం. ఈ విషయం లొ అమ్మాయిలు కొంత ఆలొచించాలి.ఆనందం ఎక్కడొ ఉండదు,అది మన మనస్సు లొనె ఉంది.ఆనందం కొసం మనల్ని మనం దిగజార్చు కొకూడదు.
Post a Comment