కనపడుట లేదు....
ఇందుమూలముగా అందరికి తెలియజేయడమేమనగా... గత చాలా కాలంగా ఈ క్రింది బ్లాగర్లు కనిపించుటలేదు. ఎవరైనా వారిని కలిసినచో, తెలిసినచో కాల్చేసి కాని, మేల్చేసి కాని చెప్పగలరు. ఎంత పని వత్తిడిలో ఉన్నా కూడా అప్పుడప్పుడు బ్లాగ్లోకానికి వచ్చి మనందరిని ముఖ్యంగా పాత మిత్రులను పలకరించవలసిందని. వారు మరిచిపోయినా మిగతావారు వారిని ఇంకా మరచిపోలేదు, గుర్తుచేసుకుని బాధపడుతున్నామని తెలియజేయగలరు.
కల్హర - స్వాతి , నువ్వు ఎంత పర్సనల్ పనిలో బిజీగా ఉన్నావో తెలుసు కాని చాలా కాలంగా కల్హర మూగపోయి, వాడినట్టుగా ఉంది. కాస్త దాని సంగతి చూడమ్మా.
వెంకటరమణ - అబ్బాయ్! వెంకటరమణ. ఎంత ఆఫీసులో బిజీ ఐతే మటుకు బ్లాగును, బ్లాగు చదువరుల గురించి పట్టించుకోకుంటే ఎలా. బ్లాగర్ల సమావేశానికి కూడా రావట్లేదు.. ఏంటి సంగతి?
శోధన - సుధాకరా! ఏమైపోయావయ్యా! కాస్త నీ బ్లాగుల గురించి కూడా పట్టించుకో. అలా మర్చిపోతే ఎలా.. నెలకోసారైనా బ్లాగుల దుమ్ము దులపాలిగదా! నీ టపాల కోసం ఇక్కడ అందరూ వెయిటింగ్..
సాక్షి - మురళీకృష్ణగారు, ఏంటండి.. మీరు చాలా నెలలుగా బ్లాగు మొహమే చూడటంలేదు. దొరికిందే సందని చైనీయులు యదేచ్చగా మీ బ్లాగును తమ చెత్త, అర్ధం కాని కామెంట్లకు బాహటంగా ఉపయోగించుకుంటున్నారు. అలా అలా మిగతా బ్లాగులకు కూడా విస్తరిస్తుంటే చూడలేక నేనేమో జంధ్యాల మార్కు తిట్ల దండకం వాడాల్సి వచ్చింది. వారాంతంలోనైనా బ్లాగును గెలకండి. అలా గాలికి వదిలేస్తే ఎలాగండి??
అన్వేషి , జేప్స్, శ్రీరాం - ఎక్కడున్నారండి ? ఇక్కడ మీ పాత మిత్రులు మీకోసం వెతుకుతున్నారు? ఎక్కడున్నారు. ఒక్కసారి ఓ ఏసుకోండి?
ఆలోచనలు, అభిప్రాయాలు - భాస్కర్‌గారు, విదేశాలకు వెళ్లి తిరిగి రాలేదా? మీ ఫౌండేషన్ గురించి విశేషాలు చెప్పడానికైనా బ్లాగు తలుపులు తెరవండి.
ఓనమాలు - లలితా! నాకు తెలుసు మీరు పర్సనల్ పనులతో బిజీగా ఉన్నారని. తీరిక దొరికినప్పుడైనా మీ బ్లాగులో పలకరించండి. మీరు రాయనంత మాత్రానా, బ్లాగు మూసేసినా కూడా మేమందరం మిమ్మల్ని తరచూ గుర్తు చేసుకుని మిస్ అవుతున్నాము. త్వరగా రండి..
గోదావరి - విశ్వనాథ్‌గారు కనపట్టంలేదేంటి? మీ ఇంటాయన సతాయిస్తున్నాడా? వికీలోనే బిజీ ఐపోయి బ్లాగును మరిచారా? ఇది అన్యాయం కదా?
నేను సైతం - నేను సైతంగారు, ఎక్కడున్నా వెంటనే కనపడండి.
లలితగీతాలు - కామేష్ గారు, అలా మాయమైపోయారేంటండి. ఎలా ఉన్నారు? మీ పాటల ఖజానా మూగపోయింది. మీ ఆరోగ్యం ఎలా ఉంది. మీకు వీలు చిక్కినప్పుడు బ్లాగు సంగతి చూడండి. చాలా మంది మిమ్మల్ని మిస్ అవుతున్నారండి.
మూడు బీర్ల తర్వాత - అక్కిరాజుగారు, మీరేంటండి. అలా మాయమైపోయారు? ఉద్యోగనిర్వహణ అనేది అందరికీ ఉంది. అలా అని బ్లాగును పట్టించుకోక, మీ స్నేహితులను మరచిపోవడం దారుణం కదా? మీ రచనలు మీ బ్లాగు ద్వారా ప్రచురించండి .
హృదయ బృందావని - రాధాకృష్ణగారు, మీరు లేక, కనపడక, మీ బృందావని బోసిపోయింది. ఎక్కడున్నారు. వెంటనే బ్లాగుముఖంగా పలకరించండి. కొత్త పాటలో కోసం ఎందరో ఎదురుచూపులు అలనాటి గోపికలలా..
అంతరంగం - తమ్మి ప్రసాదు! ఏంటి ఎంత ఉద్యోగంలో బిజీ ఐతే మాత్రం కంప్యూటర్ ఆన్ చేయడంలేదా? బ్లాగు గుర్తురావట్లేదా? మేమందరం ఉన్నాము, అప్పుడప్పుడు పలకరిద్దామని లేదా? హన్నా? మేమూ ఏదో ఒక పనిలో బిజీగానే ఉంటాము. పనిలేక బ్లాగతున్నామా ఏంటి? అలా అర్ధాంతరంగా బ్లాగ్లోకాన్ని పట్టించుకోకుంటే ఎలా? నీ నుండి ఎన్నో టపాలు ఎదురుచూస్తున్నాము ఇక్కడ.. నెలకోసారైనా బ్లాగు దుమ్ము దులపాలి కదా.
నవీన్, గిరిచంద్ నువ్వుశెట్టి, నిర్మల కొండేపూడి, కల్పన రెంటాల, కరణి నారాయణరావుగారు, కేశవచార్య్, .. ఇంకా ఎందరో పాత మిత్రులు మీరందరు మీ వ్యక్తిగత బాధ్యతల ఒత్తిడిలో బిజీ అని తెలుసు ఐనా కూడావెంటనే మమ్మల్ని పలకరించి, బ్లాగులను పునరుద్దరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను , ఇది నా ఒక్కదాని విన్నపం కాదు. మిమ్మల్ని గౌరవించే, ప్రేమించే అందరు బ్లాగర్ల తరఫున ఒక ఆప్యాయమైన విన్నపం..
21 వ్యాఖ్యలు:
హమ్మయ్య! జ్యొతిగారు వచ్చేసారా. వారం రోజులుగా మీరు ప్రమదావనంలో కూడా కనపడక పొయేసరికి బెంగపెట్టేసుకున్నా. ఇంకో రెండ్రోలుచూసి నేనూ ప్రకటన ఇద్దమనుకున్నా. ఇప్పుడు ఆనందమానందమాయె .
అవునూ చాలా రోజులనుండి" తెలుగువాడిని" గారుకూడా కనపడటం లేదు గమనించారా
మిగిలిన వారి సంగతి తెలుసుకోవాలని నాకూ కుతూహలంగా ఉంది,ఇక కామేష్ గారి సంగతి..ఆయన కొన్ని వృత్తి,కుటుంబ పనుల్లో చాలా చాలా బిజీగా ఉన్నారు.సాధ్యమైనంతత్వరగా మరలా బ్లాగుప్రపంచానికి చేరువౌతాను అన్నారు.
మీరూ ఈ మధ్య కనిపించలేదు!!??
జ్యోతిగారొచ్చాసారోచ్!
అందరి సంగతి సరే! మీరేంటి ఇంతకాలం బ్లాగర్స్ అందరినీ వదిలేసారు. ఒక వారం పాటు ఎవరితో మాట్లాడకూడదని నిర్ణయించుకొన్నారా? లలితగారు చూడండి ఎంత చిక్కిపోయారో.. "నీవు రాక నిదుర రాక" అన్నట్లు, విరహ గీతాలు పాడుకొంటున్నారు. "దివ్వెలు లేని దీపావళి" అంటూ ప్రమదావనంలోని ప్రమదలని కూడా పేరు పేరునా అడిగినట్లున్నారు మీ గురించి.
ఈసారి ప్రమదావన మీటింగ్ లో లలిత గారు! పార్టీ ఇస్తున్నారా మరి? జ్యోతిగారొచ్చేసారుగా.
జ్యోతి గారు ... కొన్ని రోజులు కనపడక పోయేసరికి... కార్తిక మాసం కదా... నోములు వ్రతాలు, ఉపవాసాలు తో బిజీ గా ఉన్నారని అనుకొన్నాను.
ఓనమాలు బ్లాగు డిలీట్ చేశారనుకున్నాను. ఆ బ్లాగు అప్‍డేట్ చేయడం అటుంచి, అసలు తెరవబడడం లేదు :-(
పనిలో పని, బ్లాగువనం శ్రీవిద్యకీ ఓ నాలుగక్షింతలు వేసుండాల్సింది.
......... ఎవరు బ్లాగురాయకపోతే వేరేవాళ్ళకెందుకు... - ఇదేమిటి అనామకుడి కామెంటు లా ఉందేమిటీ అనుకుంటున్నారా? ఎలాగూ ఓ ఊరుపేరు చెప్పుకోలేని నిర్భాగ్యుడెవటో ఇలాంటి కామెంటు రాస్తాడు కదా, ఓపనైపోతుందని నేనే రాస్తున్నా.
అవును మీరు చెప్పిన వాళ్ళు తరచు గుర్తొస్తున్నారు - అడపా దడపా ఒకసారి కూడలిలో మొహం చూపించి పోతే బాగుంటుంది.
గోదావరి విశ్వనాధ్ గారు ఆర్కూట్ లో కనిపిస్తున్నారు అప్పుడప్పుడు.స్వాతి గారు ఇప్పుడు బ్లాగుల జోలికి రాలేరులెండి.ఇప్పుడు ఆవిడ నిర్వహిస్తున్నది సామాన్యమయిన బాధ్యత కాదు కదా.కాస్త వీలు దొరికితె రెస్ట్ తీసుకుందాము అనుకునే సమయం.లలిత గారి బ్లాగు మూసివేతతో నిజం గా ఒక మంచి బ్లాగరిని కోల్పోయినట్టు.ఆవిడ చర్చించే తీరు,వ్యాఖ్యలు రాసే తీరు,స్పందించే విధానం .....ఆ తరువాత లేడీ బ్లాగర్లలో ఎవరూ అలా లేరు.మిగావారిని కూడా మిస్ అవుతున్నాము.త్వరగా వస్తె బాగుండును.
మంచి పని చేశారు. ఇట్టాంటి పనేదో నేనే చేద్దామనుకుంటున్నా. ఈ జనులందరూ ఎక్కడున్నా వెంటనే వచ్చి తమ తమ బ్లాగులని బూజు దులిపి మళ్ళి రాయడం మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా మధ్యక్షా!
జ్యోతి గారు,
నా బ్లాగు గురించి ప్రస్తావించినందుకు ధన్యవాదాలు.
ఆ రోజుల్లో ఎవరూ తెలుగులో బ్లాగులు వ్రాయడం లేదని నేను మొదలు పెట్టానుకాని, నాకు వ్రాయడం అంతగా రాదు. ఇప్పుడు చాలా మంది వ్రాస్తున్నారు కాబట్టి, ఇక నాకు ఆ అవసరం లేకుండా పోయింది. వ్రాయకపోయినప్పటికీ, చాలా వరకు బ్లాగులన్నీ చదువుతూనే ఉన్నా..
బ్లాగర్ల సమావేశాలకు రాకపోవడానికి కూడా ఆఫీసు పని ఏమాత్రం కారణం కాదు. గత 3-4 నెలలుగా సమావేశాలు జరిగిన రోజుల్లో వ్యక్తిగత పనులవల్ల నేను వేరే ఊర్లలో ఉండాల్సి వచ్చింది, అందుకే రావడం కుదరలేదు.
-రమణ.
తెలుగు బ్లాగుల్లో నవ్వులు పూయించిన శ్రీ విద్య, మీనాక్షి, అశ్విన్ కూడా కనిపించటం లేదు. బ్లాగరులు వారిని మరిచిపోలేదు కదా!
అయ్యబాబోయ్! ఇంతమంది కనపడటంలేదని నేనంటుంటే నేనే కనపడటంలేదంటారా?? కాస్త బ్రేక్ తీసుకున్నానంతే! ఎవరైనా నన్ను గుర్తు చేసుకుంటారా లేదా అని టెస్టింగ్ అన్నమాట..
లలిత,
తెలుగు 'వాడి' ని గారు ఇండియాకి వెళుతున్నాని అన్నారు.మరి ఇక్కడినుండి వెళ్లిపోయారో లేదో తెలీదు. ఒకవేళ పెళ్లిచూపులు గట్రా (పెళ్లి కాకుంటే) కార్యక్రమాలలో ఇరుక్కున్నారేమో?
సత్యసాయిగారు,
మీరు మరీను. వ్యాఖ్య చదువుతుంటే హడిలిపోయాను . ఇలా రాసారేంటా అని.
రాధిక,
విశ్వనాథ్‌గారిని కాస్త గోదావరి కబుర్లు చెప్పమని గుర్తుచెయ్యి. స్వాతి సంగతి తెలుసు. కాని తను చాలా కాలంగా ఎమీ రాయడంలేదు కదా.
ఇక స్రీవిద్య ఆన్‌లైన్ కనపట్టంలేదు. కనుక్కుందాం తన సంగతి. ఇక మీనాక్షి పరీక్షలంది. అశ్విన్, మురళి ఎవరో అమ్మాయి గొడవల్లో ఇరుక్కునారుగా. అందుకే కనిపించటంలేదేమో??
మర్చిపోయా కందర్ప కృష్ణమోహన్, రవి వైజాసత్యలు కూడా తమ బ్లాగుల సంగతే మర్చిపోయినట్టున్నారు. మీరిద్దరు ఎక్కడున్నా వెంటనే రావలసిందని హెచ్చరిక..
స్వామి శరణం. నేను అయ్యప్ప దీక్షలో ఉండి బ్లాగులకి కొంచెందూరంగా ఉన్నా. అంతే అంతే వేరే ఏ ఇతర కారణాలు లేవు. ఎవరయినా కొత్తవాళ్ళు, అనామకులు ఈ వ్యాఖ్యలు నిజమనుకుంటారు అశ్విన్ గురించి, నా గురించి.
భలె భలే... అదీ జ్యోతక్కంటే. నిజమైన నాయకురాలు. ఇకనైనా అందరు బ్లాగర్లు క్రమం తప్పక బ్లాగుతుంటారని ఆశిస్తూ...
ఈ మధ్యన ఘోరక్ ప్రెస్ వారి రామాయణం చదవటం మొదలు పెట్టా దానితో కుస్తీ పడుతున్నాను అందులకు. త్వరలో మళ్ళీ.. కానీ టపాలన్నీ చదువుతునే ఉన్నానండి. మురళీ నీకు ధన్యవాదలు. మురళీ బ్లాగులో మంచి ఐడియా ఓటిచ్చాడు చూడండి బావుంది.
"దా దా" లందరూ మళ్ళీ వస్తే ,మా లాంటి "ఛోటా"ల పరిస్థితి ఏమిటి ?
తలచుకొంటేనే భయంగా ఉంది.
రండి,రండి పాత బ్లాగు వీరులారా,
టపాల రెక్కలపై ఎగిరిరండి.
చిరకాల అనుభవ శూరులారా,
కొత్త వారల కలుపుకోండి
మీకిదే మా మనసుల స్వాగతం
blogers meetings eppudu ,yenduku, yela jarugutayo vivarinchagalara jyoti garu?andulo palgonadaniki kavalisina arhatalu?
మళ్ళీ వ్రాయాలి. అందరూ మళ్ళీ వ్రాయాలి.
jyothi garu mee articles chadivinanu.chalasanthosham kaligindi.
meeblogku chendina anniartclesnu sramaanukokunda
pampagalaru.
meenunchi inkamarinni articles vastayanna
aakankshatho
ramachary bangaru.086863 256312 (r)9951921110
రవిగారు,
హైదరాబాదు బ్లాగర్ల మీటింగ్ ప్రతి నెల రెండవ ఆదివారం జరుగుతుంది. ఇందులో పాల్గొనడానికి అర్హతలు తెలుగును అభిమానించేవారైతే చాలు. బ్లాగు ఉన్నా లేకున్నా. దీనికి సంబంధించిన వివరాలు etelugu.org లో చూడండి.
రామాచారి గారు,
నా బ్లాగులన్నింటిలో కలిపి సుమారు 1700 పైన పోస్టులు ఉన్నాయి. నా మెయిన్ బ్లాగులో 500 వరకు ఉన్నాయి. ఇవన్నీ పంపే ఆలోచన కూడా నేను చేయలేను. మీకు తీరికున్నప్పుడు చదువుకోండి. దీనికంటే ముందున్న బ్లాగు కూడా చూడండి. http://vjyothi.wordpress.com
శ్రీకాంత్
అంత భయమెందుకు. ఇక్కడ వయస్సును , సీనియారిటీని బట్టి ఎవరు పెద్ద ఎవరు చిన్న అని బేధాలు లేవు. వారు రాసే రచనలు, ఆ బ్లాగర్లతో ఉన్న అనుబంధమే ఒకరికొకరిని దగ్గిర చేస్తుంది. ఇందులో కొత్తవారికొచ్చిన ప్రమాదమేముంది. ఎవరి బ్లాగు వారిదే. ఎవరి రాత వారిదే. ఎవరి పేరు వారి రాతల వల్ల వచ్చిందే.
> ఈ మధ్యన ఘోరక్ ప్రెస్ వారి రామాయణం చదవటం మొదలు పెట్టా దానితో
అయ్యా అశ్విన్ గారు,
అది గోరఖ్ పూర్ ప్రెస్ . ఒక వూరి పేరు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఘోరక్ కాదు :-)
-- శ్రీనివాస్
అవును శ్రీనివాస్ గారు గోరఖ్ ప్రెస్ యే ఘోరఖ్ కాదు :-)
Post a Comment