అమరవీరులకు అశ్రునివాళి
సుమారు అరవై గంటల పాటు ఉగ్రవాదులతో జరిపిన పోరాటం ముగిసింది. రెండు రోజులుగా ఆ దృశ్యాలు చూస్తూ మనసు మొద్దుబారిపోయింది. ఎం మాట్లాడాలో. ఎలా స్పందించాలో అర్ధం కాలేదు. ఎంతో పటిష్టమైన ప్రణాళికతో , భారీ ఆయుధ సామగ్రితో వచ్చి దాడి చేసిన ముష్కరులను మన సైనికులు ఎంతో సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. వాళ్ళను చూస్తుంటే అనిపించింది... ఎంత ధైర్యంగా పోరాడుతున్నారు. రాత్రి లేదు, పగలు లేదు, చలి లేదు, ఆకలి గుర్తు రాదు. ఉగ్రవాదులను మట్టుపెట్టడమే తప్ప వేరే ఆలోచన లేదు. వాళ్లు రక్షించాల్సింది ఉత్తర భారతీయులా, దక్షిణ భారతీయులా, భారతీయులా, విదేశీయులా, తెలంగాణా, మాదిగా , అని అనుకోరు కదా. సినిమాలలో మాత్రమె చూడగలము అనుకున్న సన్నివేశాలెన్నో ప్రతినిమిషం కళ్ళముందు కనిపించాయి. బ్లాక్ క్యాట్ కమాండోలు, మార్కోలు, పోలీసులు అందరు కలిసి ,, తమ ప్రాణాలు, తమ కుటుంబాల గురించి కూడా లెక్క చేయకుండా ముందుకు సాగారు. ఆ పోరాటంలో అసువులు బాసిన వీరులకు కన్నీటి వీడ్కోలు. వీరందరికీ మనము రుణపడి ఉన్నాము కదా. వాళ్లు పోరాడింది ముంబై కోసము కాదు .. దేశం కోసం మాత్రమే. .. ఇలాంటి నిస్వార్ధ సైనికులను రాజకీయనాయకుల భద్రతకు నియమించడం అవసరమా... ఈ సైనికులకు, యువతకు మన దేశాన్ని, ప్రజల భద్రతను అప్పగించడం మేలేమో అనిపిస్తుంది. మన చేతిలో ఉన్నా ఆయుధం .. ఓటు.. అది కాస్త ఆలోచించి .. కనీసం ఇప్పుడైనా సరిగ్గా ఉపయోగించుకోవాలి . లేదా దేవుడా నీవే దిక్కు అని గాలిలో దీపం పెట్టాలేమో..
ఈ అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించండి.. ఇక్కడ...
2 వ్యాఖ్యలు:
మనం ఇంట్లో వెచ్చగా కూచుని టీవీ లో వార్తలు చూస్తుంటే వాళ్ళు మనకోసం ప్రాణాలొదిలారు.
మన కోసం..మనకోసం....!
ఈ రోజు ఉన్ని కృష్ణన్, గజేంద్ర సింగ్ ల అంత్యక్రియలకు హాజరై వారి మృతదేహాలకు శాల్యూట్ చేస్తున్న ప్రజలను చూస్తుంటే ధైర్యంగా ఉంది. మనలో దేశభక్తి చావలేదు. స్పందిచే గుణం చావలేదు ..అని నమ్మకంగా ఉంది.
సినిమాల్లో తప్ప చూడని దృశ్యాలు టీవీలో లై చూస్తుంటే గుండెకు చెమటలు పట్టడమంటే ఏమిటో తెలిసింది. ప్రాణాలకు హామీ లేదని తెలిసీ బరిలోకి దూకిన యోధులు వారు.
వీరుడెపుడూ మరణించడు. జనం గుండెల్లో బతికే ఉంటాడు.
ఇంతకంటే ఏం చెప్పాలో తెలియక మూగబోయింది మనసు.
సుజాతగారు నిజమే. అసలు ఏం మాట్లాడాలో, ఎలా స్పందించాలో తెలీడంలేదు. మనమేమో వెచ్చగా ఇంట్లో కూర్చుని టివి చూస్తున్నాము. ఆ వీరులకు ఉగ్రవాదులను మట్టుబెట్టాలన్న ఆలోచనే వారి అణువణువు మరిగిస్తుందేమో..
Post a Comment