Friday 5 December 2008

బాల గాన గందర్వులు



బోసి నవ్వుల పాపాయిలు, పశువులు , పాములు ఇలా అన్నీ పాటకు పరవశిస్తాయంటారు. పెద్ద వాళ్లు, కాస్త ఎదిగిన పిల్లలు తమ మధురమైన గొంతులో పాటలు పాడుతుంటే ఆనందంగానే ఉంటుంది. అది వారు కష్టపడి సాధిస్తారు. కాని ముద్దు ముద్దు మాటలతో మనల్ని అలరించే పిల్లలు అద్భుతమైన పాటలు అలవోకగా పాడేస్తుంటే అలా కళ్లు , చెవులు తెరుచుకుని వినాలనిపిస్తుంది. అదే అద్భుతం ఈ సారేగమప పోటీలో జరుగుతుంది.. అసలు ఈ పిల్లలు నిజంగా పిల్లలేనా లేక గాన గంధర్వులు దిగి వచ్చి పాడుతున్నారా అని అనిపించక మానదు. ఒక్కోసారి న్యాయనిర్ణేతలు కూడా అలా ఆశ్చర్యచకితులై పోతారు. ౨౦-౩౦ మంది పిల్లలతో మొదలయ్యే పోటీ చివరి పదిమంది నుండి ఉత్కంఠ భరితంగా ఉంటుంది. నేనైతే ఆ సమయంలో టీవీ రిమోట్ ఎవ్వరికి ఇవ్వను. చానెల్ మార్చాను ఎంత మొత్తుకున్నా సరే. ఒకసారి షణ్ముఖ ప్రియ పాట వింటూ అలా నిలబడిపోయి అన్నం మాడగొట్టాను.





దామిని, గణేష్, యశస్వి, శ్రీలలిత, సాహితి, శ్రావ్య, నిఖిల్ . షణ్ముఖ ప్రియ ఇలా కొందరు చిన్నారులైతే ఎంత అద్భుతంగా పాడుతున్నారో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒకటి రెండు రోజులలోనే నేర్చేసుకుంటారంట ఎ పాటైనా.. చివరి అంకంలో కష్టమైన పాటలు కూడా ఎంతో సులువుగా పాడేస్తుంటే జడ్జీలకు కూడా వాళ్ళను ఏమని అభినందించాలో మాటలు రావు. వీళ్ళంతా పాడుతుంటే వినడం కూడా అదృష్టం అనిపిస్తుంది. ఆ బంగారు కొండలను కన్నా తల్లితండ్రులు ఎంత ధన్యులో కదా అనిపిస్తుంది. ఇందులో ఒక్కరు కూడా బలవంతంగా కాని ఒత్తిడితో పాడుతున్నట్టు కాని అనిపించదు. ఆ పిల్లలు కూడా ఎంతో ఆనందిస్తూ ఒక్కో పాట పాడుతుంటే మనకు చెప్పలేనంత ఉద్వేగం కలుగుతుంది. ఒక్కోసారి కళ్ళలో నీళ్లు రాకమానవు..కొందరు చిన్నారులకు ఈ పోటీ అంటే కూడా తెలియుడు. బాగా పాడాలి మంచి గ్రేడ్ తెచ్చుకోవాలి అంతే. వేరే ఏవీ అక్కరలేదు. మంచి గ్రేడ్ వస్తే వాళ్ల మొహాలు మతాబుల్లా వెలిగిపోతాయి. చివరిలో శ్రుతులు మార్చి ఇచ్చినా కూడా చాలా సులువుగా పాడేస్తున్నారు ఎంతో అనుభవమున్న గాయకుల్లా. పాడేటప్పుడు వాళ్ళను ఎవరో గాంధర్వ గాయకులూ ఆవహించారేమో అని అనిపించక మానదు..

ఈ పిల్లలు అలనాటి ఆణిముత్యాల్లాంటి పాటలు పాడుతుంటే ఘంటసాల, జిక్కి, రాజేశ్వరరావు మొదలైన ప్రముఖులెందరో మన కళ్ళముందు కదలాడుతారు. ఆహా ఎంత మంచి సంగీతం, ఎంత మంచి సాహిత్యం. ఇంత మంచి మంచి పాటలు మన సొంతం కదా అనిపిస్తుంది. ఆ మహానుభావులందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు చెప్పని సంగీత ప్రియులు ఉండరేమో..

కాని కొందరు .. కొందరు ఎంటి చాల మంది రాయడానికి శక్తి లేకో, సమర్ధత లేకో మధురమైన పాతపాటలను రీమిక్స్ చేసి ఖూని చేస్తున్నారు. నాకైతే ఆ పాటలు చూస్తుంటే వాడిని తన్నాలనిపిస్తుంది. వినేవాళ్ళను కూడా తిడతాను. ఆ పాటల ఒరిజినల్స్ వినండి అని చెప్తాను. వాళ్లు రాయలేకపోతే ఊరుకోవాలి కాని మంచి పాటలు ఎందుకు ఖూని చేస్తారో అర్ధం కాదు.

స్పెషల్ న్యూస్..
ముంబై భామ ముమైత్ ఖాన్, ఈటీవీ ప్రభాకర్ (గుర్తున్నాడా) కలిసి జగడం అనే ప్రోగ్రాంతో జనాలను పిచ్చేక్కించడానికి వస్తున్నారు. జాగర్తగా ఉండండి.. తర్వాత మీ ఖర్మ..

7 వ్యాఖ్యలు:

krishna rao jallipalli

నిజ్జం.. ఆ చెకుముకి సూపర్. చాలా బాగా పాడుతున్నారు ముచ్చటగా.
వామ్మో.. ఆ చానల్ పేరు చెప్పండి ముందు.. వీలు అయితే.

జ్యోతి

జీ తెలుగు చానెల్ లో ప్రతి బుధ గురువారాలు రాత్రి తొమ్మింది గంటలకు వస్తుంది. వచ్చేవారం ఫైనల్స్ ..

Dileep.M

మా నాన్న గారి statement తెలుసా



ZEE రాని TV కూదా TV ఏనా (sun direct అందుకే పెట్టించుకోలేదు Sun వాదిని తిట్టిపోసారు అప్పుడు వాది మొహం చూడాలి . ) అని


---

ఇప్పుడు మా అమ్మా నాన్న కి అదే కాలక్షేపం.
---
మా అమ్మా నాన్నే కాదు ఇక్కడ అందరూ నిద్ర వస్తున్నా ఆపుకొనీ,repeated telecast లు చూస్తున్నారు

---

నేను మొన్న వచ్చి చూసినప్పుదు ఆశ్చర్య పోయా..
---

hindi లో already famous program.

--

బుజ్జి

షణ్ముఖ ప్రియ విషయంలో మాత్రం నేను మీతో ఏకీభవించలేను (మా మమ్మీకి కూడా సేం ఫీలింగ్). అంత చిన్న పాప అన్ని పాటలు గుర్తుంచుకుని పాడటం గొప్ప కావచ్చు,కానీ పదాలు పలకటం కూడా పూర్తిగా రానంత చిన్న పిల్ల. ఆ పాప పాడుతుంటే ముద్దుగా అనిపిస్తుందేమో గానీ బాగా పాడినట్టు మాత్రం అనిపించలేదు.మిగిలిన పిల్లలతో ఈ ప్రాబ్లం లేదు. వాళ్ళల్లో కొందరు నచ్చుతారు బాగా నాకు

పరిమళం

జ్యోతి గారూ !నేను కుడా సరి గ మ ప కు రెగ్యులర్ వ్యూయర్నె.పైగా షణ్ముఖ ప్రియ కి ఫాన్ ని కూడా .మీ రివ్యూ
బావుందండీ .

జ్యోతి

తెలుగు చదవడం, రాయడం కూడా రాని షణ్ముఖప్రియ తప్పులు, శృతి తప్పకుండా పాడుతుంది అంటే అద్భుతం కాదా బుజ్జిగారు. కాని నాకు సాహితి గొంతు చాలా బాగుంటుంది. జిక్కిగారిలా ఎంతో విలక్షణంగా ఉంటుంది.

Unknown

I Think there should be a limit to appreciate the talent that Shanmukha priya has. Surely she has got the super talent for her age, but she cannot be continued for that one reason to compete and kick some great singing talents like Tejaswini from the contest. I am strongly feeling there are some political decisions coming in to picture in continuing that kid.

and I dont agree with you on her Shruti also. It is not at all audible.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008