Thursday, November 27, 2008

భగవంతుడా!! నీవే దిక్కు!!!..

నిన్నటి అమావాస్య నిశీధిలో సుమారు పది చోట్ల ముంబైలో తీవ్రవాద దాడి జరిగింది. పెట్రోల్ బంకు పేల్చివేత, స్టార్ హోటళ్ల ఆక్రమణ, అమాయక ప్రజలపై కాల్పులు .. ఇవి చూస్తూ నోట మాట రావడంలేదు. దీనికి బాధ్యులు ఎవరు? బాధితులు చేసిన నేరమేమిటి?

దుండగులు ఎంచక్కా రబ్బర్ బోట్లలో వచ్చి భారీ పేలుళ్లు సృష్టంచారు.

మనకోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న సైనికులకు పాదాభివందనం..

నాయకుల్లారా!! దయచేసి ఈ ఉదంతాన్ని రాజకీయం చేసి , మీ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించకండి...

14 వ్యాఖ్యలు:

మురళీ కృష్ణ

"నాయకుల్లారా!! దయచేసి ఈ ఉదంతాన్ని రాజకీయం చేసి , మీ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నించకండి..."

ఆ ఒక్కటీ అడగొద్దు...!

ravigaru

e duscharyani mem tivram ga khandistunnam ane badulu a pm garo homeministaro velli tivravadulno khandichochhu ga?ika nunchi desam lo jarige tivravada nirmulana operations lo padavilo unna rajakiyanayakulu andaru tappani sariga palu panchu kovalani rajyanga sawarana teste appudu nijamaina desabhaktule padavullo untaru.tivravadulu pranalaki teginchi vachhi vidwamsam srustistunte dani nirodhinchavalasina cm pm pranalni panam ga petty yenduku rangam lo dukaru. okkasari ne cheppina vidham ga rajyanga sawarana cheste yevadi cinimalu vadu vesukuntu ,yevari busciness lu vallu chesukuntu rajakiyalaloki nijamaina desabhaktule vastaru. antavaraku ila khandichadalake parimitam .

Anonymous

ఏ.సి రూముల్లో మీటింగులు పెట్టి మైకులముందుకొచ్చి ఖండిస్తున్నాము అని అనేసి బట్టనక్కుండా కారెక్కి వెళ్ళిపోయే రాజకీయనాయకులు, పగలూరాత్రి తేడాలేకుండా తిందీ నీరువదిలి ఏక్షణానైనా తమప్రణాలు గాలిలో కల్సిపోవచ్చని తెలిసీ తెగించి ప్రజలకోసం పోరాడుతున్న వీర సైనికుల కాలిగోటికి కూడా సరిపోరు . అటువంటి వీరులకి నిజమైన హీరోలకి ఎన్ని పాదాభివందనాలు చేసినా తక్కువే

సుజాత

నాకు మాటలు కూడా మిగల్లేదు నా మనసులో మాట చెప్పడానికి! ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు.

krishna rao jallipalli

చాలా బాధాకరమైన సంఘటన. ఇదేమీ వింతో గాని, ఇటువంటి విధ్వంసాలు జరిగినప్పుడు ఈ నాయకులు, మంత్రులు, MLAs, MPs కి ఉచ్చ పడి అమాంతంగా తమ తమ security ని పెంచేసుకొంటారు. వారికే కాదు వారి కుటుంబ సభ్యులకి, బావమరుదులకి కూడా. జనాలు ఎలా పోయినా వీరికి ఫర్వాలేదు ఈ కొడుకులకి.

te.thulika

సుజాత చెప్పినట్టు ఏం చెప్పడానికీ తోచడం లేదు.

bhagavan cartoons

జ్యోతి గారూ... నాది కూడా మీ అభిప్రాయమే....!

Rajesh

tree_saves_u:
deeniki bhadyulu evaru ani adigaru...meere deeniki badhyulu...enthasepu edaina jariginda ventane evari meedo okari meeda valle badhyulani declare chesthe kaani manaki shanti vundadu....meere bhadhyulu ani enduku anukoru..mee inti chuttupakkala evaru evaru vunnaro eppudaina chusara...meeru bayataki vellinappudu kaani emaina gamaninchara...ledu cheyyam...malli edaina jarigithe vallu badhyulu veellu badhyulu ani godava...poni meeru cheppandi meeru emichestharu ?

krishna rao jallipalli

రాజేష్ గారు..అన్నీ మనం చేసుకొంటే, చూసుకొంటే, ఇక కుర్చిలో కూర్చునే ఈ నాయకులు, జీతాలు తీసుకొనే ఉద్యోగులు ఎందుకు?? కొడుకులు కమిషన్లు, లంచాలు తీసుకోవదానికా?? జనాల ప్రాణ, మాన, ధన రక్షణ కేవలం ప్రభుత్వానిదే, ప్రబుత్వాని నడిపించే వారిదే ముమ్మాటికీ. ఎవరి రక్షణ వారే చూసుకునే దానికి ఈ కొడుకులంతా ఎందుకు?? సంతాపాలు, శ్రన్దంజలి ఘటించదానికా , నష్ట పరిహారం (నా కొడుకులు కి దీంట్లో కూడా కమిషన్లె మళ్ళా) ప్రకటించ డానికా?? పూర్తి బాద్యత ప్రభుత్వానిదే.

జ్యోతి

రాజేష్ గారు,,
మన ఇల్లు, చుట్టుపక్కల జరిగే విషయాలు మనం జాగ్రత్త పడగలం. ఇలాంటి సంఘటనలకు బాధ్యులు ప్రభుత్వం కాదా? మనం వాళ్లని ఎన్నుకున్నది ఎందుకు?

ప్రధానమంత్రి నింపాదిగా సందేశం ఇచ్చి, తన క్రింద పని చేసే చప్రాసిని పిలిచినట్టు, పాకిస్తాన్ ISI ఛీఫ్ ని రమ్మంటే వస్తారా?

మహరాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంటాడు.. పెద్ద పెద్ద నగరాలలో ఇలాంటివి జరుగుతాయి .. మామూలే.. ఇంత భీబత్సం జరిగితే ఇలాగేనా మాట్లాడేది. సిగ్గు, శరం ఉందా అసలు? ఇలాంటి చెత్తనాయాళ్లనా మన నాయకులను చేసింది..

అందుకే నేను చెప్పేది. ఇప్పటికైనా మనం మన ఓటుని సరైన విధంగా ఉపయోగించుకోవాలి..

Rama

ఇలాంటి చెత్తనాయాళ్లనా మన నాయకులను చేసింది..

I think we can use better language than this when discussing in public. If you agree or not he is PM of India you should respect that post.

btw what do you meant by
తన క్రింద పని చేసే చప్రాసిని పిలిచినట్టు, పాకిస్తాన్ ISI ఛీఫ్ ని రమ్మంటే వస్తారా?


can we put red carpet for them ok? do you mean that ?

జ్యోతి

ramagaru,

sorry i didnt mean insulting our PM. but i was very angry with the comments of deputy CM of maharashtra... that this kind of incidents happen. i controlled myself a lot not to be abusive..

and we need not even call or invite the pakistan officials. why would they come on this ... and should we still have something to talk to pakistan, when we have enough evidence against them.. i feel its best to just bombard the terrorist camps in pakistan. ..

మగవాడు

మనం ఎన్నుకున్న నాయకులేగా వారు?

శ్రీలలిత

జ్యోతీగారూ,

కడుపులో చల్ల కదలకుండా కూర్చుని ఎన్ని కబుర్లైనా చెప్పొచ్చు. నిజమైన హీరోలంటే మన జవానులే. జైహింద్..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008